కాఫీ డే ఆడిటర్లకు రూ. 1.25 కోట్లు జరిమానా.. ఎందుకంటే? | Coffee Day Global, MACEL Audit Lapses: NFRA Slaps Rs 1.25 Cr Fine - Sakshi
Sakshi News home page

కాఫీ డే ఆడిటర్లకు రూ. 1.25 కోట్లు జరిమానా.. ఎందుకంటే?

Published Fri, Apr 14 2023 7:19 AM | Last Updated on Fri, Apr 14 2023 10:29 AM

Coffee day auditor rs 1.25 crore fine details - Sakshi

న్యూఢిల్లీ: కాఫీ డే గ్లోబల్‌ (సీడీజీఎల్‌), ఎంఏసీఈఎల్‌ ఖాతాల ఆడిటింగ్‌లో అవకతవకలకు సంబంధించి నలుగురు ఆడిటర్లు, ఒక ఆడిట్‌ సంస్థకు నేషనల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ) రూ. 1.25 కోట్ల జరిమానా విధింంది. అలాగే ఆడిటింగ్‌ పనులు చేపట్టకుండా వేర్వేరుగా రెండు నుంచి అయిదేళ్ల పాటు నిషేధింంది. 

దివంగత వీజీ సిద్ధార్థకు చెందిన కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ (సీడీఈఎల్‌)కు ఈ రెండూ అనుబంధ సంస్థలు. సీడీఈఎల్‌ నుం ఎంఏసీఈఎల్‌ (మైసర్‌ అవల్గమేటెడ్‌ కాఫీ ఎస్టేట్‌)కు రూ. 3,535 కోట్ల నిధుల మళ్లింపు జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి గాను సీడీజీఎల్, ఎంఏసీఈఎల్‌ ఆర్థిక ఫలితాల స్టేట్‌మెంట్ల తయారీలో ఆడిటర్లు నిబద్ధతతో వ్యవహరించలేదని ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ నిర్ధారింంది. ఆడిట్‌ సంస్థ ఏఎస్‌ఆర్‌ఎంపీతో పాటు ఏఎస్‌ సుందరేశా, మధుసదన్‌ యూఎ, లవితా శెట్టి, ప్రణవ్‌ జి అంబేకర్‌ తదితరులకు తాజా జరివనాలు విధింంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement