
చెల్లాచెదురుగా పడేసిన దుస్తులు
జవహర్‌నగర్: తాళం వేసి ఉన్న ఇంటిపై కన్నేసిన దుండగులు ఇంట్లోకి చొరబడి బంగారం, వెండితో పాటు నగదును అపహరించుకుపోయారు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యాప్రాల్ మైత్రీ ఎంక్లేవ్‌లో జరిగింది. జవహర్‌నగర్ డీఐ నర్సింగరావు తెలిపిన మేరకు.. యాప్రాల్‌లోని మైత్రీ ఎంక్లేవ్ ప్లాట్ నెంబర్ 134లో దానం నర్సింగరావు కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. సోమవారం ఉదయం ఇంటికి తాళం వేసి యాదగిరిగుట్టకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. అర్ధరాత్రి వంట గదికి ఆనుకుని ఉన్న కిటికి గ్రిల్‌ను తొలగించి వంట గది తలుపును తెరిచి ఇంట్లోకి చొరబడిన దుండగులు బెడ్‌రూంలోని బీరువాలో ఉన్న 50తులాల బంగారం, 5 కేజీల వెండితో పాటు రూ.50వేల నగదును అపహరించుకు పోయారు. మంగళవారం ఉదయం పనిమనిషి ఇంటి వద్దకు వచ్చే సరికి ఇంటి వెనక బాగంలో ఉన్న వంట గది తలుపు తెరిసి ఉండడంతో మైత్రీ ఎంక్లేవ్ సభ్యులకు తెలిపింది. వెంటనే వారు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఘటనా స్ధలాన్ని మల్కాజిగిరి డీసీపీ రక్షిత, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్‌లు చేరుకుని సమీపప్రాంతాలను పరిశీలించారు.