వాషింగ్టన్: ఐటీ తదితర కీలక రంగాలకు చెందిన విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో పని చేసెందుకు వీలు కలి్పంచే కీలకమైన హెచ్–1బీ వీసా ప్రోగ్రాంలో మార్పుచేర్పులను బైడెన్ సర్కారు ప్రతిపాదించింది. అర్హత ప్రమాణాలు తదితరాలను మరింత క్రమబద్ధం చేయడం, తద్వారా వీసా ప్రక్రియ సామర్థ్యాన్ని పెంచడం, ఎఫ్–1 స్టూడెంట్లకు, పారిశ్రామికవేత్తలకు, నాన్ ఇమ్మిగ్రెంట్ వర్కర్లకు మెరుగైన పరిస్థితులు కలి్పంచేందుకు ఈ మార్పులు దోహదపడతాయని చెబుతోంది. సదరు నిబంధనలను సోమవారం విడుదల చేయనున్నారు...
► ప్రస్తుత ప్రక్రియలో ఒక దరఖాస్తుదారు తరఫున ఎన్ని ఎక్కువ రిజి్రస్టేషన్లు నమోదయితే లాటరీలో ఎంపికయ్యే అవకాశాలు అంత పెరుగుతాయి.
► ప్రతిపాదిత విధానంలో ఒకరి తరఫున ఎన్ని రిజిస్ట్రేషన్లు నమోదైనా ఎంపిక ప్రక్రియలో ఒక ఎంట్రీగానే పరిగణిస్తారు.
► తద్వారా కొందరికే ఎక్కువ అడ్వాంటేజీకి బదులు అర్హులందరికీ సమానావకాశం దక్కుతుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది.
► ఈ ప్రతిపాదనలపై అందరూ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు వెల్లడించవచ్చని డీహెచ్‌ఎస్ పేర్కొంది.
► అమెరికా ఏటా విడుదల చేసే 60 వేల హెచ్–1బీ వీసా కోటాలో మార్పుండదు.
హెచ్–1బీ ప్రోగ్రాంలో మార్పులు
Published Sun, Oct 22 2023 5:58 AM | Last Updated on Sun, Oct 22 2023 5:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment