కుటుంబం పరువు తీస్తోందని..
హైదరాబాద్: వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. కుటుంబం పరువు తీస్తోందని ఓ యువకుడు తన పిన్నిపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన నగరంలోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న జ్యోతి అనే మహిళ భర్త స్నేహితునితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం పై కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు.
ఈ క్రమంలో ఈ రోజు ఉదయం జ్యోతికి వరుసకు కొడుకయ్యే గణేష్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.