
సాక్షి, హైదరాబాద్: బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత సోమవారం రాత్రి జరిగిన చోరీ కేసులో.. సొంత కోడలే అత్తింట్లో భారీ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. భర్తతో కాపురం సజావుగాలేని కారణంగానే కోడలు ఈ చోరీకి పథకం పన్నిందని వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వారం రోజుల్లో కేసును ఛేదించి సోమవారం వివరాలు వెల్లడించారు.
గత సోమవారం (ఈ నెల 21న) సాయంత్రం సరళ తన కొడుకును సికింద్రాబాద్‌లో డ్రాప్ చేసి వచ్చేసరికి ఆగంతకులు ఇంట్లోకి చొరబడి బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై సరళ ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును చేధించిన పోలీసులు.. ఈ చోరీకి సరళ కోడలు సుప్రియతోపాటు ఆమె తల్లిదండ్రులు, సోదరుడు సహకరించారనే విషయం కనుగొన్నారు. సుప్రియ, ఆమె భర్త ధీరజ్ మధ్య కాపురం సజావుగా సాగకపోవడంతోనే.. వారు ఈ దుస్సాహసానికి ఒడిగట్టారని వివరించారు. దొంగతనానికి సుప్రియ సోదరుడు సాత్విక్ సూత్రధారని, అతనే పథకం పన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు కేజీల బంగారు అభరణాలు, రూ. 80 లక్షల విలువైన 6.5 కేజీల వెండి, వెగనార్ కారు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొన్నామని పేర్కొన్నారు. నిందితులు మారు తాళంతో ఇంట్లోకి చొరబడి ఈ దొంగతనం చేశారని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment