కోలీవుడ్ సిద్ధార్థ్ - అదితిరావు హైదరీ ఈ ఏడాదిలో వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే తాజాగా సాహిత్య ఆజ్‌తక్ -2024 సదస్సుకు హాజరైన ఆదితిరావు హైదరీ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాము కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయితే మా పెళ్లి కోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్లాన్ చేయలేదని పేర్కొంది. 400 ఏళ్లనాటి ఆలయం మా తాత, నానమ్మకు సెంటిమెంట్.. అక్కడే పెళ్లి చేసుకుంటే వారి ఆశీర్వాదాలు ఉంటాయని అన్నారు. మా నానమ్మ అంటే నాకు చాలా ఇష్టం.. ఆమె హైదరాబాద్‌లో పాఠశాలను ప్రారంభించిందని ఆదితిరావు తెలిపింది.
ఆదితి రావు హైదరీ మాట్లాడుతూ.. 'మా పెళ్లి పెద్దగా ప్లాన్ చేయలేదు. పెళ్లి జరిగిన ఆలయం మా పూర్వీకులు కట్టారు. దాదాపు 400 ఏళ్లుగా మా కుటుంబంలో భాగంగా ఉంది. అంతేకాదు ఆ ఆలయం నా కుటుంబంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. అలాగే నానా, నానమ్మకు చాలా ఇష్టమైన గుడి. అందుకే అక్కడ వివాహం చేసుకోవడం వారికి దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. వారి ఆశీస్సులు కూడా మాకు అందాయి' అని తెలిపింది.
కాగా.. ఆదితి రావు హైదరీ ఈ ఏడాది హీరామండి వెబ్ సిరీస్‌లో కనిపించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment