Foreign companies
-
వేతనాల్లో..ఐటీ కన్నా జీసీసీలే మిన్న!
విదేశీ కంపెనీలు భారత్‌లో పొలోమంటూ ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు).. అదిరిపోయే వేతన ప్యాకేజీలతో టెక్ సిబ్బందిని ఆకర్షిస్తున్నాయి. భారీ విస్తరణ బాట నేపథ్యంలో టెక్ నిపుణులకు జీసీసీల నుంచి డిమాండ్ పెరుగుతోంది. మరోపక్క, జీతాల విషయంలో జీసీసీలతో పోలిస్తే సంప్రదాయ ఐటీ సేవల కంపెనీలు వెనుకబడుతుండటం గమనార్హం.దేశంలో ప్రస్తుతం 1,600కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాటిలో 16.6 లక్షల మందికి పైగానే నిపుణులు పనిచేస్తున్నారు. ఐటీ కంపెనీల్లోని టెకీలతో పోలిస్తే అవే విధుల్లో పనిచేస్తున్న జీసీసీ ఉద్యోగులకు 12–20 శాతం మేర అధిక వేతనాలు లభిస్తున్నాయి. అంతేకాదు, టెక్నాలజీ యేతర కంపెనీల్లో పనిచేస్తున్న నిపుణులతో పోల్చినా కూడా జీసీసీల్లోనే భారీ వేతన ప్యాకేజీలు దక్కుతుండం విశేషం. టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్–ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ, నెట్వర్క్ అడ్మిని్రస్టేషన్, డేటా మేనేజ్మెంట్–ఎనలిటిక్స్, క్లౌడ్ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ తదితర విభాగాల్లో ఎంట్రీ, మిడ్, సీనియర్ స్థాయిల్లో కూడా జీసీసీలు ప్యాకేజీల్లో ‘టాప్’లేపుతున్నాయి. మెరుగైన జీతాల నేపథ్యంలో జీసీసీల్లోకి వలసలు కూడా భారీగా పెరిగేందుకు దారితీస్తోంది. ఉదాహరణకు సాఫ్ట్వేర్ డెవలపర్, ఏఐ/ఎంఎల్ ఇంజినీర్స్ జాబ్స్నే తీసుకుంటే, జీసీసీల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగి వార్షిక వేతనం రూ.9.7 లక్షలు కాగా, సీనియర్ లెవెల్ సిబ్బంది ప్యాకేజీ రూ.43 లక్షల్లో ఉంది. ఐటీ కంపెనీలను పరిశీలిస్తే, అవే విధులకు గాను ఎంట్రీ లెవెల్ ప్యాకేజీ రూ.5.7 లక్షల నుండి సీనియర్లకు గరిష్టంగా 17.9 లక్షలుగా ఉండడటం గమనార్హం.చిన్న నగరాల్లోనూ నిపుణులకు డిమాండ్ జీసీసీలు టెకీలకు భారీగా వేతన ప్యాకేజీలు ఇస్తున్న నగరాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గురుగ్రా మ్, హైదరాబాద్, చెన్నై వంటివి ఉన్నాయి. అయితే, జైపూర్, ఇండోర్, కోయంబత్తూరు తదితర ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా జీసీసీలు, డేటా సెంటర్లు శరవేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో అక్కడ డే టా సైన్స్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, డే టా ఇంజినీరింగ్ నిపుణులకు డిమాండ్ భారీగా ఉందని పరిశ్రమ చెబుతోంది. ‘జీసీసీలు ప్రధానంగా జెన్ ఏఐ, ఏఐ/ఎంఎల్, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి విభాగాలపై ఫోకస్ చేస్తున్నాయి. దీంతో డిజిటల్ మార్పులకు దన్నుగా నిలవడంతో పాటు నవకల్పనల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాయి’ అని టీమ్‌లీజ్ డిజిటల్ వైస్–ప్రెసిడెంట్ కృష్ణ విజ్ పేర్కొన్నారు. సాంప్రదాయ ఐటీ కంపెనీలతో పోలిస్తే జీసీసీల్లో 12–20 శాతం అధిక ప్యాకేజీలు, డిజిటల్ స్కిల్స్‌కు ఎంత డిమాండ్ ఉందనేదుకు నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు. విస్తరణ జోరు.. 2025 నాటికి జీసీసీల సంఖ్య 1900కు పెరగనుంది. సిబ్బంది 20 లక్షలను మించుతారని అంచనా. ముఖ్యంగా జెనరేటివ్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ), మెషిన్ లెరి్నంగ్/ఏఐ, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి విభాగాల్లో భారీగా నిపుణుల అవసరం ఉంటుందని టీమ్‌లీజ్ చెబుతోంది. గ్లోబల్ టెక్ హబ్‌గా భారత్ ప్రాధాన్యత అంతకంతకూ పెరుతుండటంతో వచ్చే 5–6 ఏళ్లలో ఏకంగా 800 కొత్త జీసీసీలు భారత్‌లో కొలువుదీరే అవకాశం ఉంది. ఇవి కేవలం మెట్రోలు, బడా నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విస్తరించే సన్నాహల్లో ఉండటం పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టే టెకీలకు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారత్‌లో 53 చైనా కంపెనీల వ్యాపార కేంద్రాలు
న్యూఢిల్లీ: చైనాకు చెందిన 53 విదేశీ కంపెనీలు భారత్‌లో వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నట్టు కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లడించింది. యాప్ ద్వారా రుణాలు ఇచ్చే విషయమై ఇవి ఎలాంటి డేటాను నిర్వహించడం లేదని తెలిపింది. విదేశీ కంపెనీ (భారత్‌కు వెలుపల ఏర్పాటైనది) దేశంలో వ్యాపార కేంద్రాలు తెరుచుకోవచ్చు. కాకపోతే ఇందుకు సంబంధించి ఆర్బీఐ, ఇతర నియతంణ్ర సంస్థల నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. భారత్‌లో అటువంటి కేంద్రం తెరిచిన 30 రోజుల్లోపు రిజి్రస్టార్ ఆఫ్ కంపెనీస్ వద్ద రిజి్రస్టేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ అంశంపై బదులిచ్చారు. చట్టం పరిధిలో షెల్ కంపెనీలకు సంబంధించి ఎలాంటి నిర్వచనం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 7,700 కంపెనీల మూత సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ యాక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ (సీపేస్)ను ఈ ఏడాది మేలో ఏర్పాటు చేసిన తర్వాత నుంచి, దీని కింద 7,700 కంపెనీలు వ్యాపార కార్యకలాపాలను నిలిపివేసినట్టు లోక్‌సభకు రావు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. స్వచ్చందంగా వ్యాపార కార్యకలాపాల నుంచి తప్పుకోవాలనుకునే కంపెనీలకు, దాన్ని వేగవంతంగా సాకారం చేసేందుకు ఈ ఏడాది మే 1 నుంచి సీపేస్‌ను కార్పొరేట్ శాఖ తీసుకొచి్చంది. దీంతో ఒక కంపెనీ స్వచ్చంద మూసివేతకు పట్టే సమయం 110 రోజులకు తగ్గిపోయింది. -
హెచ్–1బీ ప్రోగ్రాంలో మార్పులు
వాషింగ్టన్: ఐటీ తదితర కీలక రంగాలకు చెందిన విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో పని చేసెందుకు వీలు కలి్పంచే కీలకమైన హెచ్–1బీ వీసా ప్రోగ్రాంలో మార్పుచేర్పులను బైడెన్ సర్కారు ప్రతిపాదించింది. అర్హత ప్రమాణాలు తదితరాలను మరింత క్రమబద్ధం చేయడం, తద్వారా వీసా ప్రక్రియ సామర్థ్యాన్ని పెంచడం, ఎఫ్–1 స్టూడెంట్లకు, పారిశ్రామికవేత్తలకు, నాన్ ఇమ్మిగ్రెంట్ వర్కర్లకు మెరుగైన పరిస్థితులు కలి్పంచేందుకు ఈ మార్పులు దోహదపడతాయని చెబుతోంది. సదరు నిబంధనలను సోమవారం విడుదల చేయనున్నారు... ► ప్రస్తుత ప్రక్రియలో ఒక దరఖాస్తుదారు తరఫున ఎన్ని ఎక్కువ రిజి్రస్టేషన్లు నమోదయితే లాటరీలో ఎంపికయ్యే అవకాశాలు అంత పెరుగుతాయి. ► ప్రతిపాదిత విధానంలో ఒకరి తరఫున ఎన్ని రిజిస్ట్రేషన్లు నమోదైనా ఎంపిక ప్రక్రియలో ఒక ఎంట్రీగానే పరిగణిస్తారు. ► తద్వారా కొందరికే ఎక్కువ అడ్వాంటేజీకి బదులు అర్హులందరికీ సమానావకాశం దక్కుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. ► ఈ ప్రతిపాదనలపై అందరూ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు వెల్లడించవచ్చని డీహెచ్ఎస్ పేర్కొంది. ► అమెరికా ఏటా విడుదల చేసే 60 వేల హెచ్–1బీ వీసా కోటాలో మార్పుండదు. -
ఐఎఫ్ఎస్సీ–గిఫ్ట్ సిటీ బ్యాంక్‌లో అకౌంట్ ప్రారంభం ఈజీ
న్యూఢిల్లీ: గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీ... ఇంటర్నేషన్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్స్ (ఐఎఫ్ఎస్సీ–గిఫ్ట్ సిటీ) బ్యాంకులో ఎటువంటి పాన్ లేకుండా విదేశీ కంపెనీలు, ఎన్ఆర్ఐలు, నాన్–రెసిడెంట్లు అకౌంట్ ప్రారంభించే వెసులుబాటును ఆర్థికశాఖ కలి్పంచింది. ఈ మేరకు ఆదాయపు పన్ను నిబంధనల మినహాయింపు కలి్పంచినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీనిప్రకారం బ్యాంక్ ఖాతాను తెరిచే నాన్–రెసిడెంట్ లేదా విదేశీ కంపెనీ ఫారమ్ 60లో డిక్లరేషన్‌ను దాఖలు చేస్తే సరిపోతుంది. అలాగే భారతదేశంలో ఎలాంటి పన్ను బకాయిలను కలిగి ఉండకూడదు. జీఐఎఫ్‌టీ–ఐఎఫ్ఎస్సీ ఆర్థిక రంగానికి సంబంధించి పన్ను–తటస్థ ప్రాంతంగా ఉంటుందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సడలింపు విదేశీ కంపెనీలు, ఎన్ఆర్ఐలు, ఇతర నాన్–రెసిడెంట్లు ఐఎఫ్ఎస్సీ బ్యాంక్‌లో బ్యాంక్ ఖాతాను తెరవడాన్ని సులభతరం చేస్తుందని నంగియా అండర్సన్ ఎల్ఎల్పీ భాగస్వామి ( ఫైనాన్షియల్ సర్వీసెస్) సునీల్ గిద్వానీ అభిప్రాయపడ్డారు. రుణాలు, డిపాజిట్లుసహా ఐఎఫ్ఎస్సీలో రిటైల్ వ్యాపార విభాగం పురోగతికి తాజా నిర్ణయం ఉపయోగపడుతుందని గిద్వానీ చెప్పారు. -
మూడు రష్యా సంస్థలకు ఎఫ్‌పీఐ లైసెన్సులు
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన మూడు సంస్థలకు భారతీయ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పీఐ) లైసెన్సును జారీ చేసింది. మాస్కో కేంద్రంగా పనిచేసే ఆల్ఫా క్యాపిటల్ మేనేజ్మెంట్ కంపెనీతో పాటు విసెవిలోద్ రోజానోవ్ అనే ఇన్వెస్టరు ఈ లైసెన్సులను పొందిన జాబితాలో ఉన్నారు. మూడేళ్ల పాటు 2026 వరకు ఇది వర్తిస్తుంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై ఆంక్షలు అమలవుతున్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి రష్యా ఇన్వెస్టర్లు ఎఫ్‌పీఐ మార్గాన్ని ఎంచుకోవడం ఇదే ప్రథమం కావచ్చని పరిశమ్ర వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ వారు ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) మార్గంలోనే ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించాయి. డాలరును ఆయుధంగా చేసుకుని రష్యాపై ఆంక్షలను ప్రయోగిస్తుండటమనేది కొత్త ఆర్థిక పరిస్థితులకు దారి తీస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా తాజా ధోరణి ప్రాధాన్యం సంతరించుకున్నట్లు పేర్కొన్నారు. -
దేశంలో 1330 విదేశీ కంపెనీల మూత
న్యూఢిల్లీ: విదేశీ కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు కలిపి సుమారు 1330 కంపెనీలు గడిచిన మూడేళ్ల కాలంలో భారత్‌లో కార్యకలాపాలు నిలిపివేసినట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభకు వెల్లడించారు. మరోవైపు గత మూడేళ్లలో 4,994 విదేశీ కంపెనీలు లేదా వాటి సబ్సిడరీలు భారత్‌లో కార్యకాలాపాలు ఆరంభించినట్టు చెప్పారు. దేశం మొత్తం మీద 17,432 విదేశీ కంపెనీలు, వాటి సబ్సిడరీలు ప్రస్తుతం నిర్వహిస్తున్నట్టు రాజ్యసభకు వెల్లడించారు. కార్యకలాపాలు మూసివేయడం అన్నది ఆయా కంపెనీల వ్యక్తిగత వాణిజ్య నిర్ణయాలుగా మంత్రి పేర్కొన్నారు. కార్యకలాపాలు లాభసాటిగా లేకపోవడం, వనరుల లభ్యత, మార్కెట్ పరిమాణం, సదుపాయాలు, రాజకీయ, స్థూల ఆర్థిక వాతావరణం తదితర అంశాలు కంపెనీల నిర్ణయాలను ప్రభావితం చేస్తాయన్నారు. మరో ప్రశ్నకు వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ స్పందిస్తూ.. భారత్–చైనా మధ్య వాణిజ్య అంతరం 2021–22లో 73 బిలియన్ డాలర్లకు పెరిగిందని, ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 44 బిలియన్ డాలర్లుగానే ఉన్నట్టు తెలిపారు. -
ఈ–కామర్స్ రంగంలో డిమాండ్.. వేర్‌హౌసింగ్‌లోకి విదేశీ దిగ్గజాలు
దేశీయంగా ఈ–కామర్స్ గణనీయంగా పెరుగుతుండటంతో డిమాండ్‌కి అనుగుణంగా ఎఫ్ఎంసీజీ, దుస్తులు, ఫార్మా, ఆహారోత్పత్తులు మొదలైన వాటిని నిల్వ చేసేందుకు గిడ్డంగుల అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వేర్‌హౌసింగ్ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పలు విదేశీ కంపెనీలు రంగంలోకి దిగుతున్నాయి. గత అయిదారు నెలల్లో ఇలాంటి మూడు సంస్థలు భారత్‌లో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించాయి. ఫ్రాన్స్‌కి చెందిన థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3పీఎల్) సంస్థ ఎఫ్ఎం లాజిస్టిక్, జర్మనీ సంస్థ రీనస్ గ్రూప్, అమెరికాకు చెందిన పానటోనీ ఈ జాబితాలో ఉన్నాయి. 1.4 బిలియన్ యూరోల ఎఫ్ఎం లాజిస్టిక్ భారత్‌లో తమ తొలి మలీ్ట–క్లయింట్ ఫెసిలిటీ (ఎంసీఎఫ్)ను హరియాణాలోని ఫరూఖ్‌నగర్‌లో ప్రారంభించింది. 31 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో దేశవిదేశాల్లోని కస్టమర్లకు అవసరమయ్యే వేర్‌హౌసింగ్, హ్యాండ్లింగ్, పంపిణీ, ఈ–కామర్స్ తదితర సరీ్వసులు అందిస్తోంది. ప్రస్తుతం 70 లక్షల చ.అ. స్థలం ఉండగా, 3పీఎల్ తరహా సేవలకు డిమాండ్ పెరుగుతున్నందున.. దీన్ని 2026 నాటికి 1.2 కోట్ల చ.అ.కు పెంచుకోనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. తాము సరైన సమయంలో భారత మార్కెట్లో ప్రవేశించామని భావిస్తున్నట్లు వివరించాయి. మరోవైపు, రీనస్ గ్రూప్ పారిశ్రామిక రంగ సంస్థల అవసరాలకు ఉపయోగపడేలా గురుగ్రామ్, ముంబైలో రెండు కెమికల్ వేర్‌హౌస్‌లను ప్రారంభించింది. దేశీయంగా పారిశ్రామిక రంగం వృద్ధి చెందే కొద్దీ వచ్చే మూడేళ్లలో 24 లక్షల చ.అ. స్థలాన్ని 50 లక్షల చ.అ.లకు పెంచుకోనున్నట్లు రీనస్ లాజిస్టిక్స్ ఇండియా ఎండీ వివేక్ ఆర్యా తెలిపారు. కొత్తగా అమెరికాకు చెందిన పానటోనీ కూడా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. 200 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రధాన నగరాల్లో నాలుగు పారిశ్రామిక, లాజిస్టిక్స్ పార్క్‌లను అభివృద్ధి చేయనుంది. కోవిడ్‌తో ఊతం.. కోవిడ్ పరిణామాలతో వినియోగదారులు కాంటాక్ట్‌రహిత లావాదేవీలు, క్విక్ డోర్ స్టెప్ డెలివరీల వైపు మొగ్గు చూపుతుండటం దేశీయంగా ఈ–కామర్స్‌కి దన్నుగా ఉంటోందని పానటోనీ ఎండీ (ఇండియా) సందీప్ చందా తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌లో వేర్‌హౌసింగ్ విభాగం గణనీయంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. బహుళ జాతి కంపెనీలు చైనా+1 వ్యూహాన్ని పాటిస్తుండటంతో ప్రత్యామ్నాయ తయారీ హబ్‌గా ఎదిగేందుకు భారత్ చేస్తున్న కృషి కారణంగా దేశీయంగా వేర్‌హౌసింగ్ విభాగం మరింతగా వృద్ధి చెందనుంది. దీంతో చాలామటుకు రిటైలర్లు, ఈ–కామర్స్ సంస్థలు వేర్‌హౌసింగ్ స్పేస్‌ను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇక, సానుకూల మార్కెట్ పరిస్థితులు, మేకిన్ ఇండియా నినాదంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టడం, జీఎస్టీ అమలు మొదలైన అంశాలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేలా ఇన్వెస్టర్లలో ఆసక్తి కలిగిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రీసెర్చ్ అండ్ మార్కెట్స్ అనే కన్సల్టెన్సీ అంచనాల ప్రకారం దేశీ వేర్‌హౌసింగ్ మార్కెట్ 2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,05,000 కోట్లుగా ఉంది. 26.5 కోట్ల చ.అ. స్పేస్ అందుబాటులో ఉంది. 2026 నాటికి ఈ విభాగం ఆదాయం దాదాపు 11% వార్షిక వృద్ధితో రూ. 2,24,379 కోట్లకు చేరనుంది. స్పేస్ అవసరాలు సుమారు 13% వార్షిక వృద్ధితో 48.3 కోట్ల చ.అ. స్థాయికి చేరనుంది. -
భారత్‌లో 3,291 విదేశీ కంపెనీలు
న్యూఢిల్లీ: దేశంలో నమోదైన 5,068 విదేశీ కంపెనీల్లో 2022 జూలై 27వ తేదీ నాటికి 3,291 కంపెనీలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సోమవారం వెల్లడించారు. క్రియాశీలంగాలేని విదేశీ కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అంశాన్ని పరిశీలించడం లేదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కంపెనీల చట్టం, 2013ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. దేశంలో పనిచేస్తున్న కంపెనీలు ఈ చట్టం కింద తప్పనిసరిగా నమోదుకావాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం పొందిన తర్వాత విదేశీ కంపెనీలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) ఢిల్లీలో నమోదవుతాయి. విదేశీ క్రియాశీల కంపెనీలు తప్పనిసరిగా చట్ట ప్రకారం స్టాట్యూటరీ ఫైలింగ్ జరుపుతాయి. వివిధ చట్ట పరమైన అంశాలకు అనుగుణంగా పనిచేస్తాయి. ఆయా అంశాలపై లోక్‌సభలో మంత్రి లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. భారతదేశంలో 1,777 విదేశీ కంపెనీలు తమ వ్యాపార కార్యాలయాను మూసివేసినట్లు చెప్పారు. షెల్ కంపెనీల నిర్వచనం లేదు: కంపెనీల చట్టంలోని నిబంధనల ప్రకారం, రిజిస్టర్డ్ విదేశీ షెల్ కంపెనీలను నిర్వచించలేదని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘కంపెనీల చట్టంలోని సెక్షన్ 2(42)లోని నిబంధనలు విదేశీ కంపెనీలు నిర్వచనాన్ని ఇస్తున్నాయి. దీని ప్రకారం భారతదేశం వెలుపల ఒక కంపెనీ లేదా సంస్థ రిజిస్టరై, అది భారతదేశంలో స్వయంగా లేదా ఏజెంట్ ద్వారా, భౌతికంగా లేదా ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా ఏవైనా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుంది. ఇలాంటి కంపెనీని చట్టం విదేశీ కంపెనీగా పేర్కొంటోంది’’ అని సింగ్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిన బ్రాంచ్ ఆఫీస్ అద్దె ఒప్పందం అమలు నిలిచిపోవడం, చెల్లుబాటు గడువు ముగియడం వంటి కారణాల వల్ల భారతదేశంలో ఒక విదేశీ కంపెనీ క్రియాశీలంగా లేదని పరిగణిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 119 కేసుల విచారణకు ఎస్‌ఎఫ్‌ఐఓకు ఆదేశాలు.. 2017–18 నుండి ఇప్పటి వరకు 119 కేసులను విచారించాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ)ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ కోరినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపింది. 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అలాగే 2022–23 జూన్ 30వ తేదీ వరకూ కార్పొరేట్ మోసానికి పాల్పడిన ఏ లిస్టెడ్ కంపెనీని గుర్తించలేదని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తెలియజేసినట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. -
టేస్టీ..యమ్మీ!.. విదేశాల్లో మన మామిడికి ఫుల్ డిమాండ్
సాక్షి,జి సిగడాం(శ్రీకాకుళం): సింగపూర్, దుబాయ్, స్విట్జర్లాండ్, అమెరికా వంటి దేశాల్లో సిక్కోలు మామిడికి మంచి గిరాకీ ఉందన్న సంగతి తెలుసా..? ఆశ్చర్యంగా అని పించినా ఇదే నిజం. జిల్లాలోని గంగువారి సిగడాం మండలం వెలగాడ పంచాయతీ చంద్రయ్యపేట గ్రామం నుంచి ఏటా మామిడిని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ గ్రామంలో సుమారు 100 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఇక్కడ వివిధ రకాల మామిడి కాయలు పండించడంతో ఈ కాయలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. హిమాపసల్ అంటే మహా ఇష్టం ఈ గ్రామంలోని తోట నుంచి హిమాపసల్ మామిడి కాయలను సింగపూర్, దుబాయి, స్విట్జర్లాండ్, అ మెరికా దేశాలకు తరచూ ఎగుమతి చేస్తారు. అలాగే మనదేశంలోని తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకూ ఈ మామిడిని తరలిస్తారు. అక్కడ కాయ రూ.50 నుంచి రూ.75 వరకు పలుకుతుంది. వందకాయలు దాదాపు రూ.7వేల వరకు విక్రయిస్తారు. ఈ రకం మామిడి సువాసన కిలోమీటర్ వరకు వ్యాపిస్తుందని చెబుతుంటారు. రుచి కూడా అమోఘం. కాయ సుమారుగా ఐదువందల గ్రాముల బరువు ఉంటుంది. 60 ఎకరాల్లో హిమాపసల్.. ఈ ఏడాది హిమాపసల్ మామిడి కాయ దిగుబడి తగ్గింది. ఉన్న మేర ఎగుమతి చేశాం. ఈ తోటలో 60 ఎకరాల్లో హిమపసల్ చెట్లు ఉన్నాయి. – ఎస్ కృష్ణ, కౌలు రైతు చదవండి: మెట్రో రైలులో యువతి ‘జిగల్’ డ్యాన్స్.. సోషల్ మీడియా షేక్ -
వెనక్కి రాకుంటే.. సాలిడ్ షాక్ ఇచ్చిన రష్యా
ఉక్రెయిన్ సంక్షోభం రష్యాను ఆర్థికంగా ఇరకాటంలో పెట్టేందుకు పాశ్చాత్య దేశాలకు ఒక అవకాశం కల్పించింది. ఇప్పటికే రికార్డు స్థాయి ఆంక్షలతో రష్యాను.. అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో నిరసన పేరిట ప్రముఖ కంపెనీలెన్నో రష్యాను వీడాయి. అయితే.. ఆ కంపెనీలకు ఇప్పుడు సాలిడ్ షాక్ ఇచ్చింది రష్యా. విదేశీ కంపెనీలు రష్యాకు తిరిగి రావడానికి డెడ్‌లైన్ విధించింది పుతిన్ ప్రభుత్వం. మే 1వ తేదీలోపు తిరిగి తమ దేశానికి రాకుంటే, కార్యకలాపాలను మొదలుపెట్టకుంటే.. ఆయా కంపెనీలపై పదేళ్లపాటు నిషేధం విధిస్తామని సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రష్యా డూమా డిప్యూటీ యెవ్గెని ఫెడోరోవ్ సదరు కీలక ప్రతిపాదన వివరాలను వెల్లడించారు. ‘‘ ఇది పూర్తిగా వాళ్లకు సంబంధం లేని వ్యవహారం. వాళ్ల జోక్యం అక్కర్లేనిది. వేలమంది రష్యన్ పౌరుల పౌరులను వాళ్లు(ఆ కంపెనీలను ఉద్దేశించి) అనిశ్చితిలోకి నెట్టేశారు. వాళ్ల భవిష్యత్తు, బాగోగుల గురించి ఏమాత్రం ఆలోచించలేదు’’. అని ఆ ప్రకటన చదివి వినిపించారు ఆయన. మే 1, 2022లోపు వారి(ఆ కంపెనీలు) కార్యకలాపాలను పునరుద్దరించుకోవడానికి అనుమతిస్తున్నాం. ఒకవేళ అది జరగకుంటే.. వాణిజ్య లావాదేవీలను అడ్డుకోవడమే కాదు.. పదేళ్ల పాటు రష్యాలో కార్యకలాపాలు నిర్వహించుకోకుండా నిషేధం కూడా విధిస్తాం అని స్పష్టం చేశారు యెవ్గెని. అంతకుముందు, రష్యాను విడిచిపెట్టిన విదేశీ కంపెనీలకు బాహ్య నిర్వహణను ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ ఆలోచనకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మద్దతు ఇచ్చారు. దీని ప్రకారం.. అధికారులు దీనికి తగినంత చట్టపరమైన మార్కెట్ సాధనాలను కలిగి ఉంటారు. అయితే వ్యాపారాలను నేరుగా జాతీయకరణ చేయడం కంటే.. విదేశీ కంపెనీల్లో తాత్కాలిక పాలన విభాగం ఏర్పాటు చేసుకోవడం మంచిదనే సూచనను ఎప్పటి నుంచో చేస్తున్నారు రష్యా ఆర్థిక మేధావులు. -
విదేశీ మొబైల్ కంపెనీలు.. రూ.6,500 కోట్ల పన్ను ఎగవేత
న్యూఢిల్లీ: విదేశీ సంస్థల ఆధీనంలోని మొబైల్ కమ్యూనికేషన్, హ్యాండ్సెట్ తయారీ సంస్థల కార్యాలయాలు, వాటికి సంబంధించిన వ్యక్తుల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో భారీగా పన్ను ఎగవేత జరిగిందని ఆదాయ పన్ను విభాగం గుర్తించింది. రూ. 6,500 కోట్ల పైచిలుకు లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించినట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. డిసెంబర్ 21న తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్ మొదలైన రాష్ట్రాల్లో ఆయా సంస్థల కార్యాలయాల్లో ఐటీ విభాగం సోదాలు నిర్వహించింది. రెండు పెద్ద కంపెనీలు.. విదేశాల్లోని తమ మాతృ సంస్థలకు ఏకంగా రూ. 5,500 కోట్ల పైచిలుకు మొత్తాన్ని రాయల్టీ మొదలైన రూపాల్లో చెల్లించాయని ఈ సోదాల్లో తేలినట్లు సీబీడీటీ పేర్కొంది. అయితే ఆ సంస్థల పేర్లు మాత్రం వెల్లడించలేదు. సందేహాస్పద సంస్థల నుంచి రూ. 5,000 కోట్ల పైచిలుకు రుణాలు చూపిన దేశీ విభాగాలు.. వాటిపై వడ్డీ వ్యయాలను కూడా క్లెయిమ్ చేసుకున్నాయని సీబీడీటీ పేర్కొంది. అలాగే అనుబంధ సంస్థల తరఫున చేసిన చెల్లింపులను ఎక్కువగా చేసి చూపించడం, భారత విభాగాల లాభాలను (పన్నులు వర్తించే) తక్కువ చేసి చూపించడం వంటి అవకతవకలకు పాల్పడ్డాయని తెలిపింది. ఈ తరహా నేరాలకు రూ. 1,000 కోట్ల పైగా జరిమానా విధించేందుకు ఆస్కారం ఉందని పేర్కొంది. చదవండి: క్రిప్టో లావాదేవీల్లో అక్రమాలు.. రూ. 49 కోట్ల ఫైన్.. -
యూఏఈ సంచలన చట్టం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం. దశాబ్దాలుగా సాగుతున్న ‘కుటుంబాల వ్యాపార’ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా కొత్త చట్టం తీసుకురాబోతోంది. ఒకవేళ చట్టం విదేశీ కంపెనీలు నేరుగా అక్కడ వ్యాపారలావాదేవీలు నిర్వహించుకునే అవకాశం కలగనుంది. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. యూఏఈలో చాలాఏళ్లుగా కొన్ని కుటుంబాల చేతుల్లోనే వ్యాపార సామ్రాజ్యం నడుస్తోంది. కమర్షియల్ ఏజెన్సీ అగ్రిమెంట్ల సాయంతో విదేశీ కంపెనీలన్నింటిని ఈ కుటుంబాలే నడిపిస్తూ వస్తాయి . అయితే ఆ అగ్రిమెంట్ల ఆటోమేటిక్ రెన్యువల్‌కు పుల్‌స్టాప్ పెట్టేలా యూఏఈ ప్రభుత్వం కొత్త చట్టం తేనుంది. ఇప్పటికే చట్ట రూపకల్పన జరిగిపోయిందని, ఎమిరేట్స్ నాయకత్వం దానిని ఆమోదం తెలపడం మాత్రమే మిగిలిందని ఆ కథనం వెల్లడించింది. అయితే ఎప్పటిలోపు ఆ చట్టం తీసుకురాబోతున్నారన్న విషయంపై మాత్రం స్పష్టత కొరవడింది. ఇదిలా ఉంటే ఈ గల్ఫ్ దేశంలో ఎక్కువ శాతం వ్యాపారాలు, ఇతర కమర్షియల్ యాక్టివిటీస్ కూడా కొన్ని కుటుంబాల చేతుల్లోనే నడుస్తున్నాయి. హోటల్ ఫ్రాంచైజీల దగ్గరి నుంచి కార్ డీలర్‌షిప్‌ల దాకా ప్రతీది కొన్ని కుటుంబాలే నడిపిస్తున్నాయి. ఒకవేళ తాజా చట్టం గనుక అమలులోకి వస్తే మాత్రం.. విదేశీ కంపెనీలకు ఊరట కలగనుంది. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే యోచనలో ఉన్నాయి కొన్ని కుటుంబాలు. చదవండి: వీకెండ్ సెలవుల్ని మార్చేసిన యూఏఈ. ఎప్పుడో తెలుసా? -
బీపీసీఎల్ కొనుగోలు రేసులో దిగ్గజాలు
న్యూఢిల్లీ: ఇంధన రంగ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) కొనుగోలుకి విదేశీ చమురు కంపెనీలు జట్టుకట్టనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదిలోనే వేదాంతా గ్రూప్, అపోలో గ్లోబల్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ బిడ్స్‌ను దాఖలు చేశాయి. బీపీసీఎల్‌ను సొంతం చేసుకునేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన(ఈవోఐ) సంస్థలతో ఇతర కంపెనీలు సైతం జత కలిసే వీలున్నట్లు ఒక డాక్యుమెంట్ పేర్కొంది. తద్వారా కన్సార్షియంగా ఏర్పాటుకావచ్చని తెలుస్తోంది. 2020 నవంబర్ 16న బిడ్డింగ్‌కు గడువు ముగిసింది. బీపీసీఎల్‌లో కేంద్ర ప్రభుత్వానికి గల 52.98% వాటా విక్రయానికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆర్ఐఎల్, అదానీతోపాటు.. రాయల్ డచ్ షెల్, బీపీ, ఎగ్జాన్ బిడ్డింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. అయితే రష్యన్ సంస్థ రాస్‌నెఫ్ట్, మధ్యప్రాచ్యానికి చెందిన పలు చమురు దిగ్గజాలు బీపీసీఎల్ పట్ల ఆసక్తి చూపుతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. తద్వారా బిడ్స్ దాఖలు చేసిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీలతో జత కలవనున్నట్లు తెలుస్తోంది. కన్సార్షియంగా ఏర్పాటయ్యాక బిడ్స్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్ లభించవలసి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బీపీసీఎల్ కొనుగోలు చేసే సంస్థకు దేశీ చమురు శుద్ధి సామర్థ్యంలో 14% వాటా లభించనుంది. అంతేకాకుండా 23% ఇంధన మార్కెట్ వాటానూ దక్కించుకునే వీలుంది. -
డిజిటల్ ట్యాక్స్‌పై కేంద్రం వెనకడుగు
న్యూఢిల్లీ: సమాన అవకాశాలు కల్పించే దృష్టితో విదేశీ ఈ కామర్స్ సంస్థలపై అమలు చేస్తున్న 2 శాతం డిజిటల్ పన్ను విషయంలో కేంద్రం కొంత వెనక్కి తగ్గింది. భారత అనుబంధ విభాగాల ద్వారా విదేశీ ఈ కామర్స్ సంస్థలు విక్రయాలు నిర్వహిస్తే డిజిటల్ పన్ను ఉండదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ మేరకు సవరించిన ఆర్థిక బిల్లు 2021లో కేంద్రం స్పష్టతనిచ్చింది. భారత్‌లో శాశ్వత విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నా లేదా ఇక్కడ ఆదాయపన్ను చెల్లిస్తున్నా 2 శాతం సమానత్వలెవీని చెల్లించక్కర్లేదని కేంద్రం పేర్కొంది. అయితే భారత్‌లో ఆదాయపన్ను చెల్లించకుండా ఈ కామర్స్ విక్రయాలు చేపట్టే విదేశీ సంస్థలపై ఇక ముందూ 2 శాతం పన్ను కొనసాగుతుందని స్పష్టం చేసింది. వార్షిక ఆదాయాలు రూ.2 కోట్లు దాటిన విదేశీ సంస్థలపై డిజిటల్ ట్యాక్స్‌ను 2020 ఏప్రిల్‌లో కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన విషయం గమనార్హం. ‘సవరణ ద్వారా ఒకటి స్పష్టం చేయదలుచుకున్నాను. భారత్‌లో నివసించే వారికి సంబంధించిన వస్తువులపై సమానత్వ పన్ను అమలు కాదు. భారత్‌లో పన్నులు చెల్లించే భారత వ్యాపార సంస్థలు.. అదే సమయంలో భారత్‌లో ఎటువంటి పన్నులు చెల్లించకుండా ఈ–కామర్స్ విక్రయాలు నిర్వహించే విదేశీ కంపెనీల మధ్య సమాన అవకాశాల కోణంలోనే దీన్ని ప్రవేశపెట్టాం’ అని ఆర్థిక మంత్రి సీతారామన్ లోక్‌సభకు తెలిపారు. డిజిటల్ ట్యాక్స్ అన ్నది అమెరికా కంపెనీల పట్ల వివక్ష చూపించడమేనంటూ అమెరికా గతంలో ఆరోపించింది. భారత రేటింగ్ తగ్గదు భారత్‌కు పెట్టుబడుల రేటింగ్ కొనసాగుతుందని.. రేటింగ్ డౌన్‌గ్రేడ్‌కు అవకాశాల్లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిల్లోనే ఉండడం, అధిక జీడీపీ వృద్ధి, రికార్డు స్థాయి విదేశీ పెట్టుబడులు, తక్కువ ద్రవ్యలోటు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలిచే అంశాలుగా పేర్కొన్నారు. యూపీఏ హయంలో 2009–14 మధ్య సగటు జీడీపీ 6.7 శాతంగా ఉంటే, ఎన్డీఏ హయాంలో 2014–19 మధ్య 7.5 శాతంగా ఉన్నట్టు చెప్పారు. కాంగ్రెస్ హయంలోని యూపీఏ సర్కారు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యçస్తం చేయగా, మోదీ సర్కారు దీన్ని సరైన దారిలో పెట్టినట్టు తెలిపారు. ఆర్థిక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం ఆర్థిక బిల్లు 2021కి రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. మంగళవారం లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు బుధవారం రాజ్యసభ ముందుకు వచ్చింది. చర్చలో భాగంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సీతారామన్ సమాధానమిచ్చారు. చర్చ అనంతరం మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో బడ్జెట్ 2021–22కు పార్లమెంటు ఆమోదం పూర్తయింది. పీఎఫ్ సభ్యులకు పన్ను లేని చందా రూ.5 లక్షలకు పెంచడం సహా పలు సవరణలను బిల్లులో ప్రతిపాదించారు. -
వామ్మో.. విదేశీ విత్తన ప్యాకెట్లు!
కరోనా విపత్తుతో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్న తరుణంలో విదేశాల నుంచి అవాంఛిత విత్తనాల ప్యాకెట్లు అడగకుండానే పౌరుల పేరు మీద వేలాదిగా పోస్టులో రావటం అమెరికా, కెనడా, జపాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ తదితర ఐరోపా దేశాల్లో ఇటీవల పెను సంచలనాన్ని కలిగించింది. వ్యవసాయక జీవవైవిధ్యానికి, ఆహార భద్రతకు పెనుముప్పు కలిగించే దురుద్దేశంతోనే చైనా ఈ ‘విత్తన బాంబుల’ను విసురుతున్నదని సర్వత్రా ఆందోళన నెలకొంది. అనుమానాస్పద విత్తన ప్యాకెట్లు ఎవరి పేరు మీద వచ్చినా ఆ విత్తనాలను ముట్టుకోవద్దని, పొలంలో, పెరట్లో, కుండీల్లో ఎక్కడా కూడా వాటిని మట్టిలో నాటవద్దని, ఇటువంటి విదేశీ విత్తన ప్యాకెట్లు ఎవరికైనా అందితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయా దేశాల ప్రభుత్వాలు పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. చైనా ఈ ఆరోపణలను ఖండించింది. అయితే, కోరని వ్యక్తులకు పోస్టు/కొరియర్ ద్వారా విదేశాల నుంచి వస్తున్న ఈ విత్తన ప్యాకెట్లపై చైనా పేరు ముద్రించి ఉండటంతో చైనా దేశం నుంచే దురుద్దేశంతోనే రకరకాల రంగుల్లో, రకరకాల పంటల విత్తనాలను పంపుతున్నట్లు భావిస్తున్నారు. భారత వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కూడా ఇటువంటి హెచ్చరికే చేసింది. అనుమానాస్పద విత్తనాలు విషపూరితమైనవి అయి ఉండొచ్చని.. వైరస్లు, బ్యాక్టీరియా వ్యాధులతో అనేక పంటలకు పెనునష్టం కలిగించేవి అయి ఉండొచ్చని.. భయంకరమైన కలుపు జాతి మొక్కల విత్తనాలు కూడా ఇందులో ఉండొచ్చని హెచ్చరించింది. వీటి ద్వారా వ్యవసాయ పర్యావరణానికి, జాతి భద్రతకు ముప్పు కలగొచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ హెచ్చరించింది. ఇటువంటి విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, విత్తనాభివృద్ధి సంస్థలు, పరిశోధనా సంస్థలకు కేంద్ర వ్యవసాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డా. దిలిప్ కుమార్ శ్రీవాస్తవ లేఖ రాశారు. మన దేశంలో ఎవరికీ అనుమానాస్పద విత్తన ప్యాకెట్లు వచ్చినట్లు ఇప్పటికైతే సమాచారం లేదు. దేశ జీవ భద్రతకు, ఆహార భద్రతకు ముప్పు విదేశాల నుంచి పరిశోధనల నిమిత్తం విత్తనాలను, మొక్కలను తెప్పించుకోవడానికి ప్రత్యేకమైన క్వారంటెయిన్ వ్యవస్థ ఉంది. అయినా పోర్టులు, ఎయిర్‌పోర్టులు, సరిహద్దుల దగ్గర అధికారుల కన్నుగప్పి కొన్ని విత్తనాలు, మొక్కలు మన దేశంలోకి వస్తూనే ఉన్నాయి. అమెరికా నుంచి అలా వచ్చిన వర్తులాకార తెల్లదోమ కొబ్బరి, పామాయిల్ వంటి ఉద్యాన తోటలను గత మూడేళ్లుగా అల్లాడిస్తున్న సంగతి జ్జాపకం పెట్టుకోవాలి. అయితే, విదేశాల్లో కంటికి నచ్చాయని పెరట్లో పెంచుకుందామన్న ఆసక్తి కొద్దీ ఒకటీ అరా అయినా సరే విదేశీ విత్తనాలను మన దేశానికి తెస్తున్న / తెప్పించుకుంటున్న వారు లేకపోలేదు. తెలిసీ తెలియక చేసే ఇటువంటి పని ఎంత ప్రమాదకరమో ఇప్పటికైనా తాము దేశ జీవ భద్రతకు, ఆహార భద్రతకు ముప్పు తెచ్చి పెడుతున్నారని గుర్తించాలని అధికారులు హెచ్చస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయండి: డా.కేశవులు అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘం(ఐఎస్‌టిఎ) ఉపాధ్యక్షులు, తెలంగాణ విత్తనోత్పత్తి – ఆర్గానిక్ ధృవీకరణ సంస్థ సంచాలకులు డాక్టర్ కేశవులు ఈ విషయమై ముందుగా స్పందించి, కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. విత్తనంతో పాటు విదేశాల నుంచి వచ్చే అవకాశం ఉన్న ప్రమాదకరమైన చీడపీడలు మన దేశ జీవవైవిధ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన అన్నారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఇతర సరిహద్దు ప్రాంతాల్లో విత్తన క్వారంటెయిన్ యంత్రాంగం మరింత జాగరూకత వహించాలని ఆయన సూచించారు. ఎవరికైనా అనుమానాస్పద విత్తన ప్యాకెట్లు అందితే వెంటనే దగ్గరలోని వ్యవసా, పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. లక్షలాది ఎకరాల్లో అనేక రాష్ట్రాల్లో నిషిద్ధ కలుపు మందును తట్టుకునే పత్తి విత్తనాలు అక్రమంగా సాగవుతున్న మన దేశంలో ఇలాంటి అవాంఛనీయ విత్తనాలను అరికట్టడం సాధ్యమేనా అన్న సందేహాలకు తావు లేదని, ప్రభుత్వం పటిష్ట నియంత్రణ చర్యలు తీసుకుంటున్నదని ‘సాక్షి సాగుబడి’ ముఖాముఖిలో డా. కేశవులు అన్నారు. దశాబ్దాల క్రితం గోధుమలతోపాటు మన దేశానికి అమెరికా నుంచి దిగుమతైన పార్థీనియం (వయ్యారిభామ/ కాంగ్రెస్ గడ్డి) మొక్కలు తామర తంపరగా పెరుగుతూ జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమిస్తున్న విషయం తెలిసిందే. -
డిజిటల్ అడ్వర్టయిజింగ్ మార్కెట్‌పై.. విదేశీ పెత్తనం
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలంలో కాటన్ ఎగుమతి చేసి బట్ట లు దిగుమతి చేసుకునేవాళ్లమని పెద్దలు చెబుతుంటారు. ఇదే తరహాలో మన దేశం ఒక విచిత్ర సమస్య ఎదుర్కొంటోంది. మనం సాఫ్ట్వేర్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాం. ప్లాట్‌ఫామ్‌లు మనమే క్రియేట్ చేసి ఇస్తున్నాం. కంటెంట్ మనదే. పాఠకులు, శ్రోతలు, ప్రేక్షకులు మనవాళ్లే. ప్రకటనలపై వెచ్చించేది మనవాళ్లే. ఆదాయం మాత్రం.. ఈ ప్రకటనలను సమీకరించి ప్రచురణకు ఇస్తున్న విదేశీ డిజిటల్ యాడ్స్ ఏజెన్సీలది. మనకు గూగుల్ కేవలం ఒక సెర్చ్ ఇంజిన్‌గా మాత్రమే తెలుసు. కానీ దీని ప్రధాన ఆదాయ వనరు డిజిటల్ యాడ్స్. కం పెనీల నుంచి యాడ్స్ తీసుకోవడం, డిజిటల్ పబ్లిషర్స్‌కు ప్రచురించేందుకు ఇవ్వడం. దీని ద్వారా డిజిటల్ పబ్లిషర్స్‌కు కొంత ఇవ్వడం, అది కొంత వాటా తీసుకోవడం. ఫేస్బుక్ మనకు కేవలం సోషల్ మీడియాగానే తెలుసు. కానీ మనం ఒక యాడ్ ఇవ్వాలనుకున్నా, ఒక పోస్ట్ చాలా మందికి చేరాల నుకున్నా మనం డబ్బులు వెచ్చించాలి. అంటే కేవలం తన సోషల్ మీడియా యాప్‌లోనే యాడ్స్ ప్రచురించి సొమ్ము చేసు కుంటుంది. యూజర్స్ మనమే. డబ్బులు వెచ్చించేది చాలావరకు భారతీయ కంపెనీలే. చూసేది మనమే. క్లిక్ చేసేది మనమే. ఆయా యాప్‌లను నిర్మించింది, నిర్మించే సత్తా ఉంది మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే. ఈ యాప్‌లు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకున్నాయి. కానీ మన పబ్లిషర్లకు పెద్దగా మిగిలిందేమీ లేదు. చైనా యాప్స్ బ్యాన్ ప్రభావం ఎలా ఉండబోతోంది.. 59 చైనా యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడం, వోకల్ ఫర్ లోకల్ పిలుపు బాగా ప్రాచుర్యంలోకి రావడంతో ఇండియా డిజిటల్ అడ్వర్టయిజ్మెంట్ రంగం స్వదేశీ కంపెనీలను ఆకర్షిస్తోంది. 80 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉన్న దేశంలో ప్రకటనలను సమీకరించి ప్రచురణకు ఇచ్చే డిజిటల్ ఏజెన్సీలకు, స్వదేశీ సోషల్ మీడియా యాప్‌లకు, ఆన్లైన్ వీడియో యాప్‌లకు, స్వదేశీ ఓటీటీలకు భారీ అవకాశాలు ముందున్నాయి. అలాగే స్వదేశీ బ్రౌజర్లు, స్వదేశీ న్యూస్ అగ్రిగేటర్లు, స్వదేశీ న్యూస్ యాప్‌లకు బోలెడు అవకాశాలు ఆహ్వానం పలుకనున్నాయి. కంటెంట్, యూజర్లు, ప్రకటనలకు కొదవలేనందున ప్లాట్‌ఫామ్‌లు కూడా స్వదేశీ అయితే దేశ ఆర్థిక వృద్ధిలో అవీ భాగమవుతాయి. డెంట్సూ నివేదిక ఏం చెప్పింది? గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, టిక్‌టాక్ యాడ్స్(టిక్‌టాక్ యాప్‌ను కేంద్రం బ్యాన్ చేసింది) ఇలాంటి డిజిటల్ యాడ్ ఏజెన్సీల హవా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో డెంట్సూ ఏజిస్ నెట్వర్క్(డీఏఎన్) తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం డిజిటల్ అడ్వర్టయిజింగ్ ఇండస్ట్రీ 2019–20 నాటికి రూ. 13,683 కోట్ల టర్నోవర్‌తో ఉంది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 26 శాతం వృద్ధి రేటు నమోదైంది. 2020–21 నాటికి ఇది రూ.17 వేల కోట్లకు చేరనుంది. అలాగే 2022 నాటికి డిజిటల్ అడ్వర్టయిజింగ్ ఇండస్ట్రీ రూ.28,249 కోట్లకు, 2025 నాటికి రూ.58,550 కోట్లకు చేరనుంది. కాగా ప్రస్తుతం వాణిజ్య ప్రకటనల ఇండస్ట్రీ టర్నోవర్ మొత్తం మన దేశంలో రూ.68,475 కోట్లు ఉండగా.. 2025 నాటికి రూ.1,33,921 కోట్లకు చేరనుంది. ఈ రంగం ఏటా 11 శాతం వృద్ధి సాధిస్తుండగా.. డిజిటల్ యాడ్స్ రంగం మాత్రం ఏటా 27.42 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకోనుందని డెంట్సూ ఏజిస్ నెట్వర్క్(డీఏఎన్) తన నివేదికలో తెలిపింది. దూసుకుపోతున్న మొబైల్ యాడ్ మార్కెట్ చవకైన డేటా ప్లాన్స్, స్మార్ట్ ఫోన్ల అందుబాటు కారణంగా డిజిటల్ యాడ్స్‌పై వెచ్చించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. డిజిటల్ అడ్వర్టయిజింగ్ మార్కెట్లలో మొబైల్ యాడ్స్‌పై వెచ్చించే మొత్తం ప్రస్తుతం 40 శాతం ఉంది. అది ఈ ఆర్థిక సంవత్సరం చివరికి 52 శాతానికి చేరనుంది. మిలీనియల్స్‌ను దృష్టిలోపెట్టుకుని అడ్వర్టయిజ్మెంట్లపై కంపెనీలు వెచ్చించడం ఇటీవల పెరిగింది. యువత వీటిపై రోజుకు సగటున 2.5 గంటలు వెచ్చిస్తున్నట్టు డీఏఎన్ తెలిపింది. ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ట్విట్టర్, టిక్‌టాక్, ఫేస్బుక్, షేర్‌చాట్, రొపోసో వంటి సోషల్ మీడియా యాప్స్ నిండా మిలీనియల్స్‌ను దృష్టిలో పెట్టుకుని కంటెంట్ ఉంటుంది. అలాగే మ్యూజిక్ యాప్‌లు, యూట్యూబ్ వీడియోలు.. ఇలా డిజిటల్ అడ్వర్టయిజ్మెంట్లకు వేదికగా మారాయి. డిజిటల్ అడ్వర్జయిమెంట్ వ్యయం సోషల్ మీడియాపై 28 శాతం ఉండగా.. పెయిడ్ సెర్చ్‌పై 25 శాతం, ఆన్లైన్ వీడియోపై 22 శాతం ఉంది. ఆన్లైన్ వీడియోలపై వెచ్చించే డిజిటల్ అడ్వర్టయిజ్మెంట్ల వృద్ధిరేటు 32 శాతంగా ఉంది. -
చైనాకు అమెరికా భారీ షాక్..
వాషింగ్టన్ : ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అలీబాబా, బైదూ ఇంక్ వంటి చైనా కంపెనీలను అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్ల నుంచి తొలగించేందుకు దారితీసే తీర్మానాన్ని అమెరికన్ సెనేట్ ఆమోదించింది. చైనా కంపెనీల డీలిస్టింగ్‌తో పాటు విదేశీ కంపెనీల ప్రాధాన్యతను తగ్గించేలా బిల్లును రూపొందించింది. చైనా కంపెనీల్లో అమెరికన్ల నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేలా కీలక బిల్లును ఆమోదింపచేసింది. రిపబ్లికన్, డెమొక్రాట్ సెనేటర్లు జాన్ కెన్నెడీ, క్రిస్ వాన్ హాలెన్ ప్రతిపాదించిన బిల్లును యూఎస్ సెనేట్ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. చైనా దిగ్గజ కంపెనీల్లో కోట్లాది డాలర్లను పెట్టుబడుల రూపంలో కుమ్మరించడం పట్ల చట్టసభ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పెన్షన్ ఫండ్లు, విద్యా సంస్ధల నిధులను సైతం ఆకర్షణీయ రాబడుల కోసం చైనా కంపెనీల్లో మదుపు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ కంపెనీలకు చెక్ చైనా కంపెనీలను టార్గెట్‌గా చేసుకున్న ఈ బిల్లులో పొందుపరిచిన అంశాలను చూస్తే..విదేశీ ప్రభుత్వ నియంత్రణలో పనిచేయడం లేదని కంపెనీలు స్పష్టం చేయని పక్షంలో వరుసగా మూడేళ్లు కంపెనీ ఆడిటింగ్‌ను పబ్లిక్ కంపెనీ అకౌంటింగ్ పర్యవేక్షక బోర్డు ఆడిట్ చేయకుండా, ఆయా కంపెనీల షేర్లను ఎక్స్ఛేంజ్ల నుంచి నిషేధించేలా ఈ బిల్లును రూపొందించారు. కాగా, నియమాలకు అనుగుణంగా చైనా నడుచుకోవాలని తాను కోరుకుంటున్నానని సెనేట్‌లో బిల్లును ప్రతిపాదిస్తూ కెన్నెడీ పేర్కొన్నారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో లిస్టయిన కంపెనీలన్నీ ఒకే ప్రమాణాలను కలిగిఉండాలని, ఈ బిల్లు ఆ ప్రమాణాలను తీసుకురావడంతో పాటు ఇన్వెస్టర్లు మెరుగైన నిర్ణయాలు తీసుకునేలా పారదర్శకత అందిస్తుందని మరో సెనేటర్ వాన్ హోలెన్ అన్నారు. చదవండి : అమెరికా కీలక ముందడుగు డ్రాగన్ కంపెనీలకు గడ్డుకాలం చైనా కంపెనీలపై కొరడా ఝళిపించే బిల్లును తీసుకురావడంతో జాక్‌మాకు చెందిన యాంట్ ఫైనాన్షియల్ నుంచి సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన బైట్‌డ్యాన్స్ లిమిటెడ్ వంటి పలు చైనా కంపెనీల లిస్టింగ్ ప్రణాళికలకు విఘాతం కలిగింది. ఈ బిల్లుతో రానున్న రోజుల్లో అమెరికన్ స్టాక్ఎక్స్ఛేంజ్ల్లో లిస్టయిన చైనా కంపెనీలన్నింటికీ ఇబ్బందులు తప్పవని బీజింగ్‌కు చెందిన స్టాక్‌మార్కెట్ నిపుణులు, పోర్ట్‌ఫోలియో మేనేజర్ హల్క్స్ వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉన్న చైనా ఆడిటర్స్పైనా బిల్లు ప్రభావం చూపనుంది.ఇక అమెరికా-చైనా ట్రేడ్‌వార్ ఉద్రిక్తతల నుంచి కరోనా మహమ్మారిపై ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా బెడిసికొట్టిన నేపథ్యంలో డ్రాగన్ కంపెనీలను టార్గెట్ చేస్తూ అగ్రరాజ్యం ఈ బిల్లును తీసుకురావడం గమనార్హం. -
ఐఐటీ సూపర్.. ఫారిన్ ఆఫర్..
సాక్షి ప్రత్యేకప్రతినిధి: ఈ ఏడాది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఉద్యోగ నియామకాలకు విదేశీ కంపెనీలు క్యూ కట్టాయి. ఉత్తర అమెరికా, యూరప్, సింగపూర్, జర్మనీ, జపాన్ వంటి దేశాలు ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల విద్యార్థులను నియమించుకునేందుకు పోటీపడ్డాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థుల కోసం గత ఏడాది 26 విదేశీ కంపెనీలు బారులుతీరగా ఈ సీజన్లో ఏకంగా 51 విదేశీ కంపెనీలు నియామకాలు చేపట్టాయి. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ బీహెచ్‌యూ, ఐఐటీ గువాహటిలలో ఒక్కో విద్యార్థికి సగటున ఐదు ఆఫర్లు లభిం చాయి. ఐఐటీ హైదరాబాద్ ఉద్యోగ నియామకాల్లో కొన్ని ఐఐటీలను దాటిపోయిం ది. ఈ విద్యా సంవత్సరం బీటెక్ పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులను నియమించుకునేందుకు 38 అంతర్జాతీయ కంపెనీలు అడుగుపెట్టాయి. ఐఐటీ మద్రాస్ (34), ఐఐటీ కాన్పూర్ (22), ఐఐటీ (బీహెచ్‌యూ) వారణాసి (11), ఐఐటీ గువాహటి (25) కంటే హైదరాబాద్ ఐఐటీ అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడంలో ముందంజలో ఉంది. ‘వచ్చే జనవరి నుంచి మొదలయ్యే తుది సీజన్ నియామకాల తరువాత అంతర్జాతీయ కంపెనీల సంఖ్య పెరుగుతుంది’అని ఐఐటీ హైదరాబాద్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎక్కువ ఆఫర్ చేసిన మైక్రోసాఫ్ట్, ఉబర్... ఈ ఏడాది ఐఐటీ విద్యార్థులకు పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఆఫర్ చేసిన అంతర్జాతీయ కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, ఉబర్, పేపాల్తోపాటు యాక్సెంచర్ జపాన్, డెస్కెరా, హనీవెల్ వంటివి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ 100 మందికిపైగా విద్యార్థులకు రూ. కోటి అంతకంటే ఎక్కువ ఆఫర్ చేయడం విశేషం. ఉబర్, పేపాల్ వంటి అమెరికన్ కంపెనీలు తక్కువ సంఖ్యలో విద్యార్థులను నియమించుకున్నప్పటికీ కనిష్టంగా రూ. 60 లక్షలు, గరిష్టంగా రూ. కోటి మేర వేతనాలను ఆఫర్ చేశాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ జరిగిన నియామకాల్లో ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్ విద్యార్థుల్లో 60 శాతం మందికి అంతర్జాతీయ కంపెనీలు ఆఫర్లు ఇచ్చాయి. అంతర్జాతీయ కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు పొందిన వారికి అమెరికా, సింగపూర్, జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనే ఉద్యోగాలు దక్కాయి. ఇలా ఉద్యోగాలు పొందిన వారికి సంబంధిత కంపెనీలే వర్క్ పర్మిట్ (ఆయా దేశాల్లో పని చేసేందుకు అనుమతి) తీసుకుంటాయి. ప్లేస్‌మెంట్స్‌లో హైదరాబాద్ ఐఐటీ రెండో స్థానం... ఐఐటీ ఖరగ్‌పూర్‌కు ఈసారి అంతర్జాతీయ సంస్థలు వెల్లువెత్తాయి. ఈ విద్యా సంవత్సరం బీటెక్ పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులను నియమించుకునేందుకు 51 కంపెనీలు నియామక ప్రక్రియను పూర్తి చేశాయి. ఐఐటీ బాంబేలో తుది దశ నియామకాల ప్రక్రియ పూర్తయితేగానీ ఈ ఏడాది అంతర్జాతీయ కంపెనీలు ఏ ఐఐటీని ఎక్కువగా సందర్శించాయన్న వివరాలు లభ్యం కావు. అయితే ఇప్పటివరకూ పూర్తయిన నియామక ప్రక్రియను పరిశీలిస్తే ఖరగ్‌పూర్ తరువాత ఆ స్థానం హైదరాబాద్‌కు దక్కుతుంది. హైదరాబాద్ ఐఐటీని సందర్శించిన అంతర్జాతీయ కంపెనీల సంఖ్య 38. ప్లేస్మెంట్లలో ఐఐటీ హైదరాబాద్ ఈసారి పాత ఐఐటీలు ఎన్నింటినో అధిగమించి రికార్డు దిశగా దూసుకుపోతోంది. ఢిల్లీ, బాంబే ఐఐటీలలో నియామకాల ప్రక్రియ ఇటీవలే మొదలైందని, జనవరి ఆఖరుతో పూర్తవుతుందని, ఆ తరువాత ఐఐటీలవారీగా నియామకాలు చేపట్టిన జాతీయ, అంతర్జాతీయ కంపెనీల వివరాలు వెల్లడిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘అంతర్జాతీయ పత్రికలు విద్యాసంస్థల రేటింగ్‌లో ఐఐటీలను తక్కువ చేసి చూపుతున్నా వాటిలో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న విద్యార్థులే రేటింగ్‌లకు చక్కని ఉదాహరణ అని ఆ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ప్లేస్మెంట్లు ఆఫర్ చేసిన అంతర్జాతీయ కంపెనీల్లో కొన్ని... మైక్రోసాఫ్ట్ ఉబర్ పేపాల్ యాక్సెంచర్ జపాన్ డెస్కెరా హనీవెల్ – మైక్రోసాఫ్ట్ 100 మందికిపైగా విద్యార్థులకు రూ. కోటి అంతకంటే ఎక్కువ ఆఫర్ చేసింది. – ఉబర్, పేపాల్ తక్కువ మందిని నియమించుకున్నా రూ. 60 లక్షలు–రూ. కోటి వరకు ఆఫర్ చేశాయి. -
ప్రఖ్యాత సంస్థలన్నీ రాష్ట్రానికి క్యూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానంతో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అనేక సంస్థలు పెట్టుబడులతో రాష్ట్రానికి తరలివచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఐదేళ్లలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్‌టియన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం కేటీఆర్‌తో భేటీ అయింది. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని కేటీఆర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, సింగపూర్ నడుమ మరింత బలమైన వ్యాపార, వాణిజ్య సంబంధాలు నెలకొల్పేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక విదేశీ కంపెనీలు ముందుకొస్తున్నాయని సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్‌టియన్‌కు కేటీఆర్ వివరించారు. పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని, స్థానికంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించేం దుకు సింగపూర్ కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కోరారు. ఐటీ, పరిశ్రమల మంత్రితో జరిగిన భేటీ ద్వారా తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలపై మరింత స్పష్టత వచ్చిందని సింగపూర్ కాన్సుల్ జనరల్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనువైన వాతావరణంపై తమ దేశంలోని పారిశ్రామికవర్గాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తామని హామీనిచ్చారు. -
పెట్టుబడుల ప్రవాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి మూడు ప్రతిష్టాత్మక విదేశీ కంపెనీలు ముందుకొచ్చాయి. జపాన్‌కు చెందిన ఏటీజీ సంస్థ టైర్ల తయారీ కంపెనీ, చైనాకు చెందిన వింగ్‌టెక్ సంస్థ మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్, హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ సంస్థ భారీ స్థాయిలో పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ మూడు కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు.. తద్వారా ప్రత్యక్షంగా 22,000 మందికి ఉపాధి కల్పించడానికి ఉద్దేశించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాయి. వీటిని పరిశీలించిన పరిశ్రమల శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడులకు ముఖ్యమంత్రి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపిన వెంటనే ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు(ఎంఓయూ) చేసుకోవడానికి ఆయా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఎస్ఐపీబీ పునర్వ్యవస్థీకరణ గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రితో పాటు మొత్తం 11 మంది సభ్యులతో ఎస్ఐపీబీని ఏర్పాటు చేశారు. ఆ బోర్డును పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిమిత సభ్యులతో కొత్త ఎస్ఐపీబీని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. వారం రోజుల్లో కొత్త బోర్డు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. మూడు ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపితే, ఎంఓయూ కుదుర్చుకొని, ఆయా సంస్థలకు భూ కేటాయిపులు చేయడానికి రంగం సిద్ధమైంది. ఏటీజీ టైర్ల కంపెనీకి 80 ఎకరాలు.. భారీ వాహనాలు, గనుల తవ్వకంలో ఉపయోగించే యంత్రాలకు అవసరమైన టైర్ల తయారీలో పేరొందిన జపాన్‌కు చెందిన అయన్స్ టైర్ గ్రూపు(ఏటీజీ) విశాఖపట్నం సమీపంలో యూనిట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. రూ.1,600 కోట్ల పెట్టుబడితో ఎగుమతి ఆధారిత టైర్ల యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. విశాఖపట్నంలో పోర్టులు ఉండటంతో వ్యూహత్మకంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. యూనిట్ ఏర్పాటుకు 110 ఎకరాలు కావాలని ఏటీజీ కంపెనీ కోరగా, డీపీఆర్‌ను పరిశీలించిన తర్వాత దాదాపు 80 ఎకరాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికే గుజరాత్, తమిళనాడులో ఏటీజీ యూనిట్లు ఉన్నాయి. విశాఖపట్నం యూనిట్ దేశంలో మూడో యూనిట్ కానుంది. విశాఖపట్నంలో ఏర్పాటు చేసే కొత్త యూనిట్లో దాదాపు 2,000 మందికి ప్రత్యక్షంగా, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. రేణిగుంట ఈఎంసీలో వింగ్‌టెక్ యూనిట్ చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ వింగ్‌టెక్ ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ యూనిట్ ద్వారా నేరుగా 10,000 మందికి ఉపాధి లభించడంతో పాటు మరో 5,000 మందికి సప్లైచైన్ విభాగంలో పరోక్ష ఉపాధి లభించనుంది. చిత్తూరు జిల్లా రేణిగుంటలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)–2లో వింగ్‌టెక్ యూనిట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఏడాదికి 40 లక్షల మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. రేణిగుంటలో ఈఎంసీలకు నీటి కొరతను తీర్చడానికి ఏపీఐఐసీ రూ.20 కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నెలకొల్పనుంది. తిరుపతి మున్సిపాలిటీ నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసి, ఈఎంసీలకు పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. శాశ్వత ప్రాతిపదికన కండలేరు రిజర్వాయర్ నుంచి రూ.200 కోట్లతో పైపులైన్ ద్వారా నీటి సరఫరా చేయడానికి పరిశ్రమల శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. నీటి కొరత తీరితే ఈఎంసీల్లో పెట్టుబడులు పెట్టడానికి మరిన్ని సంస్థలు ముందుకొస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు దశల్లో పాదరక్షల తయారీ యూనిట్ హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ సంస్థ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో భారీ పాదరక్షల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి ముందుకొచ్చింది. దాదాపు రూ.750 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. అడిడాస్ వంటి ప్రముఖ బ్రాండ్ పాదరక్షలను ఈ సంస్థ తయారీ చేస్తోంది. శ్రీకాళహస్తి సమీపంలో రెండు దశల్లో ఏర్పాటు చేసే యూనిట్ ద్వారా 10,000 మందికి నేరుగా ఉపాధి లభించనుంది. ఇందులో అత్యధికంగా మహిళలకే ఉపాధి కల్పించనున్నారు. 298 ఎకరాలు కేటాయించడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇంటెలిజెంట్ సంస్థ ఇప్పటికే నెల్లూరు జిల్లా తడ వద్ద యూనిట్ ఏర్పాటు చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2006లో మొదలైన ఈ యూనిట్ ఇప్పుడు ప్రతినెలా 12 లక్షల జతల పాదరక్షలను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటివరకు రూ.700 కోట్ల పెట్టుబడి పెట్టి, 11,000 మందికి ఉద్యోగాలు కల్పించడం గమనార్హం. -
ఇన్వెస్టెర్రర్ 2.0
విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను విషయంలో ఊరట లభించగలదన్న అంచనాలు ఆవిరవ్వడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 38,500 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,500 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. అంతంతమాత్రంగానే ఉన్న కంపెనీల ఆర్థిక ఫలితాలు, వినియోగం మందగించడం, నైరుతి రుతు పవనాల విస్తరణ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. వరుసగా మూడు రోజుల పాటు నష్టపోతూ వచ్చిన డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకున్నా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోత విషయమై సానుకూల సంకేతాలివ్వడంతో ప్రపంచ మార్కెట్లు పెరిగినా, మన మార్కెట్ పతన బాటలోనే పయనించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 560 పాయింట్లు పతనమై 38,337 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 178 పాయింట్లు నష్టపోయి 11,419 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఏడాది సెన్సెక్స్, నిఫ్టీలకు ఇవే రెండో అత్యధిక రోజువారీ నష్టాలు. ఈ రెండు సూచీలు రెండు నెలల కనిష్టానికి పడిపోయాయి. బడ్జెట్ రోజు సెన్సెక్స్ ఈ ఏడాదిలో అత్యధికంగా 793 పాయింట్లు నష్టపోయింది. విద్యుత్తు, కన్సూమర్ డ్యూరబుల్స్ సూచీలు మినహా మిగిలిన అన్ని బీఎస్ఈ రంగాల సూచీలు క్షీణించాయి. వాహన, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 399 పాయింట్లు, నిఫ్టీ 133 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. లాభాల్లో ఆరంభమైనా... ఈ నెలాఖరులో జరిగే సమావేశంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంచనాలను మించి రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని ఫెడరల్ రిజర్వ్ కీలక అధికారి ఒకరు వ్యాఖ్యానించడంతో ఆసియా మార్కెట్లు జోరుగా పెరిగాయి. ఈ దన్నుతో మన మార్కెట్ కూడా మంచి లాభాలతో ఆరంభమైంది. అయితే ఆ తర్వాత వెంటనే సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారిపోయాయి. ఒక దశలో 161 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, మరో దశలో 626 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 787 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 43 పాయింట్లు పెరిగి, ఆ తర్వాత 198 పాయింట్లు పతనమైంది. ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం 5 పైసలు లాభపడి 68.92 వద్ద ముగిసింది. ఇక ముడిచమురు ధరలు 1.7 శాతం ఎగిశాయి. మరిన్ని విశేషాలు.... ► మొత్తం 31 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు–ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, టీసీఎస్, ఓఎన్జీసీలు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► 500కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మారుతీ సుజుకీ, యస్ బ్యాంక్, గెయిల్ ఇండియా, మహీంద్రా, ఐషర్ మోటార్స్, అరబిందో ఫార్మా, ఫోర్స్ మోటార్స్, వొడాఫోన్ ఐడియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయినా, హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ షేర్ ఆల్‌టైమ్ హై, 2,370ను తాకింది. చివరకు 7%(రూ.147)లాభంతో రూ.2,317 వద్ద ముగిసింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో గత నాలుగు రోజుల్లో ఈ షేర్ 20 శాతానికి పైగా ఎగసింది. పతనానికి కారణాలు ► పన్ను విషయమై తగ్గేది లేదు... సంపన్నులపై విధించిన పన్ను(విదేశీ ఇన్వెస్టర్లకు ఈ పన్ను వర్తిస్తుంది) కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తరలిపోతాయనే వాదనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపడేశారు. గురువారం ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె ఈ పన్ను విషయమై పునరాలోచన లేదని తెగేసి చెప్పారు. ఎఫ్‌పీఐలు కంపెనీగా వ్యవహరిస్తే, ఈ పన్ను పోటు ఉండదని ఆమె పేర్కొన్నారు. ఎఫ్‌పీఐలకు పన్ను విషయంలో ఊరట లభించకపోవడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ► అమ్మకాల్లో తగ్గని ఎఫ్‌పీఐలు ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం, పన్ను పోటు కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. శుక్రవారంతో కలుపుకొని వరుసగా 14వ రోజూ నికర అమ్మకాలు జరిపారు. ఒక్క గురువారం రోజే రూ.1,405 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ నికర కొనుగోళ్లు జరిపిన ఎఫ్‌పీఐలు ఈ నెలలో ఇప్పటిదాకా రూ.7,000 కోట్ల మేర విక్రయాలు జరిపారు. ► జోష్‌నివ్వని ఆర్థిక ఫలితాలు... ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీల ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లలో జోష్ని నింపలేకపోయాయి. ఒక్క ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్ మినహా ఇతర కంపెనీల ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. యస్‌బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, మైండ్‌ట్రీ, విప్రో, డీసీబీ బ్యాంక్ ఫలితాలు నిరాశపరిచాయి. ఫలితాలు ఓ మోస్తరుగా ఉంటాయన్న అంచనాలను కూడా కొన్ని కంపెనీలు అందుకోలేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. ► వర్షాలు.. అంతంతే.... ఈసారి నైరుతి రుతుపవనాలు నిరాశపరిచాయి. సాధారణ వర్షపాతం కంటే 16 శాతం తక్కువగా వర్షాలు కురవడంతో వర్షాధార వ్యవసాయ దేశమైన మన దేశంలో ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండగలవన్న ఆందోళన నెలకొన్నది. ► జీడీపీ అంచనాలు తగ్గించిన ఏడీబీ భారత దేశ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపించింది. 2 రోజుల్లో రూ. 3.79 లక్షల కోట్లు ఆవిరి గత రెండు రోజుల నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.3.79 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్డైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ విలువ రూ.3.79 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.145.35 లక్షల కోట్లకు పడిపోయింది. శుభవార్తల కోసం మన స్టాక్ మార్కెట్ మొహం వాచిపోయి ఉంది. కంపెనీల డిఫాల్ట్‌లు కొనసాగుతుండటం, పన్నులు అధికంగా ఉండటం, కంపెనీల ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉండటం, ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉండటం.. ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. – జగన్నాథమ్ తునుగుంట్ల, సెంట్రమ్ బ్రోకింగ్ అనలిస్ట్ -
రూ.30 వేల కోట్లతో ఉక్కు ఫ్యాక్టరీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ కంపెనీలు ముందుకొస్తున్నాయి. అంతర్జాతీయంగా పేరుపొందిన కొరియాకు చెందిన పోస్కో స్టీల్ కంపెనీ, జపాన్‌కు చెందిన ఏటీజీ టైర్ల కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. సుమారు రూ.30,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఐఎన్ఎల్ (విశాఖ స్టీల్)తో కలిపి ఏర్పాటు చేయడానికి పోస్కో ఆసక్తి చూపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం ఆయన నివాసంలో కలిసిన పోస్కో కంపెనీ ప్రతినిధులు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను తెలియచేశారు. పోస్కో ఇండియా చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గిల్హో బాంగ్, పోస్కో మహారాష్ట్ర సీఎఫ్‌వో గూ యంగ్ అన్లతో పాటు పోస్కో సీనియర్ ప్రతినిధులు సీఎంను కలసిన వారిలో ఉన్నారు. ఇప్పటికే విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉన్నందున వైఎస్సార్ జిల్లాలో కర్మాగారం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని కోరారు. దీనికి అంగీకరించిన పోస్కో ప్రతినిధులు కడపలో కర్మాగారం ఏర్పాటు సాధాసాధ్యాలపై మూడు నెలల్లో నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా సుమారు 6,000 మందికి ఉపాధి లభించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వివరించారు. సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ, పరిశ్రమల శాఖ కమిషనర్ సిదార్థ జైన్ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో ఏటీజీ టైర్ల కంపెనీ! విశాఖ జిల్లా అచ్యుతాపురం సమీపంలో సుమారు రూ.1,600 కోట్లతో భారీ టైర్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు జపాన్‌కు చెందిన అలయన్స్ టైర్ గ్రూపు (ఏటీజీ) ఆసక్తి కనపరుస్తోంది. సుమారు 100–125 ఎకరాల్లో అచ్యుతాపురం సెజ్‌లో దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందచేసింది. వ్యవసాయ, నిర్మాణ రంగ యంత్రాలకు వినియోగించే భారీ టైర్లను ఏటీజీ తయారు చేస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఒక యూనిట్ ఉండగా విశాఖ వద్ద మరో యూనిట్ ఏర్పాటు చేయడానికి కంపెనీ ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనలు పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. టీసీఎల్ సమస్యలను తక్షణం పరిష్కరించాలి: సీఎం చిత్తూరు జిల్లాలో టీవీ ప్యానల్ యూనిట్ ఏర్పాటు చేసిన చైనాకు చెందిన ఎలక్ట్రానికి సంస్థ టీసీఎల్ కంపెనీ ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. సుమారు రూ.2,200 కోట్లతో 153 ఎకరాల్లో డిస్ప్లే ప్యానల్ యూనిట్‌కు గత డిసెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అయితే భూమి, నీటి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయినట్లు టీసీఎల్ ఇండస్ట్రియల్ హోల్డింగ్స్ సీఈవో కెవిన్ వాంగ్, టీటీఈ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ అలెన్ చెన్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సూపర్ ప్రోయాక్టివ్ క్లియరెన్స్ కింద అన్ని ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేయాలని, టీసీఎల్ సమస్యలను పరిష్కరించి త్వరగా పనులు మొదలయ్యేలా చూడాలని పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ శాఖల అధికారులను ఆదేశించారు. కంపెనీలకు అనుమతుల మంజూరులో అవినీతికి తావు ఉండకూడదని, ఉద్దేశపూర్వకంగా అనుమతులు ఆపినట్లు తెలిస్తే ఎంత స్థాయి రాజకీయ నాయకుడైనా, అధికారి అయినా క్షమించే ప్రశ్నే లేదని సీఎం స్పష్టం చేశారు. ఎంత మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి? రాష్ట్రానికి ఆర్థికంగా ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందనే అంశాల ఆధారంగా ఆయా కంపెనీలకు రాయితీలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. -
ఈ–కామర్స్ నిబంధనలు సరైనవే
ముంబై: విదేశీ పెట్టుబడులున్న ఈ– కామర్స్ కంపెనీలకు సంబంధించి కేంద్రం కొత్తగా ప్రకటించిన నిబంధనలు సరైనవేనని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. ఈ–కామర్స్ సంస్థలు కారు చౌక రేట్లతో.. స్థానిక వ్యాపార సంస్థలను నాశనం చేస్తున్నాయన్నారు. భారత్‌లో అంతర్జాతీయ సంస్థలు గుత్తాధిపత్యం చలాయిస్తే చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదని టైకాన్ 2019 స్టార్టప్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ–కామర్స్ నిబంధనలను ప్రకటించిన తీరు అభ్యంతరకరంగా ఉన్నా, ఈ నిబంధనలు కొంత సముచితమైనవేనన్నారు. మరోవైపు, ఇందులో వ్యాపారాలకు ప్రోత్సాహాన్నిచ్చే కోణం కన్నా ఓటు బ్యాంక్ రాజకీయాల కోణమే ఎక్కువగా కనిపిస్తోందని సదస్సులో పాల్గొన్న స్టార్టప్ సంస్థల లాయర్ కరణ్ కల్రా వ్యాఖ్యానించారు. ఒక ప్రత్యేక వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ నిబంధనలు ప్రవేశపెట్టినట్లుగా అనిపిస్తోందని సీనియర్ లాయర్ నిశిత్ దేశాయ్ అభిప్రాయపడ్డారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులున్న ఈ–కామర్స్ కంపెనీలు.. తమ అనుబంధ సంస్థల ఉత్పత్తులను సొంత ప్లాట్‌ఫాంపై విక్రయించరాదని, ధరలను ప్రభావితం చేసేలా ప్రత్యేక మార్కెటింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి చేయరాదని కేంద్రం ఎఫ్‌డీఐ నిబంధనలు కఠినతరం చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. అంతకు ముందు అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫాంపై 4 లక్షల పైచిలుకు చిన్న స్థాయి విక్రేతలు ఉండేవారు. తాజా నిబంధనలతో అమెజాన్‌కి చెందిన క్లౌడ్‌టెయిల్, అపారియో సంస్థల కార్యకలాపాలు నిల్చిపోయాయి. ఆశావహంగా వాల్‌మార్ట్.. నిబంధనలు కఠినం చేసినప్పటికీ భారత మార్కెట్‌పై ఆశావహంగానే ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్ చేసిన అమెరికా దిగ్గజం వాల్‌మార్ట్ వెల్లడించింది. భారత మార్కెట్లో దీర్ఘకాలిక వ్యాపారానికి కట్టుబడి ఉన్నామని వాల్‌మార్ట్ ఏషియా రీజనల్ సీఈవో డర్క్ వాన్ డెన్ బెర్గీ తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఉపాధి కల్పన, చిన్న వ్యాపార సంస్థలు ..రైతులకు తోడ్పాటు ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధిలో భాగం అవ్వాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. -
కొరియా కోచ్‌లు.. ఫ్రాన్స్ పట్టాలు..
లూయిస్‌బెర్జర్ ఇంజినీరింగ్,ఆర్కిటెక్చర్ రంగంలో నగర మెట్రో ప్రాజెక్టుకు సహకారం అందించింది. విశ్వవ్యాప్తంగా 90 దేశాల్లో ఈ సంస్థ సేవలందిస్తోంది. ఏఈకామ్ సాంకేతిక,యాజమాన్య సేవలు అందిస్తోంది. పర్యావరణ,ఇంధనం,మంచినీరు,మౌలిక వసతుల విషయంలో మెట్రో ప్రాజెక్టుకు తగిన సలహాలు అందిస్తోంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ పన్నులు, సేవలు, సలహాలు అందిస్తోంది. నగర మెట్రో ప్రాజెక్టులో కాలుష్య ఉద్గారాలను తగ్గిస్తున్నందుకు వచ్చే కార్భన్ క్రెడిట్స్‌ను ఈ సంస్థ లెక్కగడుతుంది. హాల్క్రో ఈ సంస్థ మెట్రో ప్రాజెక్టు ప్రణాళిక, డిజైన్, నిర్వహణ అంశాల్లో సహాయ సహకారాలు అందించింది. విశ్వవ్యాప్తంగా 90 దేశాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. సాక్షి, సిటీబ్యూరో: కొరియా కోచ్‌లు..శ్యామ్‌సంగ్ హంగులు...ఫ్రాన్స్ పట్టాలు..నగర మెట్రో ప్రాజెక్టుకు ఇలా విదేశీ హంగులు అద్దడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. త్వరలో పట్టాలెక్కనున్న మెట్రో ప్రాజెక్టులో ప్రతీది విశేషమే. పలు విదేశాల నుంచి వచ్చిన వివిధ విడిభాగాలతో నగర మెట్రో ప్రాజెక్టు ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వంద మెట్రో ప్రాజెక్టులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరవాత మన మెట్రో ప్రాజెక్టుకు డిజైన్లు సిద్ధం చేసిన విషయం విదితమే. మెట్రో నిర్మాణంలో పాలుపంచుకున్న విదేశీ కంపెనీలు...మన మెట్రోకు అద్దిన విదేశీ సొబగులిలా ఉన్నాయి. కొరియా కోచ్‌లు: దక్షిణ కొరియాకు చెందిన హ్యూండాయ్ రోటెమ్ కంపెనీ మెట్రో రైళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దింది. ఒక్కో బోగీ ఖరీదు రూ.10 కోట్లు. మొత్తం 57 రైళ్లకు 171 భోగీలను రూ.1800 కోట్ల ఖర్చుతో స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం లోహ మిశ్రమాలతో తయారుచేశారు. ఫ్రాన్స్ పట్టాలు : ఆకాశమార్గం (ఎలివేటెడ్) పట్టాలను ఫ్రాన్స్‌కు చెందిన రైల్స్, టాటా స్టీల్(ప్రాన్స్) సంస్థ నగర మెట్రో ప్రాజెక్టుకు సరఫరా చేసింది. సముద్ర మార్గం గుండా మొదట ముంబైకు, అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా ఉప్పల్, మియాపూర్ డిపోకు చేర్చి ఆ తరవాత పట్టాలు పరిచారు. మొత్తం నగర మెట్రో ప్రాజెక్టుకు ఫ్రాన్స్ నుంచి 22,500 మెట్రిక్ టన్నుల పట్టాలను దిగుమతి చేసుకొని 171 కి.మీ మార్గంలో పట్టాలు పరచడం విశేషం. శ్యామ్‌సంగ్ డేటా సిస్టమ్స్: కొరియాకు చెందిన ఈ సంస్థ మెట్రో రైలు స్టేషన్లలో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్లను నిర్వహించనుంది. ఇందుకు అవసరమైన డిజైన్, విడిభాగాల తయారీ, సరఫరా, పరీక్షలను సైతం ఇదే సంస్థ నిర్వహించనుంది. పార్సన్స్ బ్రింకర్‌హాఫ్: అమెరికాలోని న్యూయార్క్‌కు చెందినదీ సంస్థ ..మౌలిక వసతుల కల్పన రంగంలోని భారీ ప్రాజెక్టులకు ఈ సంస్థ కన్సల్టెన్సీ సేవలు అందిస్తోంది. మెట్రో ప్రాజెక్టులో సంక్లిష్టంగా ఉన్న ప్రాంతాల్లో అద్భుత ఇంజినీరింగ్ డిజైన్లను ఈ సంస్థ రూపొందిస్తోంది. ఈ సంస్థ 1885 నుంచి ఈ రంగంలో నిమగ్నమైంది. ఐదు ఖండాలలో ఈ సంస్థ సేవలందిస్తోంది. కియోలిస్: ఫ్రాన్స్‌కు చెందిన ఈ సంస్థ ప్రజారవాణా రంగంలో విశేష అనుభవం గడించింది. 12 దేశాల్లోని పలు ప్రజారవాణా వ్యవస్థలను నిర్వహిస్తోంది. నగర మెట్రో ప్రాజెక్టు నిర్వహణలోనూ కీలక భాగస్వామిగా మారింది. రైళ్లు, స్టేషన్లు, డిపోలు, సిబ్బంది నియామకం నిర్వహణ విధులు ఈ సంస్థనే 15 ఏళ్లపాటు నిర్వహించనుంది. ఓటీఐఎస్: నగరంలోని ఎలివేటెడ్ మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసిన 260 లిఫ్టులను, 410 ఎస్కలేటర్లను ఈ సంస్థ సరఫరా చేసింది. చైనాకు చెందిన ఈ కంపెనీ నగర మెట్రో ప్రాజెక్టులో సుమారు రూ.400 కోట్ల కాంట్రాక్టు దక్కించుకుంది. ఆర్థిక సహకారం అందిస్తున్న బ్యాంకులు నగర మెట్రో ప్రాజెక్టుకు ఎల్అండ్టీ సంస్థ రూ.3500 కోట్లు ఖర్చు చేస్తోంది. మరో రూ.11,500 కోట్లను స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఆంధ్రబ్యాంక్, దేనాబ్యాంక్‌ల నుంచి రుణంగా సేకరిస్తోంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.1458 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లు ఖర్చు చేసింది. -
భారత్‌వైపు ప్రపంచ దేశాల చూపు
సాక్షి ప్రతినిధి, చెన్నై: భారతదేశంపై ప్రపంచ దేశాలకు నమ్మకం పెరిగిందని, పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఉత్సాహం చూపుతున్నాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. చెన్నైలో మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ 90వ వార్షికోత్సవంలో వెంకయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ప్రపంచ బ్యాంకు సైతం ‘ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్’ అని కితాబిచ్చిందన్నారు. దేశ పురోభివృద్ధికి అవసరమైన సంస్కరణలను కేంద్రం అమలు చేస్తోందని, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు అందులో భాగమేనన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌కు ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును వెంకయ్య ప్రదానం చేశారు. పారిశ్రామికవేత్త వనితా దాట్లను సన్మానించారు. సంగీత ప్రపంచానికి ఎంఎస్ సుబ్బులక్ష్మి సేవలు అజరామరంగా నిలిచిపోయాని వెంకయ్య కీర్తించారు. చెన్నైలో మంగళవారం జరిగిన ఎంఎస్ సుబ్బులక్ష్మి శతజయంతి వేడుకల్లో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. -
‘మేకిన్ ఇండియా’ విమానాలు కావలెను
- 200 వరకు కొనుగోలుకు భారత్ యత్నాలు - స్పందించిన అమెరికా, స్వీడన్ కంపెనీలు న్యూఢిల్లీ: స్థానిక భాగస్వామితో తమ దేశంలో తయారుచేస్తే 200 విదేశీ యుద్ధ విమానాల కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు భారత వాయుసేన ప్రకటించింది. వీటి విలువ 15 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని అంచనా. ఇది దేశ అతిపెద్ద రక్షణ ఒప్పందం కాగలదు. సోవియట్ కాలం నాటి విమానాలను పూర్తిగా అటకెక్కిస్తే భారత్‌కు 300 సింగిల్ ఇంజిన్ యుద్ధ విమానాలు అవసరమవుతాయి. ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ విమానాలను కొననున్న భారత్ ఇతర మార్గాల నుంచి మరిన్ని సమాకూర్చుకోవాలని సంకల్పించింది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలను దీటుగా ఎదుర్కోవాలంటే ఇకపై సేకరించే యుద్ధ విమానాలను స్వదేశంలో ఉత్పత్తి చేసి దిగుమతులకు కళ్లెం వేయడమే మార్గమని ఎన్డీఏ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియలో విదేశీ కంపెనీల నుంచి సాంకేతికత బదిలీ కీలకం. ఈ మేరకు ఇప్పటికే పలు విదేశీ కంపెనీలతో చర్చలు ప్రారంభించారు. సిద్ధమంటున్న విదేశీ కంపెనీలు: భారత్‌లో ఎఫ్-16 విమానాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని, భారత సైన్యం అవసరాలు తీర్చడమే కాకుండా వాటిని విదేశాలకూ ఎగుమతి చేస్తామని అమెరికా కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్ తెలిపింది. ప్రత్యేకంగా ఇలాంటి విమానాలనే తయారుచేస్తే భవిష్యత్తులో భారత్ వీటికి కేంద్రంగా మారగలదని భారత్‌కు తెలిపింది. స్వీడన్ కంపెనీ సాబ్ కూడా తన గ్రైపెన్ విమానాల తయారీకి భారత్‌లో యూనిట్ నిర్మిస్తామని ప్రకటించింది. నాలుగో తరం యుద్ధ విమానాలు కావాలని భారత్ కోరిందని సంస్థ చైర్మన్ వైడర్స్ట్రామ్ చెప్పారు. ముందస్తు షరతులు లేనందు వల్ల తమ యూనిట్లో కనీసం 100 విమానాలను తయారుచేయగలమన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో బోయింగ్ కూడా ఎఫ్ ఏ-18 హార్నెట్లను ఇవ్వడానికి అంగీకరించినా సాంకేతికత బదిలీపై ఎలాంటి హామీ లభించలేదు. సాంకేతికత లేమే లోపం: ‘రక్షణ రంగ సాంకేతికతపై భారత్‌కు పట్టులేకపోవడం పెద్ద సమస్యగా మారింది. అగ్ర దేశాల నుంచి పూర్తిగా లేదా గణనీయంగా సాంకేతికత బదిలీ జరిగితే భవిష్యత్తు అభివృద్ధికి పునాది పడుతుంది’ అని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ ఎం మాతేస్వరణ్ అభిప్రాయపడ్డారు. దశాబ్దాలుగా జరిగిన ఆలస్యాన్ని భర్తీ చేయడానికి భారత్ 200కు పైగానే విమానాలను తయారుచేసుకోవాలని సూచించారు. -
హోదాతో విదేశీ కంపెనీలు క్యూ కడతాయి
-
దండ దండగ యాత్రా?
భారత కంపెనీలకు కలసిరాని విదేశీ టేకోవర్లు టాటా స్టీల్ నుంచి రిలయన్స్ దాకా ఇదే తీరు కలిసొచ్చిన కాస్త కంపెనీలక్కూడా బ్రెగ్జిట్ దెబ్బ టాటా మోటార్స్, మదర్సన్ సుమీ... అన్నిటిదీ ఇదే తీరు యూరప్‌లో ఎక్కువ వ్యాపారం ఉండటమే కారణం ఇవి రాజులు... రాజ్యాల కథలు కావు. కంపెనీలు... దేశాల కథలు. మన కంపెనీలకు కాలం కలిసొచ్చి... విదేశీ కంపెనీల్ని కొన్నాయి. కలిపేసుకున్నాయి. కాకపోతే కాలం తిరగబడింది. కొన్న కంపెనీల నుంచి ఆదాయం లేక... మరింత పెట్టుబడి పెట్టలేక... అమ్మకానికి పెట్టాయి. కొన్న ధరకన్నా తక్కువకే అమ్మేస్తున్నాయి. టాటామోటార్స్, మదర్సన్ సుమీ వంటి కంపెనీల పరిస్థితి మాత్రం వేరు. వాటికి కొనుగోళ్లు కలిసొచ్చాయి. అంతర్జాతీయ దిగ్గజాలుగా ఎదిగాయి. కానీ యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లిపోతుండటం ఈ కాస్త విజయాల్ని కూడా కమ్మేసే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే వీటి వ్యాపారాలు... లాభాలు అత్యధికం యూరప్ నుంచే వస్తున్నాయి. బ్రిటన్ ఈయూ నుంచి బయటకు వె ళితే... ఆయా కంపెనీలు బ్రిటన్‌తో పాటు ఈయూలోనూ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. అనుమతులు క్లిష్టమవుతాయి. ఖర్చులు పెరిగి... ఆ ప్రభావం అమ్మకాలు, లాభాలపై పడుతుంది. దీంతో కలిసొచ్చిన దండయాత్రలు కూడా దండగయాత్రలుగా మారే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఏ కంపెనీ టేకోవర్ ఎలా మారిందనే విశ్లేషణే... ఈ వారం ‘ఫోకస్’ -సాక్షి, బిజినెస్ విభాగం 1 టాటా స్టీల్-కోరస్ ఫార్చ్యూన్-500 నుంచి రూ.20వేల కోట్ల నష్టాల్లోకి 2007లో ఆంగ్లో-డచ్ ఉక్కు దిగ్గజం కోరస్‌ను టాటా స్టీల్ సంస్థ కొనుగోలు చేసింది. అలా... టాటా గ్రూప్ బిటన్ ఉక్కు రంగంలోకి అడుగుపెట్టింది. నిజానికప్పుడు అదో సంచలనం. బ్రిటిష్ సంస్థను టాటాలు కొనుగోలు చేయటంతో దేశంలో భావోద్వేగ పూరిత శుభాభినందనలు కూడా వెల్లువెత్తాయి. దీనికోసం టాటా స్టీల్ నెలల తరబడి బ్రెజిల్‌కు చెందిన సీఎస్ఎన్ సంస్థతో హోరాహోరీగా పోటీ పడింది. 14 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించింది. చివరికి... సీఎస్ఎన్ కన్నా కేవలం 5 పెన్స్లకన్నా తక్కువకు బిడ్ వేయగలిగింది. అంటే మన కరెన్సీలో కేవలం ఐదు రూపాయలు. అలా కోరస్‌ను టేకోవర్ చేసింది. 25 మిలియన్ టన్నుల వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్ధ్యంతో ప్రపంచంలోనే 5వ అతి పెద్ద స్టీల్ తయారీ సంస్థగా ఆవిర్భవించింది. ఫార్చ్యూన్ 500 బహుళ జాతి సంస్థల జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ సంస్థగా నిలిచింది. కానీ ఈ 5 పెన్స్‌ల విజయమిచ్చిన సంతోషం ఎంతోకాలం నిలవలేదు. 2007లో టన్నుకు 550-575 డాలర్లున్న ఉక్కు రేటు (హాట్ రోల్డ్ కాయిల్స్) 2016లో 380 డాలర్లకు పడిపోయింది. కోరస్ కొనుగోలు కోసం సమీకరించిన భారీ రుణాలు ఒకవైపు.. కంపెనీ నష్టాలు మరోవైపు టాటా స్టీల్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. కోరస్‌ను కొన్నాక అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో పరిస్థితులు దిగజారాయి. డిమాండ్ క్షీణించి, ధర పడిపోవటంతో గత ఐదేళ్లలో టాటా గ్రూప్ 2 బిలియన్ పౌండ్లు (దాదాపు రూ.20వేల కోట్లు) నష్టపోయింది. మరిన్ని పెట్టుబడులు పెట్టలేక... అమ్మేయాలని నిర్ణయించుకుంది. డిమాండ్ లేక కొనుగోలుదారులూ పెద్దగా ముందుకు రాలేదు. చివరకు లాంగ్ స్టీల్ వ్యాపారాన్ని, సంబంధిత ప్లాంటును మాత్రం విక్రయించగలిగింది. మిగిలిన వ్యాపారాన్ని తానే నిర్వహించాలని చూస్తున్నా... తాజా బ్రెగ్జిట్ దెబ్బ మరింత కుంగదీసే ప్రమాదం కనిపిస్తోంది. బ్రిటిష్ కంపెనీ కోరస్‌ను టాటా స్టీల్ టేకోవర్ చేయటం ఓ సంచలనం. హోరాహోరీ పోరులో కేవలం 5 పెన్స్‌ల తేడాతో దీన్ని చేజిక్కించుకుంది. కానీ భారీ నష్టాలతో యూకే ఆస్తుల్నిపుడు విక్రయిస్తోంది. 2 మిట్టల్ స్టీల్ - ఆర్సెలర్ నెంబర్-1 మిట్టల్.. అమ్మకాల పరంపర భారతదేశం నుంచి వలస వెళ్లి బ్రిటన్‌లో ఉక్కు వ్యాపారిగా ఎదగటమే లక్ష్మీ నివాస్ మిట్టల్ సాధించిన తొలి విజయం. నెదర్లాండ్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మిట్టల్ స్టీల్స్... 2006లో లగ్జెంబర్గ్‌కు చెందిన ఆర్సెలర్ స్టీల్‌ను ఏకంగా 32 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దాంతో ప్రపంచంలోనే నెంబర్-1 ఉక్కు కంపెనీగా నిలిచింది. మరి ఈ సమాచారం ఇండియాను ఎంత సంబరపరచిందో ఊహించటం కష్టమా!. కాకపోతే 2008 నుంచి మొదలైన మంద గమన ప్రభావం ఆర్సెలర్ మిట్టల్‌పై ఎక్కువే పడింది. ఉక్కుకు డిమాండ్ పడిపోయింది. దీంతో సంస్థకున్న 25 బ్లాస్ట్ ఫర్నేస్‌లలో తొమ్మిదింట ఉత్పత్తిని నిలిపేసింది. ఫ్రాన్స్‌లో రెండు ఫర్నేస్‌లను మూసేసింది. అదే ఏడాది తన యూరోపియన్ వ్యాపారం తాలూకు మొత్తం విలువను ఏకంగా 4.3 బిలియన్ డాలర్ల మేర తగ్గించి చూపించింది. రెండేళ్ల కిందట గ్రూప్‌లోని ఒక కంపెనీలో వాటాల్ని 770 మిలియన్ డాలర్లకు అమ్మేసింది. రెండునెలల కిందట మార్చిలో సెంట్రల్ ట్రినిడాడ్ ప్లాంటును మూసి వేయటంతో పాటు... అమెరికాలోని రెండు ప్లాంట్లను అమ్మేయాలని కూడా నిర్ణయించింది. ఈ కథలు వేరు. భారీగా వెచ్చించి... టేకోవర్ చేసినా... తరవాత దాన్నుంచి లాభాలు రాబట్టలేక వెనక్కి తిరిగిన కథలు కావివి. విదేశీ కంపెనీని కొనుగోలు చేయటమే కాక... అందరి అంచనాలనూ తల్ల కిందులు చేస్తూ దాని రాతను మార్చేసిన భారతీయ కంపెనీల కథలివి. అయితే చరిత్రను తిరగరాసిన ఈ కంపెనీల్లో కొన్ని తాజా బ్రెగ్జిట్ దెబ్బకు తల్లకిందులయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే వాటి విజయమే కాక... కార్యకలాపాలు కూడా యూరప్మీదే ఆధారపడ్డాయి మరి. ఎస్సార్ గ్లోబల్ - స్టాన్‌లో రిఫైనరీ రిఫైనరీ జాతకం మారింది... ఎస్సార్ గ్లోబల్‌లో ఎస్సార్ ఆయిల్ యూకే... 2011లో బ్రిటన్‌కు చెందిన స్టాన్‌లో రిఫైనరీని కొనుగోలు చేసింది. అప్పటిదాకా ఆ రిఫైనరీ షెల్ కంపెనీ యాజమాన్యంలో ఉండేది. ఇందుకోసం ఎస్సార్ సంస్థ 350 మిలియన్ డాలర్లు వెచ్చించింది. ఎస్సార్ ఆయిల్ ఇప్పటిదాకా ఆ రిఫైనరీపై దాదాపు 1.2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. అప్పట్లో దుర్భరమైన స్థితిలో ఉన్న పాత ప్లాంటు... ప్రస్తుతం బ్రిటన్‌లోని వ్యూహాత్మక రిఫైనరీల్లో ఒకటిగా ఎదిగింది. దేశంలో రవాణాకు ఉపయోగించే ఇంధనాల్లో 16% వాటాను ఇదే సరఫరా చేస్తోంది. (4.4 బిలియన్ లీటర్ల డీజిలు, 3 బిలియన్ లీటర్ల పెట్రోలు, 2 బిలియన్ లీటర్ల విమాన ఇంధనం). 3 హావెల్స్- సిల్వేనియా అద్భుతంగా ఎదిగినా... విదేశీ డీల్ ముంచింది... హావెల్స్. రాజస్థాన్ కేంద్రంగా విదేశాలకు సైతం విస్తరించిన దేశీ దిగ్గజం. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన హావెల్స్ ఇండియా... 2007లో తనకన్నా ఒకటిన్నర రెట్లు పెద్దదైన యూరోపియన్ కంపెనీ సిల్వేనియాను 300 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. కాకపోతే ఆ డీల్ సంస్థకు ప్రాణాంతకమైంది. 2000లో రూ.100 కోట్ల నుంచి 2006లో రూ.1,600 కోట్ల స్థాయికి ఎగిసిన హావెల్స్... అప్పట్లో 60-70 మిలియన్ డాలర్ల విలువైన విదేశీ కంపెనీలను కొందామని పలు ప్రయత్నాలు చేసింది. అయినా కుదరలేదు. అదే సమయంలో దానికి ఐదారు రెట్ల విలువైన సిల్వేనియా ఆఫర్ వచ్చింది. దీంతో 300 మిలియన్ డాలర్లు వెచ్చించడానికి కూడా సై అంటూ ముందడుగు వేసేసింది. అప్పటి కరెన్సీ మారక విలువ ప్రకారం దాదాపు రూ. 2,000 కోట్లు వెచ్చించిన హావెల్స్, ఆ తర్వాత దాదాపు మరో రూ.1,000 కోట్లు కుమ్మరించింది. కానీ కంపెనీ అమ్మకాలు, ఆర్థిక పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఇటీవలే 80 శాతం వాటాలను షాంఘై ఫెయిలో అకౌస్టిక్స్‌కు రూ. 1,340 కోట్లకు అమ్మేసింది. 4 శ్రీ రేణుకా షుగర్స్- డూబ్రెసిల్ కర్ణాటకలో హవా... బ్రెజిల్ దివాలా శ్రీరేణుకా షుగర్స్ అంటేనే సంచలనం. కర్ణాటకలో రైతులందరినీ ఒక్కటి చేసి... వారికి వాటాలిచ్చి మరీ ఆరంభించిన ఈ సంస్థ అతి త్వరగా అంతర్జాతీయ కీర్తిని సంపాదించింది. చక్కెర తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల జాబితాలో ఉన్న ఈ సంస్థ... 2010లో రూ.1,312 కోట్లతో బ్రెజిల్‌కు చెందిన రేణుక డూ బ్రెసిల్‌ను కొనుగోలు చేసింది. ఒక భారతీయ చక్కెర కంపెనీ... విదేశీ సంస్థను కొనుగోలు చేయడం అదే ప్రథమం. కానీ, సరిగ్గా ఏడాది తర్వాత 2011లో ఒకసారి, ఆపైన 2014లో మరోసారి బ్రెజిల్లో ఏర్పడ్డ కరవు పరిస్థితులు కంపెనీని దెబ్బతీశాయి. బ్రెజిల్ ఆర్థిక పరిస్థితులు దిగజారడం, చక్కెర ధరలు పడిపోవడం దీనికి తోడయ్యింది. ఈ పరిణామాలతో రేణుకా బ్రెసిల్ దివాలా పిటిషన్ వేయాల్సి వచ్చింది. 5 ఎయిర్టెల్- జయిన్ రీఛార్జ్ చేయించలేక.. ఎయిర్టెల్ ఆఫ్రికా కాల్ కట్ దేశీ టెలికం రంగంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఎయిర్టెల్ సంస్థ... విదేశాల్లో విస్తరణకు అప్పట్లో రకరకాల ప్రయత్నాలు చేసింది. ఆఫ్రికన్ టెలికం సంస్థ ఎంటీఎన్‌ను కొనేందుకు ప్రయత్నించినా కుదరలేదు. తరవాత కువైట్ టెలికం కంపెనీ ‘జయిన్’ రూపంలో అవకాశం వచ్చింది. ఆఫ్రికాలోని 17 దేశాల్లో తమ టెలికం వ్యాపారాన్ని విక్రయిస్తామని ఆ సంస్థ ముందుకొచ్చింది. అవకాశం కోసం చూస్తున్న ఎయిర్టెల్... 2010లో ఏకంగా 10.7 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 73,211 కోట్లు) కొనేసింది. కొంత కసరత్తుతో భారీ లాభాలొస్తాయనుకున్న ఎయిర్‌టెల్‌కు మెల్లగా పరిస్థితి అర్థమయింది. ఒకవైపు లాభాలు లేవు. మరోవంక ఆఫ్రికాలో పాతుకుపోయిన ఎంటీఎన్‌ను అందుకోవడం తేలిక కాదని తెలిసింది. 2012 నుంచీ తమ నెట్‌వర్క్‌లు, ఐటీ కార్యకలాపాలను అవుట్సోర్సింగ్కు ఇచ్చి ఆర్థిక భారాన్ని తగ్గించుకుంది. 2015 డిసెంబర్ క్వార్టర్లో ఆఫ్రికా యూనిట్ 74 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.506 కోట్లు) నష్టాన్ని ప్రకటించింది. తట్టుకోలేక 2016 జనవరిలో సియెరా లియోన్, బుర్కినా ఫాసో దేశాల్లో వ్యాపార కార్యకలాపాల్ని ఫ్రాన్స్‌కి చెందిన టె లికం సంస్థ ఆరెంజ్‌కు ఎయిర్టెల్ విక్రయించింది. 2015 అక్టోబర్‌లో ఆఫ్రికాలోని 8,300 మొబైల్ టవర్లను 1.7 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 11,000 కోట్లు) అమ్మేసింది. తాగాగా మిగిలిన 3,700 టవర్లను కూడా విక్రయించడానికి ఒప్పందం చేసుకుని... టవర్ల వ్యాపారం నుంచి బయటపడింది. వ్యాపారం మొత్తాన్ని అమ్మేసే పరిస్థితి లేకపోవడంతో పార్టు పార్టుగా అమ్మాల్సి వస్తోందనేది నిపుణుల మాట. ఇండియా వేరు. ఆఫ్రికా వేరని ఎయిర్‌టెల్‌కు ఇప్పుడు తెలిసొచ్చింది. 10.7 బిలియన్ డాలర్లు పెట్టి గల్ఫ్ కంపెనీ జయిన్కు చెందిన ఆఫ్రికా వ్యాపారాన్ని టేకోవర్ చేసింది. ఇపుడు వదిలించుకుంటోంది. జీవీకే టు అదానీ... ⇒మన కంపెనీల విదేశీ వేటలో... అటు కలిసిరాక, ఇటు రద్దవక అలా ఊగిసలాడుతున్న డీల్స్ చాలానే ఉన్నాయి. ళీ జీవీకే -హ్యాంకాక్ సంస్థలు కలిసి ఆస్ట్రేలి యాలోని గెలీలీ బేసిన్లో భారీ బొగ్గు గనులను అభివృద్ధి చేస్తున్నాయి. అయితే రకరకాల ఇబ్బందులతో ఇది ముందుకు సాగటం లేదు. రుణభారం పెరుగుతోంది. ⇒ఆస్ట్రేలియాలోని కోలీలో బొగ్గు వెలికితీతకు గ్రిఫిన్ కోల్ మైన్స్‌తో ల్యాంకో ఒప్పందం చేసుకుంది. గ్రిఫిన్ కోసం ల్యాంకో 600 మి. డాలర్లు వెచ్చించింది. రూ.37వేల కోట్ల రుణ భారమున్న ల్యాంకోకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వడ్డీల భారం పెరుగుతోంది. ⇒ఆస్ట్రేలియాలోని అబాట్ పాయింట్ పోర్టు లో అదానీ గ్రూప్ దాదాపు మూడు బిలియన్ డాలర్ల దాకా వెచ్చించింది. మరో 10 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రణాళికలు వేసుకుంది. కాకపోతే అక్కడి ప్రాజెక్టులకు పర్యావరణపరమైన అనుమ తులు రావటం లేదు. న్యాయ వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. 6 రిలయన్స్- ఈగిల్ఫోర్డ్ షేల్ గ్యాస్ షేల్‌గ్యాస్‌లో వేలుపెట్టి ఊపిరాడని రిలయన్స్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మన దేశంలో నెంబర్-1 పెట్రో కెమికల్స్ కంపెనీ. చేతిలో డబ్బులుండటంతో వ్యాపార విస్తరణకున్న అవకాశాలన్నిటినీ అన్వేషించింది. అప్పుడప్పుడే షేల్ గ్యాస్‌కు బాగా ప్రాచుర్యం రావటంతో... అందులో పెట్టుబడి బంగారాన్ని పండిస్తుందని అంచనా వేసింది. అప్పట్లో ముడి చమురు ధరలు అంతకంతకూ పెరగటమూ రిలయన్స్ ఆలోచనకు ఒక కారణం. దీంతో 2010లో అమెరికాలోని ఈగిల్ ఫోర్డ్ షేల్ గ్యాస్ ప్రాజెక్టులో 1.31 బిలియన్ డాలర్లు వెచ్చించి 45 శాతం వాటా కొనుగోలు చేసింది. ఆ వెంటనే పయోనీర్ సంస్థ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్లో దాదాపు 3.91 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. మొత్తమ్మీద 3 కంపెనీలతో మూడు జాయింట్ వెంచర్ల ద్వారా (అట్లాస్ ఎనర్జీ, కారిజో ఆయిల్ అండ్ గ్యాస్, పయోనీర్ నేచురల్ రిసోర్సెస్) అమెరికా షేల్ గ్యాస్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కాలుపెట్టింది. ఆర్థిక మాంద్యంతో ఇంధన వాడకం తగ్గింది. కానీ ప్రపంచవ్యాప్తంగా వాటిని ఉత్పత్తి చేస్తున్న దేశాలు తమ ఉత్పత్తిని మాత్రం తగ్గించలేదు. ఫలితం... డిమాండ్ తగ్గి, అమ్మకం రేటుకంటే ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది. సాధారణంగా షేల్ గ్యాస్‌పై పెట్టే భారీ పెట్టుబడులపై లాభం రావాలంటే చమురు రేటు బ్యారెల్‌కు కనీసం 60 డాలర్లయినా ఉండాలి. సంప్రదాయ విధానాల్లో ఉత్పత్తి చేసే మధ్యప్రాచ్య దేశాలకు బ్యారెల్ 25 డాలర్లున్నా లాభాలే. ఒకప్పుడు 147 డాలర్లకు వెళ్లిన క్రూడాయిల్ ధర కొన్నాళ్లుగా 40-45 డాలర్ల దగ్గరే తిరుగుతోంది. నష్టాల్ని తట్టుకోలేని రిలయన్స్... ఈగిల్ ఫోర్డ్ పైప్‌లైన్ అసెట్స్‌ను 2015లో 1.07 బి. డాలర్లకు విక్రయించేసింది. టాటా మోటార్స్- జేఎల్ఆర్ లక్షకారే కాదు.. కోట్లకారూ మాదే టాటా మోటార్స్‌ది ఆది నుంచీ భారీ వాహనాల వ్యాపారమే. 1998లో తొలిసారి కార్లలోకి దిగింది. ఇండికాను మార్కెట్లోకి తెచ్చింది. మొదట్లో దానికొచ్చిన స్పందన అంతంతే. కార్ల వ్యాపారాన్ని అమ్మేస్తే మంచిదన్నారు కొందరు. అది తెలిసి ఫోర్డ్ అధికారులు కొందరు ముంబయిలోని టాటా కార్యాలయానికి వచ్చారు. చర్చల అనంతరం... డెట్రాయిట్ రావాలని పిలిచారు. 1999లో ఓ బృందం వెళ్లింది. అక్కడ ఎదురైన అనుభవమేంటో తెలుసా? ‘‘అయినా అనుభవం లేకుండా ఈ బిజినెస్‌లోకి ఎందుకు వచ్చారు? ఇప్పుడు మీకు ఉపకారం చేయడానికి మీ వ్యాపారాన్ని కొనాలా?’’ అంటూ అవమానించారు. ఆ అధికారులు న్యూయార్క్‌కు తిరిగి వచ్చారు. రతన్‌టాటాకు విషయం చెప్పారు. సరిగ్గా తొమ్మిదేళ్ల తరవాత... 2009లో అదే ఫోర్డ్‌కు చెందిన జాగ్వార్, ల్యాండరోవర్ బ్రాండ్లను టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం సందర్భంగా ఫోర్డ్ మోటార్స్ చైర్మన్ బిల్ ఫోర్డ్ ఏమన్నారో తెలుసా? ‘‘మా జేఎల్ఆర్ను కొని మాకు పెద్ద ఉపకారం చేశారు’’ అని. అలా... టాటామోటార్స్ తన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంది. నిజానికి ప్రపంచానికి ఇష్టమైన లగ్జరీ బ్రాండ్ జేఎల్ఆర్ను కొనటానికి టాటా ముందుకెళ్లినపుడు కూడా విపరీతమైన అవమానకర వ్యాఖ్యలు వినపడ్డాయి.‘‘ఏదో లక్ష రూపాయల నానో కారు తయారు చేసుకునే కంపెనీ..! అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లను నిర్వహించటం ఎలా కుదురుతుంది? ఫోర్డ్ వల్లే కానిది టాటా వల్ల ఏమవుతుంది?’’ అంటూ బోలెడన్ని విమర్శలు. పెదవి విరుపులు. కానీ రతన్ టాటా పట్టు వదల్లేదు. 2008లో జేఎల్ఆర్ బ్రాండ్లను సొంతం చేసుకున్నారు. అక్కడితో ఆగలేదు. వాటిని టర్న్ అరౌండ్ చేశారు. అమ్మకాలు పెంచారు. విమర్శించిన వాళ్లే తరవాత నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం టాటా మోటార్స్‌కి బిలియన్ల కొద్దీ పౌండ్ల లాభాలను ఆర్జించి పెడుతోంది జేఎల్ఆర్. లక్ష కారే కాదు... లక్ష డాలర్ల కారునూ తామే తయారు చేస్తామని నిరూపించారు. కాకపోతే బ్రెగ్జిట్ పెద్దదెబ్బే కొట్టింది. వ్యూహం ఎలా మార్చుకుంటారో చూడాల్సిందే!!. మదర్సన్ సుమి-పెగ్యుఫామ్ కస్టమర్ల సూచన.. కంపెనీకి కలిసొచ్చింది మదర్సన్ సుమి సిస్టమ్స్. పాసింజర్ కార్ల అద్దాలు, వైరింగ్‌కు సంబంధించి హార్నెస్‌లను (హోల్డర్), ప్లాస్టిక్ ఉపకరణాలను తయారు చేసే ఈ సంస్థ దేశంలో ఈ తరహా ఉత్పత్తుల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించింది. విదేశీ దిగ్గజాలు ఫోక్స్ వ్యాగన్, దైమ్లర్ వంటివి ఈ కంపెనీకి కస్టమర్లే. అలాంటి మదర్సన్ సుమీ... 2008లో యూకేకు చెందిన విజియోకార్ప్ను కొనుగోలు చేసింది. దీన్ని కొనుగోలు చేస్తే పనికొస్తుందని మదర్సన్కు సలహా ఇచ్చింది వేరెవరో కాదు. దాని కస్టమర్ దైమ్లర్. తననుంచీ కాంట్రాక్టులొస్తాయని దైమ్లర్ చెప్పింది. ఇక 2011లో జర్మనీకి చెందిన పెగ్యుఫామ్ గ్రూప్‌లో 80 శాతం వాటాలను మదర్సన్ కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.890 కోట్లు వెచ్చించింది. అప్పటికి అంతంతమాత్రం పనితీరుతో ఉన్న పెగ్యుఫామ్ను... 2014లో అమెరికన్ కంపెనీ స్టోన్ రిడ్జ్కు చెందిన వైరింగ్ విభాగాన్ని కొనుగోలు చేసింది. ఈ మూడూ కొన్నపుడు సమస్యల్లోనే ఉన్నాయి. ఆ తరవాత పనితీరు మెరుగుపడి మదర్సన్ ఆదాయలు పెంచి... అంతర్జాతీయ కంపెనీగా మార్చాయి. అతిగా యూరప్పైన, యూకేపైన ఆధారపడటం వల్ల ఇది మున్ముందు పెను సవాళ్లు ఎదుర్కోక తప్పేట్టు లేదు. 2006లో టాటా స్టీల్ కోరస్ గ్రూప్ కొనుగోలుకు వెచ్చించిన మొత్తం 12,780 మి.డాలర్లు. 2010లో భారతీ ఎయిర్టెల్ జయిన్ ఆఫ్రికా కార్యకలాపాల టేకోవర్‌కు పెట్టిన మొత్తం 10,700 మి.డాలర్లు. 2007లో నోవెలిస్కు హిందాల్కో పెట్టిన మొత్తం 5,706 మి.డాలర్లు. 2008లో జేఎల్ఆర్కు టాటా వెచ్చించిన మొత్తం 2,300 మి.డాలర్లు. ఎస్సార్ స్టీల్ అల్గోమా కోసం ఎస్సార్ గ్లోబల్ 1,421 మి.డాలర్లు పెట్టింది. శ్రీరేణుకా షుగర్స్‌ను దెబ్బతీసింది మాంద్యం కాదు... కరువు. బ్రెజిల్ చక్కెర కంపెనీని టేకోవర్ చేసినా... అక్కడొచ్చిన రెండు కరువులు కంపెనీని దెబ్బతీశాయి. విజయాలకు గానీ, పరాజయాలకు గానీ కీలకమైన కారణాలు ఒకటి- టైమింగ్. రెండోది - కొనుగోలు వ్యయం. టైమింగ్ విషయానికొస్తే... 2008 వరకూ అంతర్జాతీయంగా కంపెనీలకు మహర్దశ నడిచింది. 2009 తరవాత విలువలు క్షీణించాయి. 2011 తరవాత ఘోరంగా తగ్గాయి. ఆర్సెలర్‌ను మిట్టల్ 2006లో... కోరస్‌ను టాటా 2007లో... సిల్వేనియాను హావెల్స్ 2007లో కొన్నాయి. అప్పట్లో వాటి ధరలు గరిష్ఠంగా ఉన్నాయి. ఇక కొనుగోళ్లకు భారీ అప్పులు చేసిన కంపెనీలు కూడా తట్టుకోలేకపోయాయి. -
వీళ్లంతా ఏపీకి సలహాదారులట!
ముదిరిన చంద్రబాబు విదేశీ మైకం సాక్షి, హైదరాబాద్: ‘నేను మారిన మనిషిని’. ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెప్పేమాట ఇది. కానీ తనలో ఎలాంటి మార్పూ లేదని ఆయన పదేపదే రుజువు చేసుకుంటున్నారు. ఆయనలో విదేశీమైకం ఏమాత్రమూ దిగలేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రపంచంలోని పలు ప్రముఖ పరిశ్రమల సీఈవోలు, మాజీ దేశాధ్యక్షులను రాష్ర్ట ఆర్థికాభివృద్ధి మండలి సలహాదారులుగా నియమించాలని చంద్రబాబు భావించడం ఇందుకు తాజా నిదర్శనం. ముఖ్యమంత్రి ఆలోచనలకనుగుణంగా ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో కృష్ణకిషోర్ పలు ప్రతిపాదనలను సిద్ధం చేశారు కూడా. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ మాజీ అధ్యక్షుడు టోనీ బ్లెయిర్, మైక్రోసాఫ్ట్ సంస్థాపక అధ్యక్షుడు బిల్‌గేట్స్ వంటివారిని రాష్ర్ట ఆర్థికాభివృద్ధి మండలి సలహాదారులుగా నియమించుకోవాలని ముఖ్యమంత్రి భావించడం చూస్తే ఆయన విదేశీ మైకం బాగా ముదిరినట్లు కనిపిస్తున్నదని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. బ్రాండ్.. ఇమేజ్.. భ్రమల నుంచి చంద్రబాబు బైటపడినట్లు కనిపించడం లేదని అధికారులంటున్నారు. క్లింటన్, బ్లెయిర్, బిల్‌గేట్స్ వంటివారితో ఎప్పుడు మాట్లాడతారని.. ఏ సలహాలు తీసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో బాబుగారి విజన్ మాటలు విని స్విట్జర్లాండ్ మంత్రి పాస్కల్ కొచెపిన్ ‘‘ఇలాంటివి చెబితే మాదేశంలో జైలుకన్నా పంపిస్తారు లేదంటే పిచ్చాసుపత్రికైనా పంపుతారు’’ అని వ్యాఖ్యానించిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ఇపుడు మరలా అదే తీరులో వ్యవహరిస్తున్నారని వారు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదనలు.. ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఏర్పాటు కాబోతున్న రాష్ర్ట ఆర్థిక మండలి ఎలా ఉండబోతోంది..? దాని రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి? అనేది గతకొంతకాలంగా చర్చనీయాంశంగా ఉంది. ఆర్థికాభివృద్ధి మండలి సీఈవోగా నియమితులైన ఐఆర్ఎస్ అధికారి జె.కృష్ణకిషోర్ ఇప్పటికే సింగపూర్‌లో ఆర్థిక అభివృద్ధి మండలిని అధ్యయనం చేసివచ్చారు. రాష్ర్ట ఆర్థికాభివృద్ధి మండలి ఏ తరహాలో ఉండాలో ఒక ప్రజంటేషన్ రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పించారు. ఆర్థికాభివృద్ధిమండలికి వివిధ రంగాలలో సలహాలు, సూచనలు ఇవ్వడం కోసం పలువురు విదేశీ ప్రముఖులను సలహాదారులుగా నియమించాలని అందులో ప్రతిపాదించారు. సలహాదారులుగా పరిశ్రమాధిపతులు.. మాజీ దేశాధినేతలు...!! రాష్ర్ట ఆర్థికమండలికి సలహాదారులుగా.. పరిపాలన రంగంలో బిల్ క్లింటన్, టోనీబ్లెయిర్, ఎస్.నారాయణ, ఫిలిప్ యో, ప్రతాప్ భానుమెహతా, అరుణ మైరాలను, పరిశ్రమల రంగంలో బిల్‌గేట్స్, రతన్ టాటా, ఎల్నో మస్క్, సత్య నాదెళ్ల, ఇంద్రా నూయీ, సుందర్ పిచాయ్, ఆనంద్ మహీంద్ర, శివ నాడార్, ఆది గోద్రెజ్, వై.సి.దేవేశ్వర్, దీపక్ పారిఖ్‌లను సలహాదారులుగా నియమించాలని ప్రతిపాదించారు. మౌలిక సదుపాయాల్లో ఎ.ఎం.నాయక్, జి.రఘురామ్, ప్రొఫెసర్ సెబాస్టియన్ మోరిస్, అశ్వన్ మహాలింగం, జగన్ షాలను, ఆర్థిక, పబ్లిక్ ఫైనాన్స్ రంగంలో వై.వి.రెడ్డి, సి.రంగరాజన్, డి.సుబ్బారావు, ఎం.గోవిందరావు, వివేక్ పాథక్, అశోక్ గులాటి, అభిజిత్ బెనర్జీలను సలహాదారులుగా నియమించాలని సూచించారు. నైపుణ్య పారిశ్రామిక రంగంలో ఆర్.ఎ. మషేల్కర్, సంతోష్ మెహరోట్రా, రాజన్ అనందన్, ఎస్.పరశురామన్, నందన్ నీలేకని, వినోద్ ఖోస్లాలను సలహాదారులుగా నియమించాలని ప్రతిపాదించారు. రెండు లక్షల కోట్ల పెట్టుబడులు! రాష్ర్టంలో 2019 నాటికి రూ. రెండు లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా ఆర్థికమండలి పనిచేస్తుందని కూడా సీఈవో కృష్ణ కిషోర్ ఆ ప్రతిపాదనలలో పేర్కొన్నారు. అయితే 1991 ఆగస్టు నుంచి మార్చి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8.96 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వస్తే కేవలం 41,860 కోట్ల రూపాయలు పెట్టుబడుల ప్రతిపాదనలు మాత్రమే అమలైనట్లు ఆర్థిక శాఖ ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. ఇది ప్రతిపాదనల్లో కేవలం 4.67 శాతం మాత్రమేనని ఆయన వివరించారు. అంతర్గత ఆదాయం పెంపు, యూజర్ చార్జీలు ఆర్థికాభివృద్ధి మండలిలో పలు విభాగాలు.. ప్రణాళిక-విధాన రూపకల్పన, పెట్టుబడుల ప్రోత్సాహక, ప్రాజెక్టు అప్రైజల్ సలహా సర్వీసు, ఆర్థిక వనరుల సమీకరణ-స్పెషల్ పర్పస్ వెహికల్ పనిచేస్తాయి. అంతర్గతంగా ఆదాయాన్ని పెంచే మార్గాలను ఆర్ధికాభివృద్ధి మండలి అన్వేషిస్తుంది. పన్ను మూలాల్ని విస్తరించడం, పన్నుల్ని పెంచడం, యూజర్ చార్జీల వసూలు ద్వారా ఆర్థిక వనరులను పెంచనుంది. అలాగే కేంద్రం నుంచి రాబట్టగలిగే ఆర్థిక వనరుల్ని గుర్తిస్తుంది. విదేశీ సంస్థల నుంచి రుణాల్ని రాబట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. ఆర్థికాభివృద్ధి మండలి ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తారు. న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లలో ఉప కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు. అలాగే అన్ని జిల్లా కేంద్రాలతోపాటు చెన్నై, బెంగళూరుల్లోనూ ఆర్థిక మండలి కార్యాలయాల్ని ఏర్పాటు చేస్తారు. న్యూయార్క్, కాలిఫోర్నియా, లండన్, పారిస్, బీజింగ్, షాంఘై, సింగపూర్, టోక్యోల్లోనూ స్థానికులద్వారా రాష్ట్ర ఆర్థిక మండలికి పనిచేసేలా ఏర్పాటు చేస్తారు. -
విదేశీ కంపెనీలకు ‘మ్యాట్’ ఊరట!
భారత్‌లో శాశ్వత కేంద్రం లేని విదేశీ సంస్థలకు ప్రభుత్వం ఉపశమనం - ఐటీ చట్ట సవరణకు నిర్ణయం న్యూఢిల్లీ: భారత్‌లో శాశ్వత కేంద్రం లేని విదేశీ కంపెనీలకు ‘మ్యాట్’ (కనీస ప్రత్నామ్నాయ పన్ను) నుంచి ఊరట కల్పించే కీలక నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. ఈ మేరకు ఆదాయపు పన్ను (ఐటీ) చట్టం సవరించనున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్‌తో (గత కాలం నుంచీ వర్తించే విధంగా) ఈ చట్ట సవరణ చేయాలని నిర్ణయించినట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలో విదేశీ సంస్థలు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా వ్యాపారాన్ని నిర్వహించుకునేందుకు తగిన వెసులుబాటు కల్పిస్తామని ప్రభుత్వం ఇస్తున్న హామీ నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది. భారత్‌తో ద్వంద్వ పన్నుల నివారణా చట్టం (డీటీఏఏ) చేసుకున్న దేశమా? కాదా? అన్న అంశంతో సంబంధం లేకుండా విదేశీ కంపెనీలు అన్నింటికీ తాజా పన్ను వెసులుబాటును కల్పిస్తున్నట్లు ఆర్థికమంత్రిత్వశాఖ వెల్లడించింది. 2001 ఏప్రిల్ నుంచీ లాభాలపై ఆయా కంపెనీలు మ్యాట్ మినహాయింపు పొందుతాయి. -
సీఎం చైనా పర్యటన సక్సెస్
పరిశ్రమలకు పచ్చజెండా ఊపిన తెలంగాణ * నేడు రాష్ట్రానికి చేరుకోనున్న సీఎం కేసీఆర్ బృందం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్ ఇమేజీని ప్రపంచానికి పరిచయం చేయటంతోపాటు రాష్ట్రానికి విదేశీ కంపెనీలు, పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులను ఆహ్వానించే లక్ష్యంతో కొనసాగిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చైనా పర్యటన విజయవంతంగా ముగిసింది. మంగళవారం హాంకాంగ్‌లో ఉన్న సీఎం బృందం బుధవారం ఉదయం అక్కణ్నుంచి బయలుదేరి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనుంది. పది రోజుల ఈ పర్యటనతో చైనాలోని వివిధ కంపెనీలు తెలంగాణలో కొత్త పరిశ్రమల స్థాపనకు ముందుకు రావటం శుభ సూచకం. రాష్ట్రంలో కొత్తగా అమలవుతున్న నూతన పారిశ్రామిక విధానానికి ప్రపంచ స్థాయిలో ప్రాచుర్యం కల్పించేందుకు ఈ పర్యటన దోహదపడింది. ‘పెట్టుబడులతో తరలి రండి.. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది..’ అని స్వయంగా భరోసా ఇవ్వటం ద్వారా పారిశ్రామికవేత్తల దృష్టిని తెలంగాణ వైపు మళ్లించటంలో సీఎం కృతక్యతులయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు చాటిచెప్పటంతోపాటు డేలియన్, బీజింగ్, షాంఘై, షెంజెన్, హాంకాంగ్లలోని పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహించటం ఆశించిన ఫలితాలు తెచ్చిపెట్టాయి. చైనాలో పేరొందిన లియో గ్రూపు, షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ఒక్కోటి రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులతో విద్యుదుత్పత్తి పరికరాల తయారీకి ముందుకొచ్చాయి. దీంతోపాటు చైనాలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో మేటి సంస్థ మకేనా, సెల్కాన్ కంపెనీలు హైదరాబాద్‌లో ఎల్ఈడీ, ఎల్సీడీల తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకున్నాయి. అధునాతన సదుపాయాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న షుజు, షెంజెన్ ఇండస్ట్రియల్ పార్కులను ముఖ్యమంత్రి బృందం సందర్శించింది. హైదరాబాద్‌లోనూ అదే స్థాయి ప్రమాణాలతో పారిశ్రామిక పార్కును నెలకొల్పే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించాలని బ్రిక్స్ బ్యాంక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సంప్రదింపులు జరపటం తో పెట్టుబడుల సమీకరణ దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసినట్లయింది. హాంకాంగ్‌లో బిజినెస్ సెమినార్ తెలంగాణలో పెట్టుబడులకు తరలిరావాలని హాంకాంగ్‌లోని పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని విశిష్టతలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఐదు నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీని ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీ అక్కడి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంది. చైనా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ బృందం సోమవారం హాంకాంగ్ చేరుకుంది. మంగళవారం ఉదయం అక్కడి రెన్యాసెన్స్ హార్బర్ వ్యూ హోటల్లో ఏర్పాటు చేసిన బిజినెస్ సెమినార్లో సీఎం పాల్గొన్నారు. ‘తెలంగాణలో హాంకాంగ్ కంపెనీలకు ఉన్న వ్యాపార అవకాశాలు..’ అనే అంశంపై సెమినార్‌ను నిర్వహించారు. అక్కడి భారత కాన్సుల్ జనరల్ ప్రశాంత్ అగర్వాల్, ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ యూనిట్ చైర్మన్ అరుణాచలం అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు చేసిన నూతన పారిశ్రామిక విధానం, సింగిల్ విండో అనుమతుల పద్ధతి, నిర్ణీత కాలవ్యవధిలో పరిశ్రమలకు ఇచ్చే క్లియరెన్స్‌లకు సంబంధించి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, కొత్త పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులపై రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రసంగించారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో సీఎం ముఖాముఖి ముచ్చటించారు. అనంతరం కాన్సుల్ జనరల్ సహా పారిశ్రామికవేత్తలతో కలసి విందులో పాల్గొన్నారు. బుద్ధ విగ్రహం సందర్శన... సెమినార్ అనంతరం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం హాంకాంగ్‌లోని లాంటావ్లో ఉన్న విశ్వవిఖ్యాత ‘తియాన్తాన్ బుద్ధ’ విగ్రహాన్ని సందర్శించింది. దాదాపు 202 టన్నుల కంచు లోహంతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. -
ఎఫ్‌డీఐల సంస్థలకూ...ఆన్లైన్లో విక్రయ అనుమతులపై కసరత్తు
న్యూఢిల్లీ: భారత్‌లో తయారీ యూనిట్లున్న దేశీ, విదేశీ కంపెనీలు ఆన్లైన్లో కొనుగోలుదారులకు నేరుగా ఉత్పత్తులు విక్రయించుకునే వెసులుబాటు కల్పించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) ఈ ప్రతిపాదనను ఉద్దేశించినట్లు వివరించారు. ఇప్పుడున్న ఎఫ్‌డీఐ విధానం ప్రకారం ఈకామర్స్కి సంబంధించి బిజినెస్2బిజినె స్ విభాగంలో మాత్రమే ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. బిజినెస్2కన్జూమర్ విభాగంలో అనుమతి లేదు. -
అనుబంధ పరిశ్రమలకు ఇవ్వం
పోర్టుకు ఇస్తాం విదేశీ సంస్థలకు తమ భూములు అప్పగించేది లేదంటూ రైతుల నినాదాలు భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసేవరకు పోరుబాట ధర్నాలో రైతులు, పోలీసుల మధ్య తోపులాట మచిలీపట్నం : ‘రెక్కలు ముక్కలు చేసుకుని ఒక్కో రూపాయి కూడబెట్టి, రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించుకున్న మా భూములను స్వాధీనం చేసుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రాణాలు పోయినా ఈ ప్రయతాన్ని అడ్డుకుంటాం’ అంటూ రైతులు ఎలుగెత్తి చాటారు. బందరు పోర్టుకు కాకుండా అనుబంధ పరిశ్రమలకు బందరు, పెడన మండలాల్లోని 24 గ్రామాల్లో 25 వేల ఎకరాలను సేకరించేందుకు విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ రైతులు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. మూడు గంటలపాటు ఈ ధర్నా కొనసాగింది. ప్రాణాలైనా అర్పిస్తాం గాని భూములు ప్రభుత్వానికి అప్పగించబోమంటూ రైతులు చేసిన నినాదాలతో కలెక్టరేట్ మార్మోగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, ఇతర ప్రజాసంఘాలు రైతుల ధర్నాకు మద్దతు పలికాయి. 24 గ్రామాల నుంచి వేలాదిగా రైతులు తరలిరావటంతో కలెక్టరేట్ ఎదుట రోడ్డు కిక్కిరిసిపోయింది. మండే ఎండను సైతం లెక్క చేయకుండా రైతులు మూడు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అడ్డుకునేందుకు సిద్ధం... ధర్నాను ఉద్దేశించి వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని మాట్లాడుతూ తాతల, తండ్రుల నాటి నుంచి రైతులు సంపాదించుకున్న భూమిని టీడీపీ ప్రభుత్వం పరిశ్రమల స్థాపన పేరుతో విదేశీ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. స్థానికంగా ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావులు ముఖ్యమంత్రి చెప్పినట్లుగా నడుచుకుని రైతులకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. భూమి సర్వే పనులు ఒకటి, రెండు రోజుల్లో ప్రారంభిస్తారని, ప్రతి గ్రామంలోనూ రైతులు అధికారులను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పోర్టుకు వ్యతిరేకం కాదు... పోర్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అనుబంధ పరిశ్రమల పేరుతో 25 వేల ఎకరాల సేకరణనే వ్యతిరేకిస్తున్నామని పేర్ని నాని చెప్పారు. 25 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. కలెక్టర్ బాబు.ఎ ముఖ్యమంత్రికి చెంచాలా వ్యవహరిస్తున్నారని, రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నారని తెలుసుకుని ఇక్కడకు రాకుండా పారిపోయారని ఆయన విమర్శించారు. రైతులు ఒక్క అడుగు వేస్తేనే కలెక్టర్ పారిపోయారని, ఇది రైతుల తొలి విజయమని అన్నారు. మరో రెండు అడుగులు వేస్తే ఎంపీ, మంత్రి కూడా పారిపోతారన్నారు. రైతుల తరఫున పోరాటం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ పోర్టు నిర్మాణం కోసం ఎన్నాళ్లుగానో పోరాటం జరుగుతోందని, ఇందుకోసం ఐదు వేల ఎకరాల భూమిని ఇచ్చేందుకు కూడా రైతులు సిద్ధంగా ఉన్నారని వివరించారు. పోర్టు నిర్మించకుండా, ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తారో చెప్పకుండా పరిశ్రమల స్థాపన పేరుతో 25 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకుని విదేశీ సంస్థలకు అప్పగించేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ సింగపూర్, జపాన్ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు రైతుల భూములను కట్టబెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. వేల ఎకరాల భూములను సేకరించి ఏ సంస్థకు అప్పగిస్తారని ప్రశ్నించారు. ఈ నెల 13న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మచిలీపట్నంలో పర్యటిస్తారని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ రైతుల నుంచి భూములను తీసుకుని వాటిని తాకట్టుపెట్టి కోట్లాది రూపాయల వ్యాపారం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. అమరావతి రైతులకు ఇప్పటికీ ఇవ్వలేదు సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు మాట్లాడుతూ అమరావతిలో భూమిని కోల్పోయిన రైతులకు ఇంతవరకు కేటాయింపు చేయలేదన్నారు. వారికి కేటాయించిన భూమి ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఉందన్నారు. మచిలీపట్నంలోనూ ఇదే పరిస్థితిని ప్రభుత్వం పునరావృతం చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు భూదాహం పెరిగిపోయిందని, రైతులను బెదిరిస్తున్నారన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ కంచికచర్లలో ఓ స్వామీజీకి వందలాది ఎకరాలను ప్రభుత్వం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే అక్కడి రైతులు తిరగబడ్డారన్నారు. 30 రోజుల పాటు ఉద్యమం జరిగిందని, దీంతో ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. సీపీఎం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు వై.కేశవరావు, ఎం.వాకాలరావు తదితరులు పాల్గొన్నారు. తోపులాట.. ఉద్రిక్తత.. కలెక్టరేట్ వద్ద రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ధర్నా కోసం ఆటోలో జనరేటర్, సౌండ్ బాక్సులను తీసుకురాగా ఎస్సై జనరేటర్ హ్యాండిల్‌ను తనతో తీసుకువెళ్లారు. రైతులు ఎంత బతిమాలినా పోలీసులు స్పందించకపోవటంతో వేలాదిమంది కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు పోలీసులు దిగి వచ్చి జనరేటర్ హ్యాండిల్ ఇవ్వటంతో పరిస్థితి సద్దుమణిగింది. రైతుల ధర్నాను అదుపు చేసేందుకు రోప్ పార్టీ, భాష్పవాయువు గోళాలు ఉపయోగించే తుపాకులు, రైతులపై నీటిని చిమ్మేందుకు ఫైర్ ఇంజన్, ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేయటం గమనార్హం. -
ఆ ఒప్పందాలను బయట పెట్టండి
సాక్షి, హైదరాబాద్: విదేశీ కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసుకున్న ఒప్పందాల గుట్టును బయట పెట్టాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు విదేశీ పర్యటనలకు పారదర్శకత లేకుండా పోతోందన్నారు. జపాన్ ప్రధాని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే ఆ వెనుక ఉన్న ఒప్పందమేమిటో బహిర్గతం చేయాలన్నారు. విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు ఎంతో స్పష్టం చేయాలన్నారు. చైనా, జపాన్, సింగపూర్‌లతో చేసుకున్న ఒప్పందాలనూ బహిర్గతం చేయాలన్నారు. విజయవాడ భవానీదీపాన్ని చైనాకు, అమరావతిని జపాన్‌కు, హీరో హోండా కంపెనీకి 600 ఎకరాలు కట్టబెట్టిన చంద్రబాబు ఆ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలతో పాటు గతంలో ఏ ప్రభుత్వం, ఏ కంపెనీకి ఇవ్వని విధంగా ఏషియన్ పెయింటింగ్స్‌కు కల్పించిన రాయితీల వెనకున్న నిగూఢత్వాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సెటిల్మెంటు ఆపండి...: ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై జరిగిన దాడి ఘటనలో సెటిల్మెంట్ జోలికి పోకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాలతో వనజాక్షిపై భౌతిక దాడులకు పాల్పడినా చంద్రబాబు నేతృత్వంలో రాజీ ప్రయత్నం చేస్తుండటం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా తహశీల్దార్ ఇంటికి ఇద్దరు మంత్రులు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఏం మాట్లాడారో స్పష్టం చేయాలన్నారు. సోమవారం చర్చలు జరుపుతామని మంత్రులు పేర్కొనడాన్ని ఆక్షేపించారు. -
సోలార్ టెండర్లకు విదేశీ కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: సోలార్ విద్యుత్తు టెండర్లలో పాల్గొనేందుకు దేశ విదేశీ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. 2000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు ఇటీవల టీఎస్ఎస్పీడీసీఎల్ టెండర్లు పిలిచింది. శుక్రవారం హైదరాబాద్‌లోని సదరన్ డిస్కం కార్యాలయంలో నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి దాదాపు 300 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్ఆర్ఐలు సైతం సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. టీఎస్ జెన్కో చైర్మన్ డి.ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. -
మీ ‘కేర్’ మీ చేతుల్లోనే...
అద్భుతాలు చేయడానికి బడా బడా కంపెనీలే అక్కర్లేదు. మల్టీ మిలియన్ డాలర్ల పెట్టుబడీ అవసరం లేదు. ఓ మంచి ఐడియా... దాన్ని నెరవేర్చుకోవాలన్న సంకల్పం... నెరవేర్చుకునే నైపుణ్యం... ఈ మూడూ ఉంటే చాలు. నిజమే! ఈ మూడు లక్షణాలతో మొదలైన స్టార్టప్‌లు అద్భుతాలు చేస్తున్నాయి. కనీవినీ ఎరుగని సేవల్ని అందుబాటులోకి తెస్తున్నాయి. అలాంటి స్టార్టప్ కంపెనీలను వెదికి... వాటి వివరాలను పాఠకులకు అందించటాకే ‘సాక్షి’ ఈ ‘స్టార్టప్ డైరీ’ని ఆరంభిస్తోంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నుంచి నివేదికలన్నీ ఆన్లైన్లోనే ⇒ అదికూడా... అర్థమయ్యే భాషలో సరళీకరణ ⇒ హైదరాబాదీ స్టార్టప్ ‘ఈ కిన్‌కేర్’ ఉచిత సేవలు ⇒ రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టిన విదేశీ సంస్థలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హలో... అమ్మా ఒంట్లో ఎలా ఉంది? టైంకి మందులేసుకుంటున్నారా? మళ్లీ చెకప్‌కు డాక్టర్ ఎప్పుడు రమ్మన్నాడు? ఎవరైనా ఎన్నారై తన ఇంటికి ఫోన్ చేస్తే చాలు... ఈ మాటలు ఉండాల్సిందే. తరవాత తల్లిదండ్రులు చెప్పిన వివరాలు విని ఆదుర్దా పడటం... వీలైతే తనకు తెలిసిన ఓ డాక్టర్నో, ఆసుపత్రినో సూచించటం. ఇప్పటిదాకా అంతే!! అయితే ఇలాంటి చెకప్‌లకు చెక్ పెడుతోంది ekincare.com.ఫోన్లో మాట్లాడటంతోనే వదిలిపెట్టకుండా ఆ ఫోన్లోనే మనవాళ్ల ఆరోగ్య వివరాలూ తెలుసుకునేందుకు వీలుగా ఈ స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు హైదరాబాద్‌కు చెందిన కిరణ్ కే. కలకుంట్ల. కంపెనీకి సంబంధించి ‘సాక్షి’తో ఆయన ఏం చెప్పారంటే... అమెరికా ఉద్యోగం వదిలిపెట్టి... హైదరాబాద్‌లోని గోకరాజు రంగరాజు కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి 2004లో ఎంఎస్ చదవటానికి అమెరికా వెళ్లా. నాకైతే చిన్నప్పటి నుంచీ సొంత కంపెనీ పెట్టాలని ఉండేది. యూఎస్‌లో టెలికం సేవల కంపెనీ ఐటీఅండ్టీలో నార్త్ అమెరికా మేనేజర్‌గా పనిచేశా. 2013లో ఉద్యోగం వదిలేసి ఇండియాకు వచ్చా. జనానికి, సమాజానికి ఉపయోగపడే ఏదైనా ఓ కొత్త కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నా. మొదట్లో ఎవరూ నా నిర్ణయాన్ని ఒప్పుకోలేదు. బంగారంలాంటి ఉద్యోగం వదిలేసి ఎదుకొచ్చావన్నారు. అయినా బాధపడలేదు. నాకైతే నమ్మకం ఉంది. సొంత కంపెనీ పెట్టి ఎదుగుతానని. ఆ పేరెందుకంటే... e ఎలక్ట్రానిక్స్... kin కుటుంబీకులు/బంధువులు/శ్రేయోభిలాషులు... care శ్రద్ధ అని అర్థం. అంటే మొత్తంగా చూస్తే.. సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌ల వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ద్వారా మన వాళ్ల ఆరోగ్యం గురించి మనం శ్రద్ధ వహించడమన్నమాట. మా సేవలు కావాలంటే... ekincare సేవలు వినియోగించుకోవాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ekincare యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఆన్లైన్లో భద్రపరచాలనుకుంటున్న మెడికల్ రికార్డులను, రిపోర్టులను, ప్రిస్కిప్షన్స్‌ను, డాక్టర్ సమ్మరీలను మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా ఫొటో తీసి యాప్‌లోకి అప్లోడ్ చేయాలి. సులువుగా అర్థమయ్యేలా... డాక్టర్ ప్రిస్క్రిప్షన్గానీ, ల్యాబ్ రిపోర్టులు గానీ ఇవేవీ మనకు సులువుగా అర్థమయ్యేవి కావు. డాక్టర్ చెప్పింది నమ్మడం తప్ప మనం చేసేదేమీ ఉండదు. కానీ, ekincareలో మాత్రం వచ్చిన వ్యాధేంటి? అది ఏ స్థాయిలో ఉంది? వంటి విభిన్న కోణాల్లో విశ్లేషిస్తూ.. క్లయింట్లకు అర్థమయ్యే భాషలో వాటిని సరళంగా చెబుతాం. వాటి వివరాలను గ్రాఫులు, రంగుల రూపంలో తెలియజేస్తాం. (ఎరుపు రంగుంటే ప్రమాదకర స్థితిలో ఉన్నట్టు.. పసుపు రంగుంటే జాగ్రత్తలు తీసుకుంటే మేలని గుర్తుగా..) సంబంధిత వ్యాధి తాలూకు చరిత్ర, తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరిస్తాం. తలనొప్పి నుంచి మొదలుపెడితే గుండె పోటు వరకు సుమారు 150కి పైగా వ్యాధులకు సంబంధించిన రికార్డులను ఆన్లైన్లో భద్రపరచుకోవచ్చు. ఈ సేవలన్నీ ఉచితంగానే అందిస్తున్నాం. దేశవ్యాప్తంగా 1,500కి పైగా ఆసుపత్రుల్లో... దేశవ్యాప్తంగా 1,500కు పైగా ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు మా సంస్థతో అనుసంధానమై ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో డాక్టర్ అపాయింట్మెంట్లను కూడా మా యాప్ ద్వారానే బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వారి రిపోర్ట్లు పరీక్షల తరవాత నేరుగా మేమే తీసుకుంటాం. వాటిని సరళీకరించి యాప్‌లో అప్లోడ్ చేస్తాం. క్లయింట్ నేరుగా తన మొబైల్లోనే వీటిని చూసుకోవచ్చు. తర్వాతి చెకప్ మళ్లీ ఎప్పుడుం టుందో ముందుగానే చెబుతాం కూడా. ప్రస్తుతం అపోలో డెంటల్, మాక్సి విజ న్, పార్థ డెంటల్, వాసన్ ఐ కేర్, విజయ డయాగ్నస్టిక్స్, తపాడియా, థైరో కేర్, డాక్టర్ లాల్ ఆసుపత్రులతో కంపెనీ అనుసంధానమై ఉంది. త్వరలోనే ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని ఆసుపత్రుల్లోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. త్వరలో హోమ్ హెల్త్కేర్లోకి... ఇప్పటివరకు క్లయింట్స్ నివేదికలను ఆన్లైన్లో భద్రపరచడమే చేస్తున్నాం. ఈ నెలాఖరుకల్లా డయాబెటిస్, అధిక రక్తపోటు, కార్డియో వాస్క్యులర్ (గుండె- రక్తనాళాలకు సంబంధించి) వ్యాధులకు చికిత్సలు కూడా చేస్తాం. అది కూడా నేరుగా ఇంటికి వెళ్లి. దీనికోసం ప్రత్యేక మెడికల్ ఆఫీసర్లను నియమించాం. ఆ రోగుల నివేదికలను కూడా ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తాం. రూ.2 వేలకు కుటుంబంలోని ఇద్దరికి మొత్తం బాడీ చెకప్ చేస్తాం. ఇందులో సుమారుగా 70 రకాల చెకప్లుంటాయి. రూ.2 కోట్ల పెట్టుబడులు..: అమెరికా నుంచి స్వదేశానికి తిరిగొచ్చాక దాదాపు ఆరు నెలల పాటు శ్రమించి కంపెనీని ప్రారంభించా. గతేడాది నవంబర్‌లో మార్కెట్లోకి వచ్చాం. ప్రస్తుతానికి కంపెనీలో 1,000 మంది క్లయింట్లు రిజిస్టరై ఉన్నారు. ఇటీ వలే బిట్చెమీ వెంచర్ క్యాపిటల్, యూఎస్ కంపెనీ అయిన అడ్రాయిటెంట్ కంపెనీలు రూ.2 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. వీటిని పూర్తిగా కంపెనీ విస్తరణ, మార్కెటింగ్ కోసం వినియోగిస్తున్నాం. అద్భుతమైన స్టార్టప్ ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే bussiness@sakshi.com కు మెయిల్ చేయండి.... -
ఆతిథ్యం, విమానయాన రంగాల్లో అధిక ఉద్యోగాలు
ముంబై: విమానయానం, ఆతిథ్య రంగాల్లో ఈ ఏడాది ఉద్యోగాలు జోరుగా వస్తాయని నిపుణులంటున్నారు. ఈ రెండు రంగాల్లో విదేశీ కంపెనీలు పెట్టుబడులు కొనసాగిస్తున్నాయని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయని గ్లోబల్‌హంట్ ఎండీ సునీల్ గోయల్ చెప్పారు. ఈ కారణాల వల్ల ఈ రెండు రంగాల్లో ఈ ఏడాది హైరింగ్ 40% వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఇదే విధమైన అభిప్రాయాన్ని కెల్లీ సర్వీసెస్ ఇండియా ఎండీ కమల్ కర్నాథ్ వ్యక్తం చేశారు. ఆతిథ్య రంగంలో ఈ ఏడాది 60,000-80,000, విమానయాన రంగంలో పదేళ్లలో 3.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని వివరించారు. ఈ ఏడాది హైరింగ్ 20-25 శాతం వృద్ధి సాధిస్తుందని పీపుల్‌స్ట్రాంగ్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈఓ పంకజ్ బన్సాల్ చెప్పారు. ఆతిథ్యం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో హైరింగ్ 25 శాతానికి పైగా వృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. వాహన, సాఫ్ట్వేర్, ఐటీ, బీపీఓ, ఐటీఈఎస్ రంగాల్లో 10 శాతం వృద్ధి ఉంటుందని వివరించారు. బడ్జెట్లో ఆతిథ్యం, విమానయాన రంగాలకు నజరానాలు ప్రకటిస్తారని, దీంతో ఈ రెండు రంగాల్లో హైరింగ్ 8-10 శాతం చొప్పున పెరుగుతుందని తెలిపారు. ప్రధాని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కారణంగా తయారీ రంగంలో కూడా భారీగానే ఉద్యోగావకాశాలు ఉంటాయని, అయితే వివిధ రంగాల్లో ప్రతిభ గల ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందని నిపుణులంటున్నారు. -
వినువీధి వి‘చిత్రం.. వెల్ డ్రోన్
రిమోట్ కంట్రోల్‌తో నడిచే బొమ్మ కార్లు, బుల్లి హెలికాప్టర్లు ఎప్పుడో నడిపేశాం. మారుతున్న కాలం బుల్లి విమానాలను ఫొటోలు, వీడియోలు తీసే అధునాతన సాధనంగా మార్చేసింది. అవుట్డోర్ సినిమా షూటింగ్ నుంచి ఇండోర్ భారీ వెడ్డింగ్‌ల వరకూ ఈ విహంగ నేత్రాలుకన్ను గీటుతున్నాయి. సిటీలో మెట్రో పరుగుల్ని సైతం వీటి సాయంతోనే చిత్రీకరించారు. గారడీ చేసినట్టు గాల్లో గింగిరాలు కొడుతూ ఆకట్టుకునే ఈ సరదా బొమ్మలే సీరియస్ ఫీల్డ్‌లోకి ఎంటరై ‘డ్రోన్’లుగా రూపాంతరం చెంది అద్భుతాలు చిత్రీకరిస్తున్నాయి. పలు రంగాలకు వినూత్న పాఠాలు నేర్పుతూ, సాంకేతిక సేవల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న వినువీధి వి‘చిత్రం’ డ్రోన్. వీటి వాడకంలో వైవిధ్యానికి సంబంధించి దేశంలోని తొలి ఆరు నగరాల్లో హైదరాబాద్ ఒకటని ఇటీవల ఓ జాతీయ దినపత్రిక వెల్లడించిన నేపథ్యంలో ‘డ్రోన్’ వినియోగం అంతకంతకూ ఆసక్తి రేపుతోంది. వార్‌లో వెల్‘డ్రో’న్... డ్రోన్‌కు కెమెరా బిగించి చిత్రీకరించడం ఆర్మీ అవసరాలతో మొదలైంది. అట్నుంచి బాలీవుడ్లో ల్యాండ్ అయిన డ్రోన్.. లెజెండ్, ఆగడు, బాహుబలి లొకేషన్స్‌లో ఎగురుతూ.. సిటీలో పెళ్లిళ్లు, ఫ్యాషన్ షోలనూ ఓ చూపు చూస్తున్నాయి. తమ వెంచర్ విశేషాలను కస్టమర్లకు చూపడానికి సిటీ రియల్ ఎస్టేట్ సంస్థలు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. భారీ పరిశ్రమల ఏరియల్ ‘వ్యూ’కి సైతం ఇవి ఉపకరిస్తున్నాయి. నిన్నటి ఆడుకునే డ్రోన్ నేడు నమ్మకమైన నేస్తంగా వీడియోగ్రఫీలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. చిత్రీకరణ (గ)ఘనం... పలు దేశ, విదేశీ కంపెనీలు ఈ డ్రోన్లను ఆక్టోకాప్టర్, డబుల్ ఆక్టోకాప్టర్ విభాగాల్లో అందిస్తున్నాయి. సినిమా వంటి అవసరాల కోసం డబుల్ ఆక్టోకాప్టర్లు వినియోగిస్తుంటే నగరంలో విభిన్న అవసరాల కోసం వాడేవి పరిమిత సామర్థ్యం ఉన్న ఆక్టోకాప్టర్లే. వీటి ధర రూ. లక్ష నుంచి రూ.7 లక్షల దాకా పలుకుతోంది. దాదాపు ఒకటిన్నర కేజీ ఆపైన బరువుండే వీటికి 400 నుంచి 800 గ్రాముల బరువుండే కెమెరాలను అమరుస్తున్నారు. ఇవి తక్కువ శబ్దుంతో, బ్యాటరీ ఆధారంగా నడుస్తాయి. ఒక బ్యాటరీ 20 నిమిషాల వరకు పనిచేస్తుంది. చేతిలో ఉన్న రిమోట్ సూచనలకు అనుగుణంగా తిప్పుతూ అవసరమైన సీన్లు షూట్ చేసుకునే చాన్స్ ఉంది. స్క్రీన్ మీద వీటి గమనాన్ని వీక్షిస్తూ.. ల్యాప్‌టాప్, ఐపాడ్, టాబ్లెట్స్, మొబైల్స్ ద్వారా సైతం కదలికల్ని నియంత్రించవచ్చు. క్రేన్స్‌కు చెక్... భారీ కార్యక్రమాలను చిత్రీకరించేందుకు కెమెరాను అమర్చేందుకు వాడుకలో ఉన్న క్రేన్స్ హవాకి డ్రోన్స్ చెక్ పెడుతున్నాయి. తక్కువ ప్లేస్‌లో ఇమిడిపోవడం, సులభంగా ఆపరేట్ చేయగలగడం, ఖర్చు పరంగా చూసినా లాభమే కావడంతో.. పలువురు వీడియో గ్రాఫర్లు డ్రోన్‌కు జై కొడుతున్నారు. ముందుకూ వెనక్కూ కదిలే సౌలభ్యం ఉండటంతో జూమ్ చేయాల్సిన అవసరం లేకుండానే చిత్రీకరణ సాగిపోతోంది. అయితే డ్రోన్ ప్రయోగానికి పోలీసుల అనుమతి తప్పనిసరి. ప్రముఖులు ఉన్న ప్రదేశాల్లో వీటి వినియోగానికి అనుమతి లభించదు. ఫ్యాషన్ పరేడ్‌లో డ్రోన్ ఇటీవల సిటీలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో డ్రోన్ వాడటం ద్వారా దేశంలోనే హైదరాబాద్ సరికొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. నగరవాసులైన దీపికానాథ్ (ఖమ్మం), రాజేష్కట్టా (కరీంనగర్)లు తమ స్టార్టప్ కంపెనీ ‘పిక్సలిజం’ ద్వారా సిటీలో డ్రోన్ల వాడకంలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ‘బీటెక్ చదివి, చిన్న చిన్న ప్రమోషన్ల ద్వారా వచ్చిన డబ్బులే పెట్టుబడిగా ఈ కంపెనీ పెట్టాం. షార్ట్ టైంలో మా కంపెనీకి మంచి పేరొచ్చిందంటే దానికి ప్రధాన కారణం డ్రోన్స్‌ను వైవిధ్యంగా వినియోగించడమే. సిటీలోనే కాదు తెలంగాణ, ఏపీ నుంచి కూడా మాకు ఎంక్వయిరీలు వస్తున్నాయి. పెళ్లిళ్లు, విభిన్న రకాల వేడుకల్లో మరిన్ని సరికొత్త ధోరణులను ప్రవేశపెట్టనున్నాం’’ అని ఈ మిత్రద్వయం చెబుతోంది. మరిన్ని రంగాల్లో .. త్వరలో మరిన్ని రంగాలకు డ్రోన్స్ వాడకం విస్తరించనుంది. సిటీలో ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ట్రయిలర్ చూపించడానికి ప్రొజెక్టర్‌ను డ్రోన్‌కు బిగించి కొత్త స్టైల్‌కు తెర తీశారు. ఇప్పటికే ముంబైలో డామినోస్ సంస్థ పిజ్జా డెలివరీకి డ్రోన్‌ను ఉపయోగించగా, కొన్ని ప్రాంతాల్లో బంగాళదుంప పంటకు హానికరమైన తెగుళ్లను పట్టుకోవడానికి కూడా డ్రోన్స్‌ను వినియోగిస్తున్నారు. పలు రెస్టారెంట్స్ ఫుడ్ సర్వ్ చేయడానికి వెయిటర్స్ బదులు డ్రోన్స్‌ను వినియోగించేలా ప్లాన్స్ చేస్తున్నాయి. - ఎస్.సత్యబాబు -
పరభాషను ఒడిసిపట్టి.. వైవిధ్య కొలువు తలుపుతట్టి!
విదేశీ భాషలను నేర్చుకోవడంలో ముందుంటున్న నగర యువత మాతృభాష.. మనిషి మేధో వికాసానికి విలువైన వారధి! అలాంటి అమ్మ భాష ఆసరాగా విద్యా సుమాలను అందుకుంటూ, పరభాషలో ప్రావీణ్యం పెంచుకుంటోంది భాగ్యనగరం యువత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచీకరణ.. ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చుతున్న వేళ.. విదేశీ భాషా నైపుణ్యాలున్న వారికి కార్పొరేట్ ప్రపంచం ఆకర్షణీయ వేతనాలతో స్వాగతం పలుకుతోంది. అందుకే విదేశీ భాషను ఒడిసిపట్టి, వైవిధ్యమైన కొలువును చేజిక్కించుకుంటామంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్.. ఐటీ రంగంలో దూసుకెళ్తుతున్న నగరం. అనేక విదేశీ కంపెనీలు భాగ్యనగరంలో ప్రవేశించి వ్యాపార కార్యకలాపాలను విస్తరింపజేసుకుంటున్నాయి. ఇక్కడి కంపెనీలు కూడా విదేశీ కంపెనీలతో జతకడుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీల మధ్య పరస్పర అవగాహన ఒప్పందాలు, ప్రాజెక్టుల అప్పగింత వంటి కార్యకలాపాలు సజావుగా సాగేందుకు విదేశీ భాషా నైపుణ్యాలున్నవారు అవసరమవుతున్నారు. విదేశాల్లో చదువుకొని అక్కడే కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకున్నవారు అధికమయ్యారు. ఇలాంటి వారు కూడా ఫారెన్ లాంగ్వేజ్‌లను నేర్చుకుంటున్నారు. నగరానికి చెందిన భార్యభర్తలు ఇద్దరూ ఐటీ ప్రొఫెషనల్స్. ఓ కంపెనీలో గత రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ ప్రముఖ కంపెనీ అడోబ్‌కు దరఖాస్తు చేసుకుంటే.. జర్మన్ భాషా పరిజ్ఞానం కలిగిన భార్యకు కంపెనీని నుంచి ఆఫర్ వచ్చింది. దాంతో భర్తకు కూడా జర్మనీ నేర్పించే పనిలో పడింది ఆ ఇల్లాలు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏలు చదివి ప్రముఖ కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్స్‌కు ఫ్రెంచ్, జర్మనీ, జపనీస్, ఇటాలియన్, స్పానిష్ లలో ఏదో ఒక భాష వచ్చి ఉండటం కెరీర్ ఉన్నతికి, మరిన్ని ఉన్నత అవకాశాలు అందుకోవడానికి దోహదపడుతోంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని నగరంలోని పలు సంస్థలు విదేశీ భాషలకు సంబంధించి వివిధ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. అదనపు అర్హత: ఒక్క ఐటీ కంపెనీల్లోనే కాదు.. బ్యాంకింగ్, విద్య, వైద్యం తదితర రంగాల్లో ఉద్యోగాలు సంపాదించేందుకు విదేశీభాషా నైపుణ్యాలు అదనపు అర్హతగా ఉపయోగపడతాయంటున్నారు ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ప్రొఫెసర్లు. కర్నూలు జిల్లా నుంచి నగరానికి వచ్చిన అనంతరాములు స్నేహితులతో కలిసి ‘లాటిన్’ నేర్చుకున్నాడు. విదేశీ బ్యాంకు హైదరాబాద్‌లో శాఖను ప్రారంభించి, ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. ఓ ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూకు వచ్చిన వారితో పోల్చితే రాములుకు తక్కువ మార్కులు వచ్చినా, లాటిన్ భాష ప్రత్యేకత ఉన్న ఆయన్నే ఉద్యోగం వరించింది. ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి వచ్చిన యువతకూ విదేశీ భాషలు ఉద్యోగ అవకాశాలకు ఆయువుపట్టుగా మారుతున్నాయి. అవకాశాలు ఇలా: విదేశీ భాష కోర్సులను పూర్తిచేసిన వారిలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ట్రాన్స్లేషన్. విదేశీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపేందుకు, వ్యాపార నివేదికలు, ఒప్పంద పత్రాలు వంటి వాటిని తర్జుమా చేసేందుకు ట్రాన్స్‌లేటర్లు అవసరమవుతున్నారు. ఒకరి మాటలను అనువదించి మరొకరికి అప్పటికప్పుడు వినిపించడమే ఇంటర్‌ప్రెటర్స్ పని. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలకు ఇంటర్‌ప్రెటర్స్ అవసరం ఉంటుంది. సదస్సులు, ఒక దేశ వాణిజ్య బృందం మరొక దేశంలో పర్యటించే సమయంలోనూ ఈ నిపుణుల అవసరం ఏర్పడుతుంది. విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించే క్రమంలో విమానయాన, పర్యాటక, ఆతిథ్య సంస్థలు ఉద్యోగ నియామకాల్లో విదేశీ భాషలు తెలిసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. విదేశీ భాషల కోర్సులు పూర్తిచేసిన వారికి మరో ఉపాధి వేదికగా బోధన రంగం ఉంటోంది. విదేశీ భాషలను నేర్చుకోవాలనుకుంటున్న ఔత్సాహికులు ఎక్కువ కావడంతో.. ఫ్యాకల్టీకి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆయా సంస్థలు.. తమ దగ్గర కోర్సులు పూర్తిచేసిన వారికి, వెంటనే భారీ వేతనాలతో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం పలు కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలు విదేశీ భాషల కోర్సులను నిర్వహిస్తున్నాయి. విదేశీ భాషల్లో పట్టు సాధించినా, పూర్తిస్థాయి ఉద్యోగంపై ఆసక్తి లేని వారు ఫ్రీలాన్సింగ్ ద్వారా అధిక మొత్తాలను ఆర్జిస్తున్నారు. సొంతంగా భాష శిక్షణ కేంద్రాలను, ట్రాన్స్‌లేటింగ్, ఇంటర్ప్రెటింగ్ సేవల సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. దూరవిద్యలో: విదేశీ భాషలు నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఇఫ్లూ ‘ది స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్’ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ, విదేశీ భాషలను నేర్పిస్తోంది. విదేశీ భాషలు నేర్చుకునేందుకు అవసరమైన పుస్తకాలను సైతం విక్రయిస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని జర్మనీ సాంస్కృతిక సంస్థ గోథె జంత్రం (ఎౌ్ఛ్టజ్ఛ్డ్ఛ్టిటఠఝ) జర్మన్ భాషను, అలియన్స్ ఫ్రాంచైజ్ ఫ్రెంచి భాషలో కోర్సులను అందుబాటులో ఉంచాయి. విద్యార్థుల రోజువారీ చదువులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు వీలుగా ఉదయం, సాయంత్రం బ్యాచ్‌లను నడుపుతున్నాయి. దోమలగూడలోని రామకృష్ణమఠం ఆధ్వర్యంలోని ‘వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్’.. ఏటా జనవరి, జూన్, సెప్టెంబరు నెలల్లో విదేశీ భాషల తరగతులను నిర్వహిస్తోంది. ఇక్కడ సంస్కృతం, హిందీతో పాటు ఇంగ్లిష్, జర్మన్, ఫ్రెంచి, జపనీస్, స్పానిష్ వంటి విదేశీ భాషలను నేర్పుతున్నారు. ఔత్సాహికులు తమకు అనువైన సమయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. గతేడాది ఇక్కడ విదేశీ భాషలు నేర్చుకునేందుకు నాలుగు వేల మందికిపైగా ఆసక్తి కనబరచడం విశేషం. ఫీజులు: విదేశీ భాషలు నేర్చుకునేందుకు స్థాయిలనుబట్టి (లెవెల్ 1, లెవెల్ 2..) ఫీజులు వసూలు చేస్తున్నారు. సంస్థను బట్టి ఈ ఫీజులు రూ.1200 నుంచి రూ.5 వేల వరకు ఉంటున్నాయి. జర్మన్, ఫ్రెంచ్ భాషలకు అధిక ఫీజులుంటున్నాయి. ప్రముఖ సంస్థలు: హైదరాబాద్‌లో ప్రధాన క్యాంపస్‌ను కలిగిన ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)కి.. విదేశీ భాషల కోర్సుల నిర్వహణలో మంచి పేరుంది. ఇఫ్లూ.. జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్, అరబిక్, ఫ్రెంచ్ వంటి భాషల కోర్సులను ఆఫర్ చేస్తోంది. బీఏ, ఎంఏ స్థాయిలో కోర్సులను అందిస్తోంది. రష్యన్, ఫ్రెంచ్ భాషల్లో పీహెచ్డీ కూడా ఉంది. వెబ్సైట్: www.efluniversity.ac.in రామకృష్ణమఠం: జర్మన్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్ భాషల తరగతులు నిర్వహిస్తోంది. వెబ్సైట్: www.rkmath.org గోథె జంత్రం (Goethe-zentrum): జర్మన్లో ఎక్స్టెన్షివ్, ఇంటెన్షివ్ తదితర కోర్సులను అందిస్తోంది. వెబ్సైట్: www.goethe.de అలియన్స్ ఫ్రాంచైజ్: ఫ్రెంచ్ భాషలో శిక్షణ ఇస్తోంది. వెబ్సైట్: www.alliancefranchise.org విదేశీభాషపై పట్టు సులభమే ఇతర భాషలను నేర్చుకోవటమంటే.. వారి సంస్కృతీ, సంప్రదాయాలను అర్థంచేసుకోవటమే. కేవలం ఉద్యోగావకాశాలకేకాకుండా.. ఆయా దేశాల ప్రజల జీవనవిధానం, ఆచార వ్యవహారాలు, చరిత్ర తెలుసుకునే గొప్ప అవకాశం. ఇఫ్లూలో యూజీ నుంచి పీహెచ్ డీ వరకూ కోర్సులున్నాయి. ఇవిగాకుండా బయటి విద్యార్థుల కోసం సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. వీటికి జనవరి-ఏప్రిల్, ఆగస్టు-నవంబరు నెలల్లో క్లాసులు ప్రారంభిస్తుంటాం. ప్రపంచీకరణ ప్రభావంతో విదేశీభాషలు నేర్చుకున్న వారికి ఉద్యోగ అవకాశాలకు ఢోకాలేదు. ఇఫ్లూలో బీఏ ఫైనలియర్లో ఉన్నప్పుడే ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. టెలిమార్కెటింగ్, బీపీవో, బ్యాంకింగ్, విదేశీ మంత్రిత్వశాఖ, దుబాసీలుగా మంచి అవకాశాలున్నాయి. ఫ్రెంచి, జర్మన్, స్పానిష్, అరబిక్, జపనీస్ భాషలకు మంచి క్రేజ్ ఉంది. వీటిలో ఫ్రెంచ్, జర్మన్లదే హవా అని చెప్పాలి. ఇంగ్లిషును తేలిగ్గా నేర్చుకునే ఇక్కడి విద్యార్థులు మరికొంత శ్రమిస్తే.. విదే శీభాషలు అలవోకగా నేర్చుకోవచ్చు. -వెంకటరెడ్డి, రిజిస్ట్రార్(ఇఫ్లూ) -
అప్పుల బాధతో అమ్మేస్తున్న దేశీయ కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విద్యుత్ ప్రాజెక్టులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని విదేశీ కంపెనీలు చక్కగా వినియోగించుకుంటున్నాయి. ఐదేళ్ల క్రితం భారీ అంచనాలతో ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసి చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులు వివిధ కారణాలతో మధ్యలో ఆగిపోవడంతో దేశీయ కంపెనీలకు గుదిబండగా తయారయ్యాయి. తగినంత ఇంధన సరఫరా లేకపోవడం, పర్యావరణ అనుమతులు వంటి అనేక కారణాలతో పలు ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. కొన్ని పూర్తయినా ఇంధన సరఫరా లేక పనిచేయడం లేదు. దీంతో అటు ఆదాయం లేక ఇటు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇన్ఫ్రా కంపెనీలు విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వైదొలగడానికి ఎదురు చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటూ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులను విదేశీ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. గత ఆరు నెలల్లోనే విదేశీ కంపెనీలు 5,391 మెగా వాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని కైవసం చేసుకున్నాయి. ఇందుకోసం అవి వ్యయం చేసింది కేవలం రూ.13,000 కోట్లు మాత్రమే. ఇందులో రాష్ట్రానికి చెందిన విద్యుత్ ప్రాజెక్టులే అధికంగా ఉండటం విశేషం. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వున్న గాయత్రీ ప్రాజెక్ట్స్, నాగార్జునా కన్స్ట్రక్షన్స్, మీనాక్షి ఇన్ఫ్రా కంపెనీలకు చెందిన ప్రాజెక్టుల్లో మెజార్టీ వాటాలను విదేశీ కంపెనీలు చేజిక్కించుకున్నాయి. అదే బాటలో జీఎంఆర్.. తాజాగా జీఎంఆర్ గ్రూపు మహారాష్ట్ర వరోరాలో నిర్మిస్తున్న 600 మెగావాట్ల జీఎంఆర్ ఎమ్కో ఎనర్జీలో 30 నుంచి 40 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉన్నట్లు మార్కెట్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. రూ.3,948 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 40 శాతం వాటాను రూ.1,500 కోట్లకు పైనే విక్రయించాలని చూస్తోంది. ఫ్రాన్స్‌కి చెందిన జీడీఎఫ్ సూజ్ ఈ వాటాను కొనడానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కాని ఈ వార్తలపై మాట్లాడటానికి కంపెనీ ప్రతినిధులు సిద్ధంగా లేరు. ఊహాగానాలపై తాము స్పందించలేమని పేర్కొన్నారు. ఆందోళనకర పరిణామమే... ఎంతో కీలకమైన విద్యుత్ ప్రాజెక్టులు ఇలా విదేశీ కంపెనీల చేతిలోకి వెళ్తుండటంపై ఆర్థిక వేత్తలు, కంపెనీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిపరిస్థితుల్లో తాము విద్యుత్ ప్రాజెక్టును విదేశీ కంపెనీకి విక్రయించాల్సి వచ్చిందని, కాని ఇదే పరిస్థితి కొనసాగితే మరో ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి దేశీయ పరిశ్రమ వెళుతుందేమోనన్న భయాన్ని ఒక ఇన్ఫ్రా కంపెనీ ప్రతినిధి వ్యక్తం చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కేవలం విద్యుత్ ప్రాజెక్టులనే కాకుండా వాటికి సరఫరా చేసే బొగ్గు, గ్యాస్ ఇంధన సరఫరా ఒప్పందాలను కూడా అవి దొడ్డిదారిన చేజిక్కించుకుంటున్నాయని, ఇందుకోసం ప్రాజెక్టు మొదలు పెట్టిన ప్రారంభ కంపెనీలకు మైనార్టీ వాటాలను ఉంచుతున్నాయన్నారు. జీడీఎఫ్ సూజ్కి మన దేశ విద్యుత్ ఉత్పత్తిలో (2.12 లక్షల మెగావాట్లు) సగానికిపైగా అంటే 1,16,00 మెగావాట్ల సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా ఉందని, ఇలాంటి కంపెనీల చేతిలోకి మన విద్యుత్ రంగం వెళితే ఇవి మన ప్రభుత్వాల మాట వినే అవకాశం ఉండదని మరో కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. విదేశీ కంపెనీల చేతిలోకి విద్యుత్ వ్యవస్థ వెళితే అవన్నీ ఒక జట్టుగా ఏర్పడి విద్యుత్ టారిఫ్‌లను పెంచే ప్రమాదం ఉందని ఆర్థికరంగ నిపుణులు డి.పాపారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రానున్న కాలంలో ఎదురయ్యే ప్రమాదాలకు సంకేతమని విద్యుత్ రంగ నిపుణులు కే.రఘు వ్యాఖ్యానించారు. -
ప్రభుత్వం ఇచ్చిన రూ. 1,241 కోట్ల రుణాలు రద్దు
ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన చిన్న రుణాలకు స్వస్తి హైదరాబాద్: చాలా ఏళ్ల క్రితం పలు ప్రభుత్వ, విదేశీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాల్లో రికవరీకాని, తిరిగి చెల్లించే అవకాశం లేని చిన్న రుణాలను రద్దు చేస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ రుణాల పంపిణీ సమస్యగా మారనుండడం, ఖాతాలను పూర్తిగా క్లియర్ చేయడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రుణాలు తీసుకున్నవాటిలో కొన్ని సంస్థలు ఇప్పుడు అస్తిత్వంలోనే లేకుండాపోగా.. కొన్ని సంస్థలు రుణాలను తీర్చే స్థితిలో లేవు. మరికొన్ని సంస్థలకు ఉమ్మడి రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లో సేవల కోసం ప్రభుత్వం రుణాలు ఇచ్చింది. ఈ రుణాలు తీర్చడానికి ఆ సంస్థలు ఇప్పుడు లేకపోయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం వాటి మంజూరు వివరాలు ఉన్నాయి. దీంతో పది లక్షల రూపాయల లోపు, పది లక్షల రూపాయలకుపైబడి మంజూరు చేసిన పలు రుణాలను రద్దు చేస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో చిత్రమేమిటంటే పాకిస్థాన్‌లోని నాలుగు సంస్థలకు, శ్రీలంక రాజధాని కొలంబో, బర్మాలోని ఒక్కో సంస్థకు కూడా కొన్నేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి రూపంలో రుణాలు ఇచ్చింది. ఇప్పుడు వాటిని కూడా రద్దు చేస్తూ ఆర్థిక శాఖ నిర్ణయించింది. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన ఓరియంట్ ఎయిర్వేస్ లిమిటెడ్‌కు రూ. 2.88 లక్షలు, మార్దన్కు చెందిన ఫ్రాంటియర్ సుగర్ మిల్స్ అండ్ డిస్టలరీస్ లిమిటెడ్‌కు రూ. 1.15 లక్షలు, పశ్చిమ పాకిస్థాన్ నిర్వాసితులకు రూ. 50.27 లక్షలు, తూర్పు పాకిస్థాన్ నిర్వాసితులకు రూ. 37.19 లక్షలు, బర్మా కాందిశీకులకు రూ. 1.22 కోట్లు, శ్రీలంకలోని కొలంబోకు చెందిన మారెసేవ కలుతార రబ్బర్ కంపెనీకి రూ. 0.21 లక్షలు రుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ రుణాలను రద్దు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 113 సంస్థలకు చెందిన పది లక్షల రూపాయలలోపు రుణాలు, 66 సంస్థలకు చెందిన పది లక్షల రూపాయలకుపైబడిన రుణాలు రద్దు చేసినవాటిలో ఉన్నాయి. మరో 25 సంస్థలకు మంజూరు చేసిన రుణాలను గ్రాంట్ల కిందకి మార్చుతూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఐఐసీ, ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్, ఏపీఎస్‌సి ఫైనాన్స్ కార్పొరేషన్లకు మంజూరు చేసిన రుణాలను ఆస్తుల కల్పన వ్యయం కిందికి మార్పు చేస్తూ ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద రూ. 1,241 కోట్ల రుణాలను రద్దు చేశారు. దీనికి అకౌంటెంట్ జనరల్ ఆమోదం కూడా తెలిపారు.