Nfra
-
ఆడిటర్లు చట్టబద్ధంగా వ్యవహరించాలి
న్యూఢిల్లీ: ఆడిటర్లు నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడకుండా, విధానపరమైన ప్రక్రియను అనుసరించాలని నేషనల్ ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) చైర్పర్సన్ అజయ్ భూషణ్ ప్రసాద్ పాండే సూచించారు. ఆడిటింగ్ అన్నది కేవలం టిక్ కొట్టే పని మాత్రం కాదన్నారు. పలు కంపెనీల్లో ఆడిటింగ్ లోపాలు బయటపడుతుండడం, ఈ విషయంలో ఆడిటర్లపై నియంత్రణ సంస్థ చర్యలు తీసుకుంటుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై పాండే తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆడిట్ డాక్యుమెంట్లు అన్నవి సరైన విధి విధానాలను అసరించారనే దానికి సాక్ష్యాలుగా పేర్కొన్నారు. ‘‘మేము విలన్‌గా ఇక్కడ లేమని ఆడిటర్ల సమాజానికి నేను హామీ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు సాయం చేయడానికి, వ్యవస్థను మరింత మెరుగుపరచడానికే మేము ఇక్కడ ఉన్నామని తెలియజేస్తున్నాను’’అంటూ పాండే చెప్పారు. ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ (ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను వెల్లడించడం) వ్యవస్థ అనేది ఎంతో ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. ఎన్ఎఫ్ఆర్ఏ కిందకు సుమారు 7,000 కంపెనీలు వస్తాయి. అన్‌లిస్టెడ్ కంపెనీలపైనా నియంత్రణ కలిగి ఉంది. యాజమాన్యం లేదా న్యాయ సలహాలపై ఆడిటర్లు ఎక్కువగా ఆధారపడుతున్నట్టు గుర్తించామని చెప్పారు. ‘‘నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడడం, అవసరమైన విశ్లేషణ చేయకపోవడం అన్నది సరికాదు. నిపుణులు చెప్పిన అభిప్రాయానికే మీరు కూడా మొగ్గు చూపించొచ్చు. కానీ, మీరు ప్రామాణిక ఆడిట్ చేసినట్టు అక్కడ పత్రాలు చెప్పాలి. అది ముఖ్యమైనది’’అని సూచించారు. ఆడిట్‌తో మోసాలు వెలుగులోకి చట్టబద్ధమైన ఆడిటింగ్ ప్రక్రియను అనుసరించినప్పుడు మోసాలను గుర్తించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పాండే అన్నారు. ‘‘ఆడిటర్లు మోసాలను అన్ని వేళలా గుర్తిస్తారని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కానీ, మీరు తగిన విధంగా వ్యవహరిస్తే బయట పడేందుకు మంచి అవకాశాలు ఉంటాయి’’అని చెప్పారు. కంపెనీలు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు అవి తమ ఆడిట్ కమిటీలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇండిపెండెంట్ డైరెక్టర్లకు సాధికారత కలి్పంచాలన్నారు. -
కాఫీ డే ఆడిటర్లకు రూ. 1.25 కోట్లు జరిమానా.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: కాఫీ డే గ్లోబల్ (సీడీజీఎల్), ఎంఏసీఈఎల్ ఖాతాల ఆడిటింగ్‌లో అవకతవకలకు సంబంధించి నలుగురు ఆడిటర్లు, ఒక ఆడిట్ సంస్థకు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) రూ. 1.25 కోట్ల జరిమానా విధింంది. అలాగే ఆడిటింగ్ పనులు చేపట్టకుండా వేర్వేరుగా రెండు నుంచి అయిదేళ్ల పాటు నిషేధింంది. దివంగత వీజీ సిద్ధార్థకు చెందిన కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈఎల్)కు ఈ రెండూ అనుబంధ సంస్థలు. సీడీఈఎల్ నుం ఎంఏసీఈఎల్ (మైసర్ అవల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్)కు రూ. 3,535 కోట్ల నిధుల మళ్లింపు జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి గాను సీడీజీఎల్, ఎంఏసీఈఎల్ ఆర్థిక ఫలితాల స్టేట్మెంట్ల తయారీలో ఆడిటర్లు నిబద్ధతతో వ్యవహరించలేదని ఎన్ఎఫ్ఆర్ఏ నిర్ధారింంది. ఆడిట్ సంస్థ ఏఎస్ఆర్ఎంపీతో పాటు ఏఎస్ సుందరేశా, మధుసదన్ యూఎ, లవితా శెట్టి, ప్రణవ్ జి అంబేకర్ తదితరులకు తాజా జరివనాలు విధింంది. -
ఎన్ఎఫ్ఆర్ఏ ఏర్పాటులో తొందరొద్దు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త కంపెనీల చట్టంలో భాగమైన నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) ఏర్పాటు విషయంలో ప్రభుత్వం తొందరపడరాదని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రెసిడెంట్ మనోజ్ ఫడ్నిస్ చెప్పారు. చార్టర్డ్ అకౌం టెంట్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం సహా విస్తృతాధికారాలు ఉండే ఎన్ఎఫ్ఆర్ఏపై ప్రొఫెషనల్స్‌తో మరింతగా చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇప్పటికే నేషనల్ అడ్వైజరీ కమిటీ ఆన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ (ఎన్ఏసీఏఎస్) ఈ తరహా విధుల్లో కొన్నింటిని నిర్వహిస్తున్నందున కొత్తగా ఎన్ఎఫ్ఆర్ఏను ఏర్పాటు చేయడం వల్ల ఒకే పనిని పలు సంస్థలకు అప్పగించినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. కంపెనీల చట్టం 2013పై ఆదివారం ఇక్కడ నిర్వహించిన సెమినార్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఆడిటర్లపై కఠిన చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం తమ క్రమశిక్షణ కమిటీ ముందు దీనికి సంబంధించి ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేవని చెప్పారు. ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ ఎం. దేవరాజ రెడ్డి తదితరులు ఈ సెమినార్లో పాల్గొన్నారు. -
ఇక కంపెనీల్లో కనీసం ఒక మహిళా డెరైక్టర్
న్యూఢిల్లీ: కొత్త కంపెనీల చట్టం-2013లోని మరో 10 చాప్టర్లకు సంబంధించిన నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. ముఖ్యంగా ఇందులో కంపెనీ బోర్డులో డెరైక్టర్ల నియామకం, వాళ్లకుండే అధికారాలు-అర్హతలు, బోర్డు సమావేశాలు, డివిడెండ్ల ప్రకటన-చెల్లింపు ఇతరత్రా అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఆరు దశాబ్దాలనాటి పాత చట్టం స్థానంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త కంపెనీల చట్టం అమల్లోకి రానుంది. కంపెనీల ఏర్పాటు, సెక్యూరిటీల కేటాయింపు, వాటా మూలధనం, డిబెంచర్లు వంటివాటికి సంబంధించిన చాప్టర్లు కూడా కార్పొరేట్ వ్యవహారాల శాఖ నోటిఫై చేసిన చాప్టర్లలో ఉన్నాయి. కాగా, 180కి పైగా సెక్షన్లకు సంబంధించి ఇటీవలే ఉత్తర్వులు వెలువడగా, మొత్తం షెడ్యూళ్లన్నింటినీ ఇప్పటికే నోటిఫై చేయడం తెలిసిందే. ఈ కొత్త చట్టంలో మొత్తం 29 చాప్టర్లు, 7 షెడ్యూళ్లు, 470 సెక్షన్లు ఉన్నాయి. మిగతా నిబంధనలను ఎప్పటికల్లా నోటిఫై చేస్తారు, వాటికి కంపెనీలు పాటించేందుకు ఏదైనా అదనపు గడువు ఇస్తారా అనేది వేచిచూడాల్సి ఉందని కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ ఇండియా ఎల్ఎల్పీకి చెందిన యోగేష్ శర్మ అభిప్రాయపడ్డారు. గతేడాది ఆగస్టులో ఈ చట్టానికి పార్లమెంట్ ఆమోదముద్ర పడింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటంతో కొత్త కంపెనీల చట్టానికి సబంధించిన ఉత్తర్వుల జారీకి ఈ నెల 20న ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతించింది. కంపెనీ బోర్డుల్లో మహిళా వాణి... కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం ఇకపై చాలావరకూ కంపెనీలు తమ డెరైక్టర్ల బోర్డులో కనీసం ఒక మహిళకు స్థానం కల్పించాల్సిందే. అదేవిధంగా ఇద్దరు స్వతంత్ర డెరైక్టర్ల నియామకం కూడా తప్పనిసరి. లిస్టెడ్ కంపెనీల్లో చిన్న ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు వీలుగా తమతరఫున ఒక డెరైక్టర్ కోసం డిమాండ్ చేస్తే నియమించాల్సి వస్తుంది కూడా. రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ పెయిడ్అప్ షేర్ క్యాపిటల్ ఉన్న లిస్టెడ్, పబ్లిక్ సంస్థలన్నీ కూడా ఒక మహిళా డెరైక్టర్‌ను నియమించుకోవాలని కొత్త నిబంధనలు నిర్ధేశిస్తున్నాయి. కాగా, చిన్న షేర్ హోల్డర్ల తరఫున డెరైక్టర్‌ను నియమించాలంటే కనీసం 1,000 మంది లేదా మొత్తం చిన్న వాటాదార్లలో పదింట ఒకటో వంతు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. -
సీఏ విద్యార్థులకు టీవీ చానెల్
న్యూఢిల్లీ: చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) చదువుతున్న విద్యార్థుల కోసం ద ఇన్స్టిట్యూట్ ఆప్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఒక టెలివిజన్ ఛానెల్‌ను ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. దీంతో పాటు గ్లోబల్ టెక్నాలజీ సెంటర్‌ను, క్లౌడ్ క్యాంపస్‌ను కూడా ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా సీఏ విద్యార్ధులకు మరింత చేరువ కావడం లక్ష్యంగా ఇంటరాక్టివ్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను అందించాలనుకుంటున్నామని ఐసీఏఐ కొత్త ప్రెసిడెంట్ కె. రఘు బుధవారం తెలిపారు. స్కామ్‌ల కట్టడికి పటిష్ట మార్గదర్శకాలు: ఐసీఏఐ కార్పొరేట్ కుంభకోణాలని కట్టడి చేసే దిశగా చార్టర్డ్ అకౌంటెంట్ల కోసం పటిష్టమైన మార్గదర్శకాలు రూపొందిస్తోంది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ). ఇందుకోసం కార్పొరేట్ వ్యవహారాల శాఖతో కలిసి పనిచేస్తోందని రఘు తెలిపారు.