గౌరవ్, వినీతలకు టెన్నిస్ టైటిల్స్ | gourav,vinitha tennis tournment | Sakshi
Sakshi News home page

గౌరవ్, వినీతలకు టెన్నిస్ టైటిల్స్

Published Wed, Apr 30 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM

gourav,vinitha tennis tournment

సాక్షి, హైదరాబాద్: ఏఐటీఏ ఆలిండియా ర్యాంకింగ్ టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో గౌరవ్ కుర్వ, ఎం.వినీతలు టైటిల్స్ చేజిక్కించుకున్నారు. బోయిన్‌పల్లిలోని టీఆర్ స్పోర్ట్స్ టెన్నిస్ సెంటర్‌లో మంగళవారం ఫైనల్ పోటీలు జరిగాయి.
 
 అండర్-14 బాలుర సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ గౌరవ్ 6-2, 7-6 (7/5)తో టాప్ సీడ్ సంచిత్ సిక్కాను కంగుతినిపించాడు. బాలికల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ వినీత 2-6, 6-0, 6-2తో సృ్మతి బాసిన్‌పై గెలుపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement