జాతీయ స్థాయి పోటీలకు కంబదూరు విద్యార్థి | kambadur student elect to national games | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పోటీలకు కంబదూరు విద్యార్థి

Published Thu, Dec 29 2016 10:24 PM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

kambadur student elect to national games

కంబదూరు : జాతీయ స్థాయి త్రోబాల్‌ పోటీలకు స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన జె.సిద్ధార్థ అనే విద్యార్థి ఎంపికయ్యాడు. ఈనెల 19–21 తేదీల్లో వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో జరిగిన 62వ రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ త్రోబాల్‌ పోటీల్లో సిద్ధార్థ ప్రతిభతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మధుసూదనమ్మ, పీడీ అంజయ్య, పీఈటీ మురళి గురువారం తెలిపారు. జనవరి 2 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. విద్యార్థి ఎంపికపై స్థానిక ఉపాధ్యాయులు హరికృష్ణ, చైతన్య హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement