టేస్టీ..యమ్మీ!.. విదేశాల్లో మన మామిడికి ఫుల్‌ డిమాండ్‌ | Srikakulam Mangoes Huge Demand In Foreign Countries | Sakshi
Sakshi News home page

టేస్టీ..యమ్మీ!.. విదేశాల్లో మన మామిడికి ఫుల్‌ డిమాండ్‌

Published Tue, May 31 2022 3:40 PM | Last Updated on Tue, May 31 2022 5:45 PM

Srikakulam Mangoes Huge Demand In Foreign Countries - Sakshi

సాక్షి,జి సిగడాం(శ్రీకాకుళం): సింగపూర్, దుబాయ్, స్విట్జర్లాండ్, అమెరికా వంటి దేశాల్లో సిక్కోలు మామిడికి మంచి గిరాకీ ఉందన్న సంగతి తెలుసా..? ఆశ్చర్యంగా అని పించినా ఇదే నిజం. జిల్లాలోని గంగువారి సిగడాం మండలం వెలగాడ పంచాయతీ చంద్రయ్యపేట గ్రామం నుంచి ఏటా మామిడిని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ గ్రామంలో సుమారు 100 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఇక్కడ వివిధ రకాల మామిడి కాయలు పండించడంతో ఈ కాయలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

హిమాపసల్‌ అంటే మహా ఇష్టం
ఈ గ్రామంలోని తోట నుంచి హిమాపసల్‌ మామిడి కాయలను సింగపూర్, దుబాయి, స్విట్జర్లాండ్, అ మెరికా దేశాలకు తరచూ ఎగుమతి చేస్తారు. అలాగే మనదేశంలోని తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకూ ఈ మామిడిని తరలిస్తారు. అక్కడ కాయ రూ.50 నుంచి రూ.75 వరకు పలుకుతుంది. వందకాయలు దాదాపు రూ.7వేల వరకు విక్రయిస్తారు. ఈ రకం మామిడి సువాసన కిలోమీటర్‌ వరకు వ్యాపిస్తుందని చెబుతుంటారు. రుచి కూడా అమోఘం. కాయ సుమారుగా ఐదువందల గ్రాముల బరువు ఉంటుంది.  

60 ఎకరాల్లో హిమాపసల్‌.. 
ఈ ఏడాది హిమాపసల్‌ మామిడి కాయ దిగుబడి తగ్గింది. ఉన్న మేర ఎగుమతి చేశాం. ఈ తోటలో 60 ఎకరాల్లో హిమపసల్‌ చెట్లు ఉన్నాయి. 
– ఎస్‌ కృష్ణ, కౌలు రైతు

చదవండి: మెట్రో రైలులో యువతి ‘జిగల్‌’ డ్యాన్స్‌.. సోషల్‌ మీడియా షేక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement