
సంధ్య (ఫైల్) రోదిస్తున్న బాలిక తల్లి
నెల్లూరు, దొరవారిసత్రం: గుర్తుతెలియని వ్యక్తి తొమ్మిదేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఘటన శుక్రవారం రాత్రి స్థానిక వీఎస్‌ఆర్‌నగర్ ఎస్టీకాలనీలో చోటుచేసుకుంది. కాలనీవాసులు, పోలీసుల కథనం మేరకు.. కాలనీకి చెందిన బూదూరు అశోక్, కృష్ణమ్మ దంపతులకు కుమార్తె సంధ్య, కుమారుడు సంతోష్ సంతానం. అశోక్ తండ్రి ముత్యాలుతో గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం ఉదయం నుంచి ఉన్నాడు. ఇద్దరూ సాయంత్రం వరకు ఫూటుగా మద్యం తాగారు. అప్పటివరకు ఇంటి వద్దనే ఉన్న సంధ్య సాయంత్రం 8 గంటల నుంచి కనిపించలేదు. దీంతోపాటు గుర్తుతెలియని వ్యక్తి కూడా కనిపించలేదు. చుట్టుపక్కల గాలించారు. బాలిక ఆచూకీ తెలియకపోవడంతో కిడ్నాప్‌కు గురైందని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. బాలిక టపాయిండ్లు ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదుతోంది.
Comments
Please login to add a commentAdd a comment