పొరుగు రాష్ట్రాలకు గంటలోనే విద్యుత్‌ | Electricity within hour of neighboring states | Sakshi
Sakshi News home page

పొరుగు రాష్ట్రాలకు గంటలోనే విద్యుత్‌

Published Wed, Aug 23 2017 1:41 AM | Last Updated on Sun, Sep 17 2017 5:51 PM

పొరుగు రాష్ట్రాలకు గంటలోనే విద్యుత్‌

పొరుగు రాష్ట్రాలకు గంటలోనే విద్యుత్‌

► విద్యుత్‌ ఇచ్చిపుచ్చుకునే సరికొత్త విధానానికి రూపకల్పన
► ఎస్‌ఆర్‌పీసీ ముసాయిదాపై దక్షిణాది రాష్ట్రాల ఏకాభిప్రాయం


సాక్షి, హైదరాబాద్‌: దక్షిణాది రాష్ట్రాల మధ్య విద్యుత్‌ ఇచ్చిపుచ్చుకునేందుకు సరికొత్త విధానం అనుసరించే విషయంలో భాగస్వా మ్య రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి విద్యుత్‌ అవసరం ఉన్నా, గంటలోపు పక్క రాష్ట్రాల నుంచి పొందే లా ఈ విధానానికి రూపకల్పన చేశారు. ఇది అమల్లోకి వస్తే ఎలాంటి జాప్యానికి అవకాశం లేకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాలకు విద్యుత్‌ ఇచ్చిపుచ్చుకునే వెసులుబాటు కలుగుతుంది. త్వరలో దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలు ఒప్పందం కుదుర్చుకోనున్నా యి.

దక్షిణ భారత రాష్ట్రాల విద్యుత్‌ కమిటీ (ఎస్‌ఆర్‌పీసీ) అధ్యక్షుడు, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు అధ్యక్షతన కేరళ రాజధాని తిరువనంతపురంలో సోమ, మంగళ వారాల్లో కమిటీ సమావేశాలు జరిగాయి. గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల మధ్య సరళమైన విద్యుత్‌ విధానానికి సంబంధించి ప్రాథమిక చర్చలు జరిగాయి. ఆ సమావేశాల్లోనే ఎస్‌ఆర్‌పీసీ సభ్య కార్యదర్శి ఎస్‌ఆర్‌ భట్‌ నేతృత్వంలో కమిటీని నియమించారు. కొత్త విధానానికి సంబంధిం చి ఈ కమిటీ ముసాయిదాను తయారు చేసి తిరువనంతపురం సమావేశంలో ప్రవేశపెట్టిం ది. దీనిపై రెండు రోజులు చర్చ జరిగింది.

ప్రభాకర్‌రావుతో పాటు సభ్య కార్యదర్శి ఎస్‌ఆర్‌ భట్, కేరళ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు సీఎండీ కె.ఎలంగోవన్, కర్ణాటక ట్రాన్స్‌కో ఎండీ జావేద్‌ అక్తర్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విద్యావంతుల, తమిళనాడు ట్రాన్స్‌కో ఎండీ ఎస్‌.షణ్ముగం, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావు చర్చలో పాల్గొని ముసాయిదాకు ఆమోదం తెలిపారు. ప్రభాకర్‌రావు ఈ విధా నాన్ని ప్రతిపాదించడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల మధ్య ఏకాభిప్రా యం కుదుర్చడానికి చేసిన ప్రయత్నం ఫలించడంతో ఈ ముందడుగు పడిందని ట్రాన్స్‌కో అధికార వర్గాలు తెలిపాయి.

ముసాయిదా సారాంశం...
దక్షిణ భారతదేశ పరిధిలోని పొరుగు రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్‌ అవసరం ఉన్నా.. మిగులు విద్యుత్‌ కలిగిన రాష్ట్రం నుంచి పొందవచ్చని ముసాయిదాలో పేర్కొన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా విషయాల్లో పరస్ప రం సహకరించుకోవాలని కూడా నిర్ణయిం చారు. ప్రస్తుతం విద్యుత్‌ కొనుగోళ్లన్నీ పవర్‌ ఎక్సే్చంజ్‌ ద్వారానే జరగాలి. ఈ విధానం వల్ల క్రయవిక్రయాల్లో జాప్యం జరుగుతోంది. ఈ విధానం వల్ల ఒకరోజు ముందుగానే సమాచా రం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరోజు ముందే అంచనా వేయడం వల్ల అది వాస్తవ పరిస్థితికి తగ్గట్టు ఉండటం లేదు.

ఈ పరిస్థితిని నివారిం చడానికి దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు గంట వ్యవధిలోనే పక్క రాష్ట్రం నుంచి విద్యుత్‌ పొందవచ్చు. క్రయ విక్రయాలకు సంబంధించి ప్రతిసారీ ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధానం వల్ల ఏ రోజు డిమాండ్‌ను ఆ రోజే అంచనా వేసి విద్యుత్‌ను పొందడమో, అందివ్వడమో చేయొచ్చు. దీని వల్ల మిగులు విద్యుత్‌ రాష్ట్రాలకు, లోటు విద్యుత్‌ రాష్ట్రాలకు మేలు కలుగుతుంది. ఎవరికి విద్యుత్‌ కావాల న్నా, ఎవరు విద్యుత్‌ ఇవ్వాలనుకున్నా ఈ సమాచారాన్ని సదరన్‌ లోడ్‌ డిస్పాచింగ్‌ సెంటర్‌కు సమాచారం అందివ్వాలి. దక్షిణాది రాష్ట్రాల మధ్య విద్యుత్‌ ఇచ్చిపుచ్చుకోవడం సదరన్‌ లోడ్‌ డిస్పాచింగ్‌ సెంటర్‌ ద్వారానే జరుగుతాయి. ఈ ముసాయిదాను సభ్య రాష్ట్రాలు రెండు రోజులు చర్చించాయి. త్వరలోనే ఈ విధానం అమలుకు విధివిధా నాలు రూపొందించుకోవాలని, ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement