
సాక్షి, తిరుమల: తిరుమలలో కలకలం సృష్టించిన కిడ్నాప్ కేసును పోలీసులు 20 నిమిషాల్లో ఛేదించారు. ఆదివారం శ్రీవారి దర్శనానికి వచ్చిన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంకు చెందిన హనుమంతరావును గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు దుండగలను పోలీసులు అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏఎస్పీ ముని రామయ్య సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులను హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆదివారం రాత్రి నెల్లూరు జిల్లాకు చెందిన హనుమంత రావు అనే వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు తిరుమలలో కిడ్నాప్ చేశారని చెప్పారు. భర్త కిడ్నాప్‌కు గురి కావడంతో హనుమంతరావు భార్య 100కు డయల్ చేసి సమాచారం అందించారని తెలిపారు.
అక్కడే విధులు నిర్వహిస్తున్న రక్షక సిబ్బంది ఇన్నోవా వాహనాన్ని వెంబడించి అలిపిరి వద్ద కిడ్నాపర్స్‌ను 20 నిమిషాల వ్యవధిలోనే పట్టుకున్నట్లు వెల్లడించారు. ఆర్థిక లావాదేవిల కారణంగానే హనుమంత రావును కిడ్నాప్ చేసిన ఏఎస్పీ పేర్కొన్నారు. నిందితులైన కుమార్, సురేష్, మూర్తినలు అదుపులోకి తీసుకుని ఇన్నోవా వాహనాన్ని సీజ్ చేశామన్నారన్నారు. వీరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు నమోదు చేసిన రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. దుండగుల ఇన్నోవా వాహనాన్ని వేగవంతంగా వెంబడించి కేసును 20 నిమిషాల్లో ఛేదించిన రక్షక టీం కానిస్టేబుల్స్ మణికంఠ, శేఖర్ హోంగార్డు వెంకటేష్‌లకు ప్రశంస్తూ వారికి ఏఎస్పీ రివార్డు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment