న్యూఢిల్లీ: చైనాకు చెందిన 53 విదేశీ కంపెనీలు భారత్‌లో వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నట్టు కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లడించింది. యాప్ ద్వారా రుణాలు ఇచ్చే విషయమై ఇవి ఎలాంటి డేటాను నిర్వహించడం లేదని తెలిపింది. విదేశీ కంపెనీ (భారత్‌కు వెలుపల ఏర్పాటైనది) దేశంలో వ్యాపార కేంద్రాలు తెరుచుకోవచ్చు.
కాకపోతే ఇందుకు సంబంధించి ఆర్‌బీఐ, ఇతర నియతంణ్ర సంస్థల నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. భారత్‌లో అటువంటి కేంద్రం తెరిచిన 30 రోజుల్లోపు రిజి్రస్టార్ ఆఫ్ కంపెనీస్ వద్ద రిజి్రస్టేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ అంశంపై బదులిచ్చారు. చట్టం పరిధిలో షెల్ కంపెనీలకు సంబంధించి ఎలాంటి నిర్వచనం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
7,700 కంపెనీల మూత
సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ యాక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ (సీపేస్)ను ఈ ఏడాది మేలో ఏర్పాటు చేసిన తర్వాత నుంచి, దీని కింద 7,700 కంపెనీలు వ్యాపార కార్యకలాపాలను నిలిపివేసినట్టు లోక్‌సభకు రావు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. స్వచ్చందంగా వ్యాపార కార్యకలాపాల నుంచి తప్పుకోవాలనుకునే కంపెనీలకు, దాన్ని వేగవంతంగా సాకారం చేసేందుకు ఈ ఏడాది మే 1 నుంచి సీపేస్‌ను కార్పొరేట్ శాఖ తీసుకొచి్చంది. దీంతో ఒక కంపెనీ స్వచ్చంద మూసివేతకు పట్టే సమయం 110 రోజులకు తగ్గిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment