ఉల్టా పుల్టా అంటు మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఐదో వారం ముగుస్తోంది. ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ కాగా.. ఈ రోజు మరొకరు హౌస్‌కు బైబై చెప్పనున్నారు. ఇప్పటికే ఏడుగురు సభ్యులు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. నామినేట్ అయినవారిలో శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్, గౌతమ్, టేస్జీ తేజ, ప్రియాంక జైన్, శుభశ్రీ రాయగురు ఉన్నారు.
(ఇది చదవండి: అభిమానుల దెబ్బకు మెంటలెక్కిపోయిన జగపతిబాబు!)
అయితే ఈ వారంలో ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐదోవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే షాకింగ్ టాక్ వినిపిస్తోంది. గత నాలుగు వారాల్లో వరసగా కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికని ఎలిమినేట్ కాగా.. ఈ సారి ఆ ఇద్దరు ఎవరా? అనే విషయంపై కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియన్స్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వారంలో పవరస్త్ర గెలుచుకున్న శోభా, సందీప్, ప్రశాంత్ తప్పితే అందరూ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు వచ్చిన ఓటింగ్స్ చూస్తే శివాజీ టాప్‌లో ఉండగా.. ఓటింగ్‌లో శుక్రవారం వరకు చూసుకుంటే శివాజీ టాప్‌లో ఉన్నాడు. ఇకపోతే చివరి రోజు ఓటింగ్ రిజల్ట్స్‌ను బట్టి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలనుంది.
ఇదిలా ఉండగా తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఈ రోజు హౌస్‌లో ఇద్దరు సినీ హీరోలు సందడి చేశారు. వారిలో ఒకరు మాస్ మహారాజా రవితేజ, మరొకరు కోలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ అతిథులుగా వచ్చారు. ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేషన్స్‌తో పాటు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉండనున్నట్లు కనిపిస్తోంది.
(ఇది చదవండి: యుద్ధ విమాన పైలెట్‌గా కంగనా.. ట్రైలర్ అదిరిపోయింది!)
ఈ ప్రోమోలో నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురిని ఒక చీకటి గదిలో ఉంచి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించాడు బిగ్ బాస్. ఈ ప్రక్రియను సైతం చాలా ఆసక్తికరంగా మార్చేశాడు. వారి వద్దకు ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి వచ్చి లైట్‌తో వచ్చి ఎలిమినేట్ అయ్యేవారిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment