సోలార్ విద్యుత్తు టెండర్లలో పాల్గొనేందుకు దేశ విదేశీ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి.
సాక్షి, హైదరాబాద్: సోలార్ విద్యుత్తు టెండర్లలో పాల్గొనేందుకు దేశ విదేశీ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. 2000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు ఇటీవల టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ టెండర్లు పిలిచింది. శుక్రవారం హైదరాబాద్‌లోని సదరన్ డిస్కం కార్యాలయంలో నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి దాదాపు 300 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్‌ఆర్‌ఐలు సైతం సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. టీఎస్ జెన్‌కో చైర్మన్ డి.ప్రభాకర్‌రావు, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.