హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోయిన్‌పల్లి శాఖ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సెక్యూరిటీ సిబ్బంది సమాచారం అందించటంతో అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకున్నాయి. భారీగా మంటలు వ్యాపించటంతో మూడు శకటాలతో మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.