సాక్షి, హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు భూమా అఖిలప్రియకు మరోసారి కోర్టులో చుక్కెదురయ్యింది. సికింద్రాబాద్ కోర్టు అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించింది. సోమవారం భూమా అఖిలప్రియ బెయల్ పిటిషన్‌ని విచారించిన సికింద్రాబాద్ కోర్టు.. జీవిత కాలం శిక్ష పడే నేరాలు తమ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. పిటిషన్‌ని రిటర్న్ చేసింది. ఈ నేపథ్యంలో అఖిలప్రియ మరోసారి నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్‌ని దాఖలు చేయనున్నారు. ఇక అఖిలప్రియపై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు మెమో ధాఖలు చేసిన పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 395 డెకయిట్ (దోపిడీ)కేసు నమోదు చేశారు.
(చదవండి: ఐటీ అధికారులుగా ఎలా నటించారంటే.. )
Comments
Please login to add a commentAdd a comment