సాక్షి, హైదరాబాద్ : బోయిన్‌పల్లి డైరీ ఫామ్ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగమణి అనే మహిళ ఆదివారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటనపై బోయిన్‌పల్లి సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘‘ ఆదివారం ఓ మైనర్ బాలుడు మారుతి వాహనాన్ని అతి వేగంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టాడు. బోయిన్‌పల్లిలో డైరీ ఫామ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినపుడు ఆటోలో ఇద్దరు కవల పిల్లలతో పాటు నాగమణి, సంధ్య అనే ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నిన్న ప్రమాద స్థలంలోనే 14 నెలల పిల్లాడు మృతి చెందాడు.
అదే రోజు రాత్రి చికిత్స పొందుతూ పిల్లాడి నాన్నమ్మ నాగమణి కూడా మృతి చెందింది. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తాం. వారి తల్లిదండ్రులకు కూడా కౌన్స్‌లింగ్ ఇస్తాం. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని పదే పదే చెబుతున్నాం. మార్పు రావడం లేదు, మైనర్ ర్యాస్ డ్రైవింగ్ కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయ’’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment