
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేయబోయింది. ఈ సంఘటన బోయినపల్లి పోలీసుస్టేషన్ ఎదుట శుక్రవారం జరిగింది. వివరాల ప్రకారం.. బోయినపల్లికి చెందిన కీర్తి రెడ్డి(18), భవానీ శంకర్(22)లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు ఒప్పుకోరనే అనుమానంతో రహస్యంగా 4 రోజుల క్రితం కూకట్‌పల్లిలోని ఆర్యసమాజ్‌లో ప్రేమవివాహం చేసుకున్నారు.
కాగా శుక్రవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని పోలీసులను ఆశ్రయించారు. అమ్మాయి తల్లిదండ్రులు,బంధువులు కలిపి సుమారు 60 మంది బోయినపల్లి పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. తమ అమ్మాయిని తమకు అప్పగించాలని ఆందోళన నిర్వహించారు. చర్చలు కొనసాగుతున్నాయి.