సీఏ విద్యార్థులకు టీవీ చానెల్
న్యూఢిల్లీ: చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) చదువుతున్న విద్యార్థుల కోసం ద ఇన్‌స్టిట్యూట్ ఆప్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఒక టెలివిజన్ ఛానెల్‌ను ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. దీంతో పాటు గ్లోబల్ టెక్నాలజీ సెంటర్‌ను, క్లౌడ్ క్యాంపస్‌ను కూడా ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా సీఏ విద్యార్ధులకు మరింత చేరువ కావడం లక్ష్యంగా ఇంటరాక్టివ్ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అందించాలనుకుంటున్నామని ఐసీఏఐ కొత్త ప్రెసిడెంట్ కె. రఘు బుధవారం తెలిపారు.
స్కామ్‌ల కట్టడికి పటిష్ట మార్గదర్శకాలు: ఐసీఏఐ
కార్పొరేట్ కుంభకోణాలని కట్టడి చేసే దిశగా చార్టర్డ్ అకౌంటెంట్ల కోసం పటిష్టమైన మార్గదర్శకాలు రూపొందిస్తోంది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ). ఇందుకోసం కార్పొరేట్ వ్యవహారాల శాఖతో కలిసి పనిచేస్తోందని రఘు తెలిపారు.