elimination plan
-
బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్.. ఒకేసారి ఐదుగురు ఎలిమినేట్!!
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం అన్ని భాషల్లో అభిమానులను అలరిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్లో అత్యధికంగా బిగ్ బాస్ సీజన్- 17 నడుస్తోంది. ఈ రియాలిటీ షోకు హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వారంలో కంటెస్టెంట్స్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు బిగ్ బాస్ రెడీ అయిపోయాడు. ఈ వారంలో ఏకంగా ఐదుగురు కంటెస్టెంట్స్‌ను ఎలిమినేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. అయితే గత రెండు వారాలుగా ఎవరినీ ఎలిమినేట్ చేయని బిగ్ బాస్.. ఈసారి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఓకేసారి ఐదుగురిని ఎలిమినేట్ చేసి.. మరో ఐదుగురి కొత్తవారిని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి పంపించనున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రోమోలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన వారిలో నీల్ భట్, నవిద్ సోలే, రింకు ధావన్, అభిషేక్ కుమార్, జిగ్నా వోరా ఎలిమినేట్ కానున్నట్లు ఆడియన్స్ భావిస్తున్నారు. ప్రోమో చూస్తే ఒకరిని ఒకరు వీడ్కోలు చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
ఈ వారం బిగ్ బాస్ బిగ్ షాకిస్తాడా?.. హౌస్‌లోకి ఇద్దరు స్టార్ హీరోలు!
ఉల్టా పుల్టా అంటు మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఐదో వారం ముగుస్తోంది. ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ కాగా.. ఈ రోజు మరొకరు హౌస్‌కు బైబై చెప్పనున్నారు. ఇప్పటికే ఏడుగురు సభ్యులు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. నామినేట్ అయినవారిలో శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్దీప్, గౌతమ్, టేస్జీ తేజ, ప్రియాంక జైన్, శుభశ్రీ రాయగురు ఉన్నారు. (ఇది చదవండి: అభిమానుల దెబ్బకు మెంటలెక్కిపోయిన జగపతిబాబు!) అయితే ఈ వారంలో ఎలిమినేషన్లో బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐదోవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే షాకింగ్ టాక్ వినిపిస్తోంది. గత నాలుగు వారాల్లో వరసగా కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికని ఎలిమినేట్ కాగా.. ఈ సారి ఆ ఇద్దరు ఎవరా? అనే విషయంపై కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియన్స్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వారంలో పవరస్త్ర గెలుచుకున్న శోభా, సందీప్, ప్రశాంత్ తప్పితే అందరూ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు వచ్చిన ఓటింగ్స్ చూస్తే శివాజీ టాప్‌లో ఉండగా.. ఓటింగ్‌లో శుక్రవారం వరకు చూసుకుంటే శివాజీ టాప్‌లో ఉన్నాడు. ఇకపోతే చివరి రోజు ఓటింగ్ రిజల్ట్స్‌ను బట్టి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలనుంది. ఇదిలా ఉండగా తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఈ రోజు హౌస్‌లో ఇద్దరు సినీ హీరోలు సందడి చేశారు. వారిలో ఒకరు మాస్ మహారాజా రవితేజ, మరొకరు కోలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ అతిథులుగా వచ్చారు. ఆదివారం ఎపిసోడ్లో ఎలిమినేషన్స్‌తో పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండనున్నట్లు కనిపిస్తోంది. (ఇది చదవండి: యుద్ధ విమాన పైలెట్‌గా కంగనా.. ట్రైలర్ అదిరిపోయింది!) ఈ ప్రోమోలో నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురిని ఒక చీకటి గదిలో ఉంచి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించాడు బిగ్ బాస్. ఈ ప్రక్రియను సైతం చాలా ఆసక్తికరంగా మార్చేశాడు. వారి వద్దకు ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి వచ్చి లైట్‌తో వచ్చి ఎలిమినేట్ అయ్యేవారిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
మరో ఆప్షన్ లేదు.. జెలెన్స్కీని మట్టుబెట్టాల్సిందే!
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను డ్రోన్లతో హత్య చేయడానికి ఉక్రెయిన్ పన్నిన కుట్రను.. భద్రతా సిబ్బంది భగ్నం చేశాయి. అధ్యక్ష నివాసంలో పుతిన్ ఉంటున్న ఫ్లోర్‌కు అతి సమీపంగా రెండు డ్రోన్లు వెళ్లాయని, వాటిని నేల కూల్చినట్లు బుధవారం క్రెమ్లిన్ వర్గాలు ప్రకటించాయి. దీనికి ప్రతీకారంగా మాస్కో వర్గాలు.. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌లో ఉన్న అధ్యక్ష భవనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడితో తమకేం సంబంధం లేదని ఉక్రెయిన్ అంటోంది. మరోవైపు పుతిన్‌పై హత్యాయత్నానికి రష్యా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం వచ్చిందని అంటున్నారు ఆ దేశ మాజీ అధ్యక్షుడు, పుతిన్‌కు ఆప్తుడు దిమిత్రి మెద్వెదేవ్. ఉక్రెయిన్ ఉగ్రదాడికి కౌంటర్‌గా.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని మట్టుబెట్టాల్సిందేనని రష్యా బలగాలకు సూచిస్తున్నాడు ఆయన. ప్రస్తుతం రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న మెద్వెదేవ్ తాజా పరిణామాలపై స్పందిస్తూ.. ‘‘రష్యా అధ్యక్షుడిపై జరిగిన హత్యాయత్నం ద్వారా ఉక్రెయిన్ ఉగ్రచర్యలకు దిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ముందు ఒకేఒక్క ఆప్షన్ ఉంది. అది జెలెన్స్కీని మట్టుబెట్టడమే. ఇక ఆ హిట్లర్(జెలెన్స్కీని ఉద్దేశించి..) లొంగిపోవాల్సి అవసరం లేదు. ఎలాంటి షరతులు లేకుండా లొంగిపోతానని వచ్చినా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మాస్కో ముందు మరో ప్రత్యామ్నాయమూ అక్కర్లేదు. అతన్ని భౌతికంగా లేకుండా చేయడమే ఇప్పుడు రష్యా బలగాలు చేయాల్సిన పని అని మెద్వెదేవ్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మంగళవారం అర్ధరాత్రి పుతిన్ అధ్యక్ష అధికారిక నివాసం క్రెమ్లిన్‌పై ఉక్రెయిన్ UAV(మానవ రహిత) దాడులకు తెగబడిందని, వాటిని చాకచక్యంగా నేలకూల్చామని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని మాస్కో వర్గాలు ప్రకటించాయి. ఆ సమయంలో పుతిన్ ఇంట్లో లేడని వెల్లడించిన ఆయన సిబ్బంది.. మాస్కోలోని తన నివాసం నుంచే ఆయన తన కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తారని తెలిపింది. అంతేకాదు మే 9వ తేదీన రెడ్ స్క్వేర్ వద్ద జరిగే విక్టరీ డే పరేడ్‌పై ఈ డ్రోన్ ఎటాక్ ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. జెలెన్స్కీ ఏమన్నారంటే.. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. రష్యా ఆరోపణలను ఖండించారు. పుతిన్‌పై గానీ, మాస్కోపైగానీ ఉక్రెయిన్ దళాలు ఎలాంటి దాడులకు యత్నించలేదని స్పష్టత ఇచ్చారు. ఇలాంటి దాడులకు సరిపడే ఆయుధ సంపత్తి ఉక్రెయిన్ వద్ద లేదని చెబుతున్నారాయన. మేం మా దేశ సరిహద్దులోనే పోరాడుతున్నాం. మా గ్రామాలను, నగరాలను రక్షించుకుంటున్నాం. మా వద్ద అలాంటి దాడులు చేయాలన్నా.. అందుకు తగ్గ ఆయుధాలు లేవు. అంతేసి ఖర్చు చేసే పరిస్థితుల్లోనూ లేం అని చెబుతున్నారు. ఇదీ చదవండి: మొసలి కడుపులోకి ఎలాగ వెళ్లాడంటే.. -
షాకింగ్: బిగ్‌బాస్ నుంచి సిరి ఎలిమినేట్.. ఏడ్చేసిన షణ్నూ
Bigg Boss 5 Telugu,Siri Gets Evicted From Telugu Bigg Boss House: బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఆదివారం నాడు ఫినాలే జరగనున్న సంగతి తెలిసిందే. టైటిల్ రేసులో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లలో షణ్నూ, సన్నీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అఫీషియల్ పోలింగ్ ప్రకారం సన్నీ ముందంజలో ఉండగా, షణ్నూ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగో స్థానం కోసం సిరి, మానస్‌ల మధ్య పోటీ ఉందని తెలుస్తుంది. అయితే మరో రెండు రోజుల్లో ఫినాలే ఉండగా బిగ్‌బాస్ షాకింగ్ డెసీషన్ తీసుకున్నట్లు సమాచారం. ఫినాలే స్టేజ్‌పై కాకుండా ముందుగానే బిగ్‌బాస్ సిరిని ఎలిమినేట్ చేశాడు. దీంతో హౌస్‌ను, షణ్నూని వదిలి వెళ్లలేక సిరి బాగా ఎమోషనల్ అయ్యింది. సిరి ఇంటిని వదిలి వెళ్లడంతో షణ్నూ ఒంటరిగా కూర్చొని ఏడ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా విడుదల చేసింది. అయితే ఇది ఫేక్ ఎలిమినేషన్ అని తెలుస్తుంది. ఓ గంట పాటు సిరిని సీక్రెట్ రూంలో పెట్టి తర్వాత హౌస్‌లోకి పంపించాడట. సీజన్ పూర్తికానున్న నేపథ్యంలో నిన్నటి ఎపిసోడ్లో ఫన్నీ టాస్కులు ఇచ్చిన బిగ్‌బాస్ నేడు మరోసారి చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. House nundi eliminate aina #Siri #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun #BiggBosTelugu pic.twitter.com/Ww0q2wpjWB — starmaa (@StarMaa) December 17, 2021 -
రాహుల్ లేకపోతే బిగ్‌బాస్ చూడం!
హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్లో పాల్గొన్న సింగర్ రాహుల్ వైద్య తరచూ వార్తల్లో ఉంటున్నాడు. ఆ మధ్య తనకు బంధుప్రీతి అంటే అసహ్యమని చెప్తూ జాన్ కుమార్‌ను నామినేట్ చేశాడు. జాన్‌కు అంత పాపులారిటీ లేదని, కేవలం ప్రముఖ సింగర్ కుమార్ సను కొడుకు కావడం వల్లే ఈ షోలో ఉండగల్గుతున్నాడని విమర్శా బాణాలు ఎక్కుపెట్టాడు. హౌస్‌లో నెపోటిజమ్ ప్రస్తావన తీసుకువచ్చినందుకు వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఒక్క విషయమనే కాదు ఆయన చాలామటుకు ఇతర కంటెస్టెంట్లపై నోరు పారేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. కానీ ఈసారి మాత్రం ఎలిమినేట్ అవుతున్నందున రాహుల్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. (చదవండి: టాప్ సెర్చ్డ్ సెలబ్రిటీ లిస్ట్ : అల్లు అర్జున్ ఏ ప్లేస్) ఈ ఎలిమినేషన్ వాస్తవమే అన్నట్లుగా కలర్స్ టీవీ తాజాగా ప్రోమోను సైతం రిలీజ్ చేసింది. అందులో రాహుల్‌తో మాటలు కలిపిన సల్మాన్ తర్వాత అతడిని బయటకు రమ్మని ఫైర్ అయ్యాడు. సల్మాన్ ఆదేశాల మేరకు బిగ్‌బాస్ గేట్లు కూడా తెరుచుకున్నట్లు ప్రోమోలో చూపించారు. దీంతో నిజంగానే రాహుల్‌ను ఎలిమినేట్ చేస్తున్నారా? అని అతడి అభిమానులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ లేకపోతే బిగ్‌బాస్ షో లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అతడిని పంపించేస్తే షో చూడబోమని తేల్చి చెప్తున్నారు. మరోవైపు రాహుల్‌తో పాటు నిక్కీ తంబోళి కూడా ఎలిమినేట్ కానున్నట్లు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరి రాహుల్ ఎలిమినేట్ అయ్యాడా? సేవ్ అయ్యాడా? లేదా డబుల్ ఎలిమినేషన్ జరగనుందా? అనే విషయం తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యేవరకు వేచి చూడాల్సిందే. (చదవండి: ఆ నటి నా భార్య, కానీ మరొకరితో ఎఫైర్..) #BiggBoss14 ke ghar ke exit door khul gaye hain @rahulvaidya23 ke liye. Kya woh lenge yeh step aur ho jayenge finale ki raat ko beghar? Dekhiye aaj raat 9 baje, #Colors par. Catch it before TV on @VootSelect.#BiggBoss2020 #BB14 #WeekendKaVaar pic.twitter.com/J66nPEshoU — ColorsTV (@ColorsTV) December 5, 2020 -
బిగ్‌బాస్ బిగ్ షాక్.. ఇక అందరూ ఎలిమినేషన్‌లోనే!
టెలివిజన్ బిగ్ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’కు లభించిన ఆదరణ మరే ఇతర షోలకు లభించదనడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో గత మూడు సీజన్ల మాదిరే నాల్గో సీజన్‌కు కూడా మంచి స్పందన వస్తుంది. ఇప్పటికే ఈ సీజన్ విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకొని ముగింపు దశకు ఆమడ దూరంలో ఉంది. మరో 23 రోజుల్లో నాల్గో సీజన్ ముగుస్తుంది. ఈ తరుణంలో మిగిలిన 3 వారాలలో గతంలో చూడని టాస్కులను, ట్విస్ట్‌లను ఇచ్చి షోని మరింత రసవత్తంగా మార్చనున్నారట బిగ్‌బాస్ నిర్వాహకులు. అందులో భాగంగా ఇంటి సభ్యులకు మరో భారీ షాక్ ఇవ్వబోతున్నాడట బిగ్‌బాస్. ఇకపై బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్ ఉండడట. ప్రస్తుతం ఉన్న హారికనే బిగ్‌బాస్ నాల్గో సీజన్‌కి చివరి కెప్టెన్ అని తెలుస్తోంది. అంటే వచ్చే మూడు వారాలు ఎవరికీ ఇమ్యూనిటీ లభించదు. అందరు కంటెస్టెంట్లూ ఎలిమినేషన్ జోన్లో ఉన్నట్లే లెక్క. ఒకవేళ నామినేట్ కాని వాళ్లో లేదా స్పెషల్ పవర్ గెలుచుకున్న వాళ్లు తప్పితే.. ప్రత్యేకంగా కెప్టెన్‌కి లభించే ఇమ్యూనిటితో తప్పించుకునే చాన్స్ లేనట్లే. వీటితో పాటు హౌస్‌లో మరెన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి. -
బిగ్‌బాస్ : ఎలిమినేషన్లో ఊహించని ట్విస్ట్!
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ముగింపుదశకు వచ్చింది. ఊహించని ట్విస్ట్‌లు, కొత్త కొత్త టాస్క్‌లతో గత సీజన్ల కంటే ఎక్కువ వినోదాన్ని అందిస్తూ.. విజయవంతంగా 81 రోజులు పూర్తి చేసుకుంది. 19 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. ప్రస్తుతం ఏడుగురు మిగిలారు. వీరిలో ఈ వారం నామినేషన్లో అవినాష్, అరియానా, మోనాల్, అఖిల్ ఉన్నారు. అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో అవినాష్ ఈ వారం సేఫ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మిగిలిన ముగ్గురు అరియానా, మోనాల్, అఖిల్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది ఆసక్తిగా మారింది. (చదవండి : బిగ్‌బాస్ : ఆ వీడియోలు వేసి ఇజ్జత్ తీయకండి) ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమేషన్ గురించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వారం ఎలిమినేషన్ ఉండదనేదే ఆ వార్త సారాంశం. ప్రస్తుతం ప్రసారం అవుతున్న నాల్గో సీజన్ ముగింపుకు మరో నాలుగు వారాలే మిగిలి ఉన్నాయి. హౌస్‌లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఐదుగురు ఫైనల్‌కు వెళ్తారు. అంటే ఇద్దరు మాత్రమే ఎలిమినేట్ కావాలి. కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చనేది లీకులవీరుల అంచనా. మరో పక్క ఈ వారం రీఎంట్రీ ఉండనున్నట్లు వార్తలు వచ్చినా.. అది పుకారే అని తేలిపోయింది. బహుశా ఉంటే వచ్చే వారం మధ్యలో ఒకరి రీఎంట్రీ ఉంటుదని లీకుల వీరులు చెప్పేస్తున్నారు. ఇక వచ్చే రెండు వారల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేసి ఆ తరువాత డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలేను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా, టాప్ 5లో అభిజిత్, సోహైల్, అఖిల్, అవినాష్, మోనాల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. -
బిగ్‌బాస్: శత్రువులుగా మారబోతున్న స్నేహితులు?
బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4.. ఆదివారంతో రెండు వారాలను పూర్తి చేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది. వీకెండ్ కాస్తా కోపాలు, ఏడుపులు, సరదాలతో ముగియగా సోమవారం రావడంతో హౌజ్‌లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అయితే గత వారం నామినేషన్ చాలా సులువుగా త్యాగాలు చేస్తూ జరిగిందని నాగార్జున ఫైర్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ వారం నామినేషన్ మిగతా వాటితో పోలిస్తే చాలా వేడిగా ఉన్నట్లు కన్పిస్తోంది. ఎవరిని నామినేట్ చేయాలన్న విషయంలో కంటెస్టెంట్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. (బిగ్‌బాస్: గెలవడం కోసం ఆమె ఏమైనా చేస్తుంది!) ఈ వారం ఎవరిని నామినేషన్లో ఉంచాలో వారి ఫోటోలను మండుతున్న అగ్నిలో వేయాల్సి ఉంటుంది. అలాగే వారిని నామినేట్ చేయడానికి గల కారణాలను కూడా తెలియజేయాలి. కాగా ఈ నామినేషన్ ప్రక్రియపై శనివారం జరిగిన హీరో, జీరో టాస్క్ ఎఫెక్ట్ బాగా పనిచేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు స్నేహితులుగా ఉన్న వారు ఈ ఎపిసోడ్‌తో ఒక్కసారిగా శత్రువులుగా మారబోతున్నారు. ఈ క్రమంలో ఇస్మార్ట్ సోహైల్ తన స్నేహితురాలు అరియానా గ్లోరీ ఫోటోను మంటల్లో వేయగా.. బదులుగా అరియానా.. సోహైల్ ఫోటోను మంటల్లో ఆహుతి చేసింది. (బిగ్‌బాస్: హారిక అవుట్! కానీ..) అలాగే సుజాత- అభిజిత్ ఫోటోను మంటల్లో వేసింది. అంతేగాక అభిజిత్ సుజాత ఫోటోను మంటల్లో వేశాడు. ఇలాగే మోనాల్- దివి, దివి-మోనాల్, దేత్తడి హారిక- మోహబూబా, మోహబూబా- హారిక, దేవి- అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఫోటోను మంటల్లో తగలబెట్టింది. ఇక పూర్తి నామినేషన్ ఎలా జరగబోతుంది. ఎవరూ ఈ వారం నామినేషన్లో ఉండబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ రోజు ప్రసారమయ్యే బిగ్‌బాస్ చూసే వరకు ఆగాల్సిందే. (దివి, నోరు అదుపులో పెట్టుకో: లాస్య వార్నింగ్) Looks like this time nominations will be on fire 🔥 🔥 🔥 #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/YIzqDmXemW — starmaa (@StarMaa) September 21, 2020 -
శివసేన అధినేతను చంపాలనుకున్నా!
పాకిస్థానీ అమెరికన్ టెర్రరిస్టు డేవిడ్ హెడ్లీ సంచలన విషయాలు వెల్లడించాడు. భవిష్యత్తులో శివసేన కార్యాలయం మీద దాడి చేయడానికి.. లేదా దాని అధినేతను హతమార్చేందుకు వీలుగా ముందు నుంచే ఎవరైనా శివసేన కీలక సభ్యుడితో సంబంధాలు పెంచుకోవాలని కూడా తాను భావించినట్లు తెలిపాడు. సేన భవన్లో తాను రాజారామ్ రెగె అనే శివసేన కార్యకర్తను కలిశానని, అతడితో స్నేహం పెంచుకునే ప్రయత్నం చేశానని చెప్పాడు. 26/11 దాడుల్లో భాగంగా ముంబై ఎయిర్‌పోర్టు మీద ఎందుకు దాడి చేయలేదని లష్కరే తాయిబా తీవ్ర అసంతృప్తికి గురైందని చెప్పాడు. అయితే.. సిద్ది వినాయక ఆలయం మీద, నావల్ ఎయిర్ స్టేషన్ మీద దాడులు చేయద్దని తానే చెప్పానని, ఆ రెండు ప్రాంతాలలో సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కనీసం 10 మంది ఉగ్రవాదులు అక్కడే ఉండాల్సి వస్తుందని దాడులు వద్దన్నట్లు ముంబై కోర్టుకు వీడియా కాన్ఫరెన్సు విచారణలో తెలిపాడు. తొలుత సిద్ది వినాయక ఆలయంలో రెక్కీ చేసి.. అప్పుడే అక్కడ దాడి చేయాల్సిన ఉగ్రవాదుల కోసం ఎరుపు, పసుపు రంగు తాళ్లను కొన్నానని.. వాటిని ఉగ్రవాదులు తమ మణికట్టుకు కట్టుకుంటే వాళ్లను హిందువులుగా భావిస్తారనే అలా చేశానని చెప్పాడు. ముంబై తాజ్ మహల్ హోటల్‌కు అత్యంత సమీపంలో ఉండే గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద దిగాలని జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ తమకు చెప్పాడన్నాడు. భాభా ఎటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)లో పనిచేసే ఎవరైనా ఉద్యోగిని పట్టుకుని, అతడి ద్వారా తమకు సమాచారం సేకరించాలని ఐఎస్ఐకి చెందిన మేజర్ ఇక్బాల్ పని అప్పగించినట్లు కూడా హెడ్లీ తాజాగా వెల్లడించాడు.