
టెలివిజన్ బిగ్ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’కు లభించిన ఆదరణ మరే ఇతర షోలకు లభించదనడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో గత మూడు సీజన్ల మాదిరే నాల్గో సీజన్‌కు కూడా మంచి స్పందన వస్తుంది. ఇప్పటికే ఈ సీజన్ విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకొని ముగింపు దశకు ఆమడ దూరంలో ఉంది. మరో 23 రోజుల్లో నాల్గో సీజన్ ముగుస్తుంది. ఈ తరుణంలో మిగిలిన 3 వారాలలో గతంలో చూడని టాస్కులను, ట్విస్ట్‌లను ఇచ్చి షోని మరింత రసవత్తంగా మార్చనున్నారట బిగ్‌బాస్ నిర్వాహకులు.
అందులో భాగంగా ఇంటి సభ్యులకు మరో భారీ షాక్ ఇవ్వబోతున్నాడట బిగ్‌బాస్. ఇకపై బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్ ఉండడట. ప్రస్తుతం ఉన్న హారికనే బిగ్‌బాస్ నాల్గో సీజన్‌కి చివరి కెప్టెన్ అని తెలుస్తోంది. అంటే వచ్చే మూడు వారాలు ఎవరికీ ఇమ్యూనిటీ లభించదు. అందరు కంటెస్టెంట్లూ ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నట్లే లెక్క. ఒకవేళ నామినేట్ కాని వాళ్లో లేదా స్పెషల్ పవర్ గెలుచుకున్న వాళ్లు తప్పితే.. ప్రత్యేకంగా కెప్టెన్‌కి లభించే ఇమ్యూనిటితో తప్పించుకునే చాన్స్ లేనట్లే. వీటితో పాటు హౌస్‌లో మరెన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment