హైదరాబాద్లో ఓ ట్రేడింగ్ కంపెనీ బోర్డు తిప్పేసింది.
హైదరాబాద్: హైదరాబాద్లో ఓ ట్రేడింగ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. బోయిన్‌పల్లి కేంద్రంగా నడుస్తున్న ఎక్స్‌పర్ట్ ట్రేడింగ్ కంపెనీ ఖాతాదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసింది.
స్టాక్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టి లాభాలు చూపుతామంటూ పలువురి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసింది. వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి దాదాపు రూ.నాలుగు కోట్ల వరకు డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఈ కంపెనీ గత కొద్ది రోజులుగా కార్యకలాపాలు నిర్వహించకపోవడంతో బాధితులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.