
సాక్షి, పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం పోతవరంలో ఓ యువకున్ని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. బుధవారం పోతవరం సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఆ యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి వంశీ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.50లక్షలు ఇస్తే విడిచిపెడతామని అన్నారు.
దీంతో ఏం చేయాలో తెలియని యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుండగులు రూ.50లక్షలు డిమాండ్ చేశారని యువకుడి తండ్రి పోలీసులిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment