D.PRABHAKAR RAO
-
విద్యుత్ సంస్థల్లో ‘బినామీ’ ప్రకంపనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లోని కొంద రు అధికారులు తమ బంధువులు, మిత్రుల పేర్లతో బినామీ కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి కాంట్రాక్టు వ్యాపారం చేస్తున్న వైనం రాష్ట్ర ప్రభుత్వం, అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బుధవారం ‘సాక్షి’ప్రధాన సంచికలో ‘పనీ మాదే.. పైసా మాదే’శీర్షికతో ప్రచురించిన కథనం అధికారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తక్షణమే స్పం దించిన తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు.. బినామీ పేర్లతో కాంట్రా క్టు వ్యాపారం చేస్తున్న విద్యుత్ అధికారులపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డిని ఆదేశించారు. విద్యుత్ ఉద్యోగులుగా పని చేస్తూ సంస్థతోనే కాంట్రా క్టు వ్యాపారాలు చేయడం సరికాదని ప్రభాకర్‌రావు తప్పుబట్టారు. టెండర్ నిబంధనల ప్రకారం ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో కాంట్రాక్టు పనులు చేపట్టడం అక్రమమని పేర్కొన్నారు. ‘సాక్షి’ ప్రచురించిన పరిశోధన్మాతక కథనం బాగుందని, ఎంతో మంది విద్యుత్ ఉద్యోగులకు కనువిప్పు కలిగించిందని ప్రశంసించారు. బినామీల పేర్లతో కాంట్రాక్టులు నిర్వహిస్తున్నారని దర్యాప్తులో తేలితే నిబంధనల ప్రకారం సంబంధిత పనులను రద్దు చేసి బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. -
పొరుగు రాష్ట్రాలకు గంటలోనే విద్యుత్
► విద్యుత్ ఇచ్చిపుచ్చుకునే సరికొత్త విధానానికి రూపకల్పన ► ఎస్ఆర్పీసీ ముసాయిదాపై దక్షిణాది రాష్ట్రాల ఏకాభిప్రాయం సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల మధ్య విద్యుత్ ఇచ్చిపుచ్చుకునేందుకు సరికొత్త విధానం అనుసరించే విషయంలో భాగస్వా మ్య రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి విద్యుత్ అవసరం ఉన్నా, గంటలోపు పక్క రాష్ట్రాల నుంచి పొందే లా ఈ విధానానికి రూపకల్పన చేశారు. ఇది అమల్లోకి వస్తే ఎలాంటి జాప్యానికి అవకాశం లేకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాలకు విద్యుత్ ఇచ్చిపుచ్చుకునే వెసులుబాటు కలుగుతుంది. త్వరలో దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకోనున్నా యి. దక్షిణ భారత రాష్ట్రాల విద్యుత్ కమిటీ (ఎస్ఆర్పీసీ) అధ్యక్షుడు, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు అధ్యక్షతన కేరళ రాజధాని తిరువనంతపురంలో సోమ, మంగళ వారాల్లో కమిటీ సమావేశాలు జరిగాయి. గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల మధ్య సరళమైన విద్యుత్ విధానానికి సంబంధించి ప్రాథమిక చర్చలు జరిగాయి. ఆ సమావేశాల్లోనే ఎస్ఆర్పీసీ సభ్య కార్యదర్శి ఎస్ఆర్ భట్ నేతృత్వంలో కమిటీని నియమించారు. కొత్త విధానానికి సంబంధిం చి ఈ కమిటీ ముసాయిదాను తయారు చేసి తిరువనంతపురం సమావేశంలో ప్రవేశపెట్టిం ది. దీనిపై రెండు రోజులు చర్చ జరిగింది. ప్రభాకర్‌రావుతో పాటు సభ్య కార్యదర్శి ఎస్ఆర్ భట్, కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు సీఎండీ కె.ఎలంగోవన్, కర్ణాటక ట్రాన్స్‌కో ఎండీ జావేద్ అక్తర్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విద్యావంతుల, తమిళనాడు ట్రాన్స్‌కో ఎండీ ఎస్.షణ్ముగం, టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు చర్చలో పాల్గొని ముసాయిదాకు ఆమోదం తెలిపారు. ప్రభాకర్‌రావు ఈ విధా నాన్ని ప్రతిపాదించడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య ఏకాభిప్రా యం కుదుర్చడానికి చేసిన ప్రయత్నం ఫలించడంతో ఈ ముందడుగు పడిందని ట్రాన్స్‌కో అధికార వర్గాలు తెలిపాయి. ముసాయిదా సారాంశం... దక్షిణ భారతదేశ పరిధిలోని పొరుగు రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ అవసరం ఉన్నా.. మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రం నుంచి పొందవచ్చని ముసాయిదాలో పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా విషయాల్లో పరస్ప రం సహకరించుకోవాలని కూడా నిర్ణయిం చారు. ప్రస్తుతం విద్యుత్ కొనుగోళ్లన్నీ పవర్ ఎక్సే్చంజ్ ద్వారానే జరగాలి. ఈ విధానం వల్ల క్రయవిక్రయాల్లో జాప్యం జరుగుతోంది. ఈ విధానం వల్ల ఒకరోజు ముందుగానే సమాచా రం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరోజు ముందే అంచనా వేయడం వల్ల అది వాస్తవ పరిస్థితికి తగ్గట్టు ఉండటం లేదు. ఈ పరిస్థితిని నివారిం చడానికి దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు గంట వ్యవధిలోనే పక్క రాష్ట్రం నుంచి విద్యుత్ పొందవచ్చు. క్రయ విక్రయాలకు సంబంధించి ప్రతిసారీ ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధానం వల్ల ఏ రోజు డిమాండ్‌ను ఆ రోజే అంచనా వేసి విద్యుత్‌ను పొందడమో, అందివ్వడమో చేయొచ్చు. దీని వల్ల మిగులు విద్యుత్ రాష్ట్రాలకు, లోటు విద్యుత్ రాష్ట్రాలకు మేలు కలుగుతుంది. ఎవరికి విద్యుత్ కావాల న్నా, ఎవరు విద్యుత్ ఇవ్వాలనుకున్నా ఈ సమాచారాన్ని సదరన్ లోడ్ డిస్పాచింగ్ సెంటర్‌కు సమాచారం అందివ్వాలి. దక్షిణాది రాష్ట్రాల మధ్య విద్యుత్ ఇచ్చిపుచ్చుకోవడం సదరన్ లోడ్ డిస్పాచింగ్ సెంటర్ ద్వారానే జరుగుతాయి. ఈ ముసాయిదాను సభ్య రాష్ట్రాలు రెండు రోజులు చర్చించాయి. త్వరలోనే ఈ విధానం అమలుకు విధివిధా నాలు రూపొందించుకోవాలని, ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించాయి. -
ఎత్తిపోతలకు 11,500 మెగావాట్ల విద్యుత్
► ప్రణాళిక సిద్ధం చేసిన ట్రాన్స్‌కో ► విద్యుత్ శాఖలో కొత్తగా లిఫ్ట్ ఇరిగేషన్ విభాగం ► లిఫ్ట్‌లకు ప్రపంచంలోనే భారీ సామర్థ్యపు మోటార్లు ► సీఎంకు నివేదిక అందించిన ట్రాన్స్‌కో సీఎండీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల(లిఫ్ట్) ప్రాజెక్టులకు విద్యుత్‌ను అందించేందుకు తెలంగాణ ట్రాన్స్‌కో ప్రణాళికను సిద్ధం చేసింది. దీనిపై ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు శుక్రవారం సీఎం కేసీఆర్‌కు సమగ్ర కార్యాచరణ నివేదికను అందించారు. 2020 నాటికి వ్యవసాయానికి కావాల్సిన విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు, దాన్ని నిరాటం కంగా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. నివేదికలో ప్రస్తావిం చిన ముఖ్యాంశాలు ఇవీ.. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలో అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు కలిపి 11,500 మెగావాట్ల విద్యుత్ అవసరమని ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఈ మేరకు విద్యుత్‌ను సమకూర్చాల్సిందిగా తెలంగాణ జెన్కోను కోరింది. ట్రాన్స్‌కోలో ఎత్తిపోతల విభాగం గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ట్రాన్స్‌కో తన సంస్థలో మొదటిసారిగా లిఫ్ట్ ఇరిగేషన్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. డైరెక్టర్, ఇద్దరు సీఈలతో పాటు అవసరమైన సిబ్బందిని నియమించి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు విద్యుత్‌ను ఇచ్చే పనులను పర్యవేక్షిస్తోంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం లిఫ్ట్‌ల కు 11,500 మెగావాట్ల విద్యుత్ కావాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 400 కేవీ సబ్ స్టేషన్లు పది, 220 కేవీ సబ్ స్టేషన్లు ఇరవై నాలుగు, 132 కేవీ సబ్ స్టేషన్లు 25, వీటికి ప్రత్యేకంగా లైన్లు కావాలని అంచనా వేసింది. దీనికి రూ.6వేల కోట్లు ఖర్చవుతుందని లెక్క గట్టింది. ఈ ఖర్చును నీటిపారుదల శాఖ భరిస్తుంది. నిర్మాణం, నిర్వహణ ట్రాన్స్‌కో బాధ్యత. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన తర్వాత లిఫ్ట్‌ల నిర్వహణకు ఏటా రూ.10 వేల కోట్ల కరెంటు బిల్లు వస్తుందని అంచనా వేసింది. ఈ బిల్లును ఇరిగేషన్ శాఖ చెల్లిస్తుందని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. భారీ సామర్థ్యంతో లిఫ్ట్ మోటార్లు రాష్ట్రంలో లిఫ్ట్‌లకు అత్యధిక సామర్థ్యం కలిగిన మోటార్లు వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు గరిష్టంగా 139 మెగావాట్ల ఇంజన్లు వినియోగించనున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇంతటి సామర్థ్యం కలిగిన ఇంజన్లు వాడడం లేదు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం ఆస్ట్రియా వెళ్లి వచ్చింది. ప్రభుత్వరంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్కు మోటార్ల తయారీ బాధ్యత అప్పగించారు. వచ్చే ఏడాది మేడిగడ్డ పంప్‌హౌస్ నుంచి నీటిని లిఫ్ట్ చేసేందుకు మోటార్లు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్ర చరిత్రలో గరిష్టంగా 30 మెగావాట్ల సామర్థ్యమున్న మోటార్లను కల్వకుర్తి లిఫ్ట్‌లకు వాడుతున్నారు. కాళేశ్వరం నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయాలనే లక్ష్యంతో భారీ సామర్థ్యంగల మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. రామగుడు దగ్గర 139 మెగావాట్ల సామర్థ్యమున్న మోటార్ 120 మీటర్ల ఎత్తులో 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తుంది. చంద్లాపూర్ వద్ద 134, మేడారం వద్ద 124, తిప్పాపూర్ వద్ద 106 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మోటార్లు మూడు వేలకు పైగా క్యూసెక్కుల సామర్థ్యంతో వంద మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేస్తాయి. 400 నుంచి 11,500 మెగావాట్ల వరకు.. రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో లిఫ్ట్‌లకు 400 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఉండేది. ప్రస్తుతం కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, బీమా, భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములతో పాటు అన్ని లిఫ్ట్‌లకు కలిపి 1,263 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు 4,600, పాలమూరు ప్రాజెక్ట్‌కు 4,000, సీతారామ ప్రాజెక్ట్‌కు 690 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఇతర చిన్న లిఫ్ట్‌ల అవసరాన్ని సైతం కలిపితే మొత్తం 11,500 మెగావాట్ల విద్యుత్ కావాలి. వచ్చే రబీ నుంచి వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు 7 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. అప్పటికి రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కూడా 27 వేల మెగావాట్లకు చేరుతుందని ట్రాన్స్‌కో అంచనా వేసింది. -
సోలార్ టెండర్లకు విదేశీ కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: సోలార్ విద్యుత్తు టెండర్లలో పాల్గొనేందుకు దేశ విదేశీ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. 2000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు ఇటీవల టీఎస్ఎస్పీడీసీఎల్ టెండర్లు పిలిచింది. శుక్రవారం హైదరాబాద్‌లోని సదరన్ డిస్కం కార్యాలయంలో నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి దాదాపు 300 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్ఆర్ఐలు సైతం సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. టీఎస్ జెన్కో చైర్మన్ డి.ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. -
కొత్త విద్యుత్‌ప్లాంట్లపై కోటి ఆశలు
సత్వర వెలుగునిచ్చే ప్రాజెక్టుల్లో పెట్టుబడి కేటీపీపీ రెండోదశ పూర్తికి రూ.300 కోట్లు కొత్తగూడెం కొత్త ప్లాంట్‌కు రూ.300 కోట్లు బీహెచ్ఈఎల్ ప్రాజెక్టులకు రూ.400 కోట్లు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంక్షోభం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని గట్టెంక్కించేందుకు వచ్చే డిసెంబర్ నాటికి పూర్తయ్యే ప్రాజెక్టులకు సర్కార్ మొదటి ప్రాధాన్యమివ్వనుంది. ఇందుకోసం కొత్త కేంద్రాలపైనే ఆశలు పెట్టుకుంది. తెలంగా ణ జెన్కో సారథ్యంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు, బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకున్న థర్మల్ప్లాంట్లను శరవేగంగా పూర్తి చేయడంపై దృష్టి కేంద్రీకరిం చింది. బడ్జెట్లో టీఎస్ జెన్కోలో పెట్టుబడికి నిర్దేశించిన రూ.1000 కోట్లను ఈ కొత్తప్లాంట్ల కోసం ఖర్చు చేయనుంది. భూపాలపల్లిలో నిర్మాణంలో ఉన్న 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ ప్రాజెక్టు రెండో దశకు రూ. 300 కోట్లు, కొత్తగూడెం థర్మల్ ప్లాంట్ ఏడోదశలో తలపెట్టిన 800 మెగావాట్ల ప్రాజెక్టుకు మరో రూ. 300 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించింది. మిగతా రూ. 400 కోట్లను బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకునే థర్మల్ ప్రాజెక్టులకు కేటాయించనుంది. 2012లోనే పూర్తికావాల్సింది.. భూపాలపల్లి ప్లాంట్‌కు ఆర్ఈసీ రూ.2170 కోట్ల రుణం మంజూరీ చేసింది. గత నెలాఖరు వరకే దాదాపు రూ.2565 కోట్లు దీనికి ఖర్చయినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2009 ఫిబ్రవరిలో ఈ ప్లాంట్ పని ప్రారంభమైంది. ఒప్పందం ప్రకారం 2012లోనే పూర్తి కావాలి. కాంట్రాక్టర్ల జాప్యంతో రెండేళ్లు ఆలస్యమైంది. అంతేకాక గతనెలలో భారీయంత్రాలు అమర్చే క్రేన్ విరగడంతో బాయిలర్ నిర్మాణం మధ్యలో ఆగింది. దీంతో నెలరోజులు పనులన్నీ నిలిచిపోయాయి. ఇటీవలే టీఎస్జెన్కో ఛైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకరరావు అక్కడికివెళ్లి పనుల పురోగతిని పరిశీలించారు. ఆగస్టు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. దీంతో పాటు మణుగూరులో 1080 మెగావాట్ల (2704 యూనిట్లు) థర్మల్ విద్యుత్కేంద్ర నిర్మాణంపై జెన్కో దృష్టి సారించింది. దీనిని ఈపీసీ విధానంలో బీహెచ్ఈఎల్ కంపెనీకి అప్పగించనుంది. మణుగూరులో 1031.19 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి మూడేళ్ల సమయం పడుతుంది. అయితే, 270 మెగావాట్ల ఉత్పత్తికి అవసరమయ్యే టర్బైన్లు, జనరేటర్లు బీహెచ్ఈఎల్ దగ్గర అందుబాటులో ఉండడంతో రెం డేళ్ల వ్యవధిలోనే పూర్తిచేసేందుకు అంగీకారం కుదిరిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక కొత్తగూడెం థర్మల్ పవర్‌ప్లాంట్‌లో 800 మెగావాట్ల కేంద్రాన్ని మూడేళ్లలో పూర్తి చేసేందుకు జెన్కో ఏర్పాట్లు చేస్తోంది. వీటికితోడు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న జల విద్యుత్కేంద్రాలు వచ్చే ఏడాది చివరినాటికి ఉత్పత్తిచేసే దశకు చేరుకుంటాయని అధికారులు అంచనా వేశారు. లోయర్ జూరాల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ద్వారా 240 మెగావాట్లు (640), పులిచింతల ప్రాజెక్టు ద్వారా 120 మెగావాట్లు (430) ఉత్పత్తి చేసే యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి 70 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. డిసెంబర్ 15 వరకు ఈ యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉంటుందని జెన్కో అంచనా వేసింది. -
జెన్కోను బలిపశువు చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ఆర్థిక భారాన్ని జెన్కోపై మోపడం ద్వారా ఆ సంస్థను బలిపశువు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిస్కంల నుంచి తమకు రావాల్సిన రూ.4 వేల కోట్ల బకాయిలను మాఫీ చేయడం సరికాదని జెన్కో వాదిస్తోంది. ఈ మేరకు జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ (జేఎండీ) డి.ప్రభాకర్‌రావు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సుమారు 8 పేజీల లేఖను ఇటీవల అందజేసినట్టు సమాచారం. విద్యుత్ సరఫరా పొందినందుకుగానూ డిస్కంలు సుమారు రూ.4 వేల కోట్లు డిస్కంలకు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ బకాయిలను మాఫీ చేయాలని జెన్కోపై ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జెన్కో చైర్మన్ కూడా అయిన మృత్యుంజయ్ సాహు ఒత్తిడి చేస్తున్నారు. వాస్తవానికి అదనపు విద్యుత్ కొనుగోలు చేసినందుకుగానూ డిస్కంలకు ప్రభుత్వం రూ.6 వేల కోట్ల మేరకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఈ మొత్తాన్ని డిస్కంలకు చెల్లిస్తే... అందులో రూ.4 వేల కోట్లను జెన్కోకు డిస్కంలు చెల్లించే అవకాశం ఉంది. కానీ డిస్కంలకు రూ.6 వేల కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలోనే జెన్కో బకాయిలకు ఎగనామం పెట్టే ప్రక్రియకు తెర తీసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ బకాయిలను మాఫీ చేస్తే జెన్కో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి పడుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కానీ ఈ విషయంలో సాహు గట్టిపట్టుదలతో వ్యవహరిస్తున్నారు. అప్పటివరకు 2012-13 ఆర్థిక సంవత్సరపు ఫలితాలను ఆడిట్ నిమిత్తం అకౌంటెంట్ జనరల్ (ఏజీ)కి పంపించవద్దని భీష్మించుకు కూర్చున్నారు. ఈ సమస్య కారణంగా ఇప్పటివరకు 2012-13 ఆర్థిక సంవత్సరపు ఆర్థిక ఫలితాలను జెన్కో ప్రకటించలేదు. కంపెనీల చట్టం 1956లోని సెక్షన్ 213 (3) ప్రకారం ఆర్థిక సంవత్సరం ముగిసిన ఆరునెలల్లోగా ఫలితాలను ప్రకటించాలి. అంటే 2013 ఏప్రిల్‌తో ముగిసిన 2012-13 ఆర్థిక సంవత్సరపు ఫలితాలను సెప్టెంబర్ చివరినాటికి ప్రకటించాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియ జరగలేదు. సెప్టెంబర్ చివరినాటికి ఆర్థిక ఫలితాలను ఏజీ క్లియర్ చేయకపోతే... రుణాలు పొందేందుకు సమస్యలు తలెత్తుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే జెన్కో చేపడుతున్న పలు విద్యుత్ ప్లాంట్లకు నిధుల సమీకరణ సమస్యగా మారుతుందని... ఫలితంగా విద్యుత్ ప్లాంట్ల విస్తరణకు బ్రేక్ పడుతుందని జేఎండీ ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.