Trade Center
-
Narendra Modi: నా మూడో ఇన్నింగ్స్ పక్కా!
సూరత్: ప్రధానమంత్రిగా తన మూడో ఇన్నింగ్స్‌లో మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తద్వారా తాను వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికవుతానని పరోక్షంగా తేలి్చచెప్పారు. గుజరాత్‌లోని సూరత్ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య సముదాయంగా అభివృద్ధి చేసిన ‘సూరత్ డైమండ్ బోర్స్’ భవనాన్ని ఆయన ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ వాణిజ్య కేంద్రం నూతన భారతదేశ బలానికి, అంకితభావానికి ఒక ప్రతీక అని చెప్పారు. సూరత్ వజ్రాల పరిశ్రమ 8 లక్షల మందికి ఉపాధి కలి్పస్తోందని ప్రశంసించారు. కొత్త వాణిజ్య సముదాయంతో మరో 1.5 లక్షల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. సూరత్ కీర్తికిరీటంలో మరో వజ్రం చేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఇది చిన్న వజ్రం కాదని, ప్రపంచంలోనే అత్యుత్తమమైన వజ్రమని వ్యాఖ్యానించారు. దీని వెలుగుజిలుగుల ముందు ప్రపంచంలోనే పెద్దపెద్ద భవనాలు కూడా వెలవెలబోతాయని అన్నారు. ప్రపంచంలో వజ్రాల పరిశ్రమ గురించి ఎవరూ మాట్లాడుకున్నా ఇకపై సూరత్‌ను ప్రస్తావించాల్సిందేనని చెప్పారు. సూరత్ భాగస్వామ్యం పెరగాలి వచ్చే 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలకు ప్రభుత్వం నిర్దేశించుకుందని మోదీ చెప్పారు. దేశాన్ని దాదాపు 10 ట్రిలియన్ డాలర్ల(10 లక్షల కోట్ల డాలర్లు) ఆర్థిక వ్యవస్థగా మార్చడంతోపాటు ఎగుమతుల్లో కొత్త రికార్డులు సృష్టించాలన్నదే తమ ధ్యేయమని వివరించారు. దేశం నుంచి ఎగుమతుల విషయంలో సూరత్ సిటీ భాగస్వామ్యం మరింత పెరగాలని పిలుపునిచ్చారు. వజ్రాలు, ఆభరణాల పరిశ్రమకు ఇదొక గొప్ప అవకాశమని అన్నారు. భారత్ వైపు ప్రపంచ దేశాల చూపు నేడు ప్రపంచ దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఎన్నో అంశాల్లో మనపై ఆధారపడుతున్నాయని, మన దేశ పేరు ప్రతిష్టలు పెరిగాయని, మేడిన్ ఇండియా ఇప్పుడు బలమైన బ్రాండ్‌గా మారిందన్నారు. లక్షలాది మంది యువతకు సూరత్ డ్రీమ్ సిటీగా మారిందని, ఇక్కడ ఐటీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆనందం వ్యక్తం చేశారు. సూరత్ ఎయిర్‌పోర్టులో నూతన ఇంటిగ్రేటెడ్ టెరి్మనల్ బిల్డింగ్‌ను మోదీ ఆదివారం ప్రారంభించారు. -
భారత్‌లో 53 చైనా కంపెనీల వ్యాపార కేంద్రాలు
న్యూఢిల్లీ: చైనాకు చెందిన 53 విదేశీ కంపెనీలు భారత్‌లో వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నట్టు కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లడించింది. యాప్ ద్వారా రుణాలు ఇచ్చే విషయమై ఇవి ఎలాంటి డేటాను నిర్వహించడం లేదని తెలిపింది. విదేశీ కంపెనీ (భారత్‌కు వెలుపల ఏర్పాటైనది) దేశంలో వ్యాపార కేంద్రాలు తెరుచుకోవచ్చు. కాకపోతే ఇందుకు సంబంధించి ఆర్బీఐ, ఇతర నియతంణ్ర సంస్థల నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. భారత్‌లో అటువంటి కేంద్రం తెరిచిన 30 రోజుల్లోపు రిజి్రస్టార్ ఆఫ్ కంపెనీస్ వద్ద రిజి్రస్టేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ అంశంపై బదులిచ్చారు. చట్టం పరిధిలో షెల్ కంపెనీలకు సంబంధించి ఎలాంటి నిర్వచనం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 7,700 కంపెనీల మూత సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ యాక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ (సీపేస్)ను ఈ ఏడాది మేలో ఏర్పాటు చేసిన తర్వాత నుంచి, దీని కింద 7,700 కంపెనీలు వ్యాపార కార్యకలాపాలను నిలిపివేసినట్టు లోక్‌సభకు రావు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. స్వచ్చందంగా వ్యాపార కార్యకలాపాల నుంచి తప్పుకోవాలనుకునే కంపెనీలకు, దాన్ని వేగవంతంగా సాకారం చేసేందుకు ఈ ఏడాది మే 1 నుంచి సీపేస్‌ను కార్పొరేట్ శాఖ తీసుకొచి్చంది. దీంతో ఒక కంపెనీ స్వచ్చంద మూసివేతకు పట్టే సమయం 110 రోజులకు తగ్గిపోయింది. -
నాలుగేళ్లలో ఎగుమతులు డబుల్
♦ ఎక్స్పోర్ట్ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ♦ ప్రస్తుత వార్షిక ఎగుమతులు రూ.లక్ష కోట్లు ♦ డ్రైపోర్టులు, జలమార్గాల అభివృద్ధిపై దృష్టి ♦ ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: సరుకుల ఎగుమతులను వచ్చే నాలుగేళ్లలో రెండింతలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఏటా రూ.లక్ష కోట్ల విలువ చేసే ఎగుమతులు జరుగుతుండగా.. 2019-20 నాటికి రూ.2 లక్షల కోట్లకు చేర్చాలని నిర్ణయించింది. నూతన పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్ ద్వారా ఇప్పటికే రూ.25 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతోపాటు ఫార్మాసిటీ, నిమ్జ్, మెడికల్ డివెజైస్, టెక్స్టైల్, సుగంధ ద్రవ్యాల పార్కుల వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పురుడు పోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎగుమతులను ప్రోత్సహించేలా నూతన విధానంలో పొందుపరచాల్సిన విధివిధానాలపై కసరత్తు చేస్తోంది. ఎగుమతులపరంగా రాష్ట్రవాటా 1.93 శాతం కాగా.. దేశంలో 12వ స్థానంలో వుంది. రాష్ట్రం నుంచి ప్రధానంగా ఫార్మా, బల్క్‌డ్రగ్, వ్యవసాయ, సాగు ఆధారిత ఉత్పత్తులు, యంత్ర సామగ్రి, చేనేత, వస్త్ర, హస్త కళా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. వీటితోపాటు కార్పెట్లు, వజ్రాభరణాలు, రక్షణ, ఏరోస్పేస్ ఉత్పత్తులు.. గ్రానైట్, బెరైటీస్, ఫెల్స్పార్, క్వార్ట్జ్ తదితర ముడి ఖనిజాలు ఎగుమతి అవుతున్నాయి. నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా లైఫ్‌సెన్సైస్, ఐటీ, హార్డ్‌వేర్, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, చేనేత, వస్త్ర పరిశ్రమ.. తదితర 14 ప్రధాన రంగాలకు పరిశ్రమల శాఖ ప్రత్యేక పాలసీలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఎగుమతుల విధానం రూపకల్పనకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పరిశ్రమల శాఖ కార్యదర్శిని ఎగుమతుల కమిషనర్‌గా నియమిస్తూ.. పాలసీ విధి విధానాలు రూపొందించే బాధ్యత అప్పగించింది. మరోవైపు దీనిపై సూచనలు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది. డ్రైపోర్టులు.. జల మార్గాలు రాష్ట్రం చుట్టూ భూభాగం ఆవరించి ఉండటంతో నూతన విధానంలో డ్రైపోర్టుల ఏర్పాటును ప్రతిపాదిస్తూ.. సాధ్యాసాధ్యాలపై నివేదిక కోరారు. ఈ మేరకు ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే కన్సల్టెన్సీ రాష్ట్రంలో రెండు చోట్ల డ్రైపోర్టుల ఏర్పాటును ప్రతిపాదించింది. ఒక్కో డ్రైపోర్టు ఏర్పాటుకు 1,200 ఎకరాల భూమి, రూ.3,020 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. అయితే వీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి వుంది. పొరుగు రాష్ట్రాల్లోని నౌకాశ్రయాలను కలుపుతూ కృష్ణా, గోదావరి నదీ జలమార్గాల అభివృద్ధికి కేంద్ర సాయం కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లో ట్రేడ్ సెంటర్ మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా ఫార్మాసిటీ, వరంగల్ టెక్స్టైల్ పార్కు, పాశమైలారం పారిశ్రామిక పార్కులో ఉమ్మడి కాలుష్య శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండు మేధో సంపత్తి కేంద్రాలు ఉండగా.. వీటి సంఖ్యను మరింత పెంచడం ద్వారా మేధో సంపత్తి హక్కులు, ట్రేడ్‌మార్కుల రిజిస్ట్రేషన్ తదితరాలకు రక్షణ కల్పిస్తారు. చెన్నై ట్రేడ్ సెంటర్, బెంగుళూరు ట్రేడ్ సెంటర్ తరహాలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ట్రేడ్ సెంటర్ స్థాపించాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలోని వాణిజ్య సంస్థలన్నింటినీ ఒకే వేదిక మీదకు తెచ్చేలా తెలంగాణ వాణిజ్య భవనం పేరిట ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను నిర్మిస్తారు. అపెడా వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో ఉమ్మడి ప్యాకేజింగ్, స్టోరేజీ సపోర్ట్, ఎగుమతి విధానాలు, నిబంధనలు తదితరాలపై ఎగుమతిదారులకు శిక్షణ ఇస్తారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్యత్ బంధు పథకం ద్వారా కోరాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎగుమతులకు అనువైన వాతావరణం, అవరోధాలు, మౌలిక సౌకర్యాల కల్పనపై ఇప్పటికే స్థూల అవగాహనకు వచ్చామని.. త్వరలో నూతన విధానం రూపొందించి ముఖ్యమంత్రి పరిశీలనకు పంపుతామని పరిశ్రమల శాఖ వర్గాలు చెప్పాయి. -
వాణిజ్య కేంద్రంగా ఖమ్మం
ఖమ్మం గాంధీచౌక్: బ్రిటీష్ కాలం నాటి చట్టాలతో వివిధ వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ఆయా చట్టాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ధ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.సోమవారం రాత్రి స్థానిక వర్తక సంఘం భవనంలో జరిగిన చాంబర్ ఆఫ్ కామర్స్ 75 వసంతాల వజ్రోత్సవ వేడుకల ముగింపు సభలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొందని, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. వ్యాపారులు సంతోషంగా ఉంటే రైతులు సంతోషంగా ఉంటారని, వారి ద్వారా కూలీలు తద్వారా ప్రభుత్వం ఆనందంగా ఉంటుందని అన్నారు. గుజరాత్, పంజాబు రాష్ట్రాల కన్నా అభివృద్ధిలో, వ్యాపార, వ్యవసాయ రంగాలలో ముందంజలో ఉండే విధంగా కృషి జరుగుతుందన్నారు. జిల్లాలో ఖమ్మన్ని వాణిజ్య కేంద్రంగా గుర్తింపును తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తుమ్మల అన్నారు. కొత్తగూడెం, ఇల్లెందు వంటి పట్టణాలు పారిశ్రామికంగా, సింగరేణి కేంద్రాలకు బాసిల్లుతున్నాయని, ఖమ్మం వాణిజ్య కేంద్రంగా మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రణాళిక చేస్తున్నామని అన్నారు. ఖమ్మం నగరానికి వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందే అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్నారు. జిల్లాలో రహదారుల అభివృద్దికి మరో రూ.500 కోట్లు వెచ్చిచనున్నామని తెలిపారు. ఖమ్మాన్ని అనుసందానం చేస్తూ జాతీయ రహదారులను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నామని అన్నారు. విద్య, వ్యవసాయం, సాంస్కతిక రంగాలతో పాటు అన్ని రంగాల్లో ఖమ్మాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపి గుర్తింపు తీసుకువచ్చేందు కృషి చేస్తానన్నారు. మనిషి విశాలంగా ఎదగాలని సినీ గేయ రచయిత సుద్దాల అశోక తేజ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయలో అందరూ బాగస్వాములు కావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ, ఇతర రంగాలకు మాదిరిగా పరిశ్రమలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శివకుమార్ గుప్తాఅన్నారు. పన్నుల విధానంలో అనేక ఇబ్బందులను వ్యాపారులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రిని కలిసి విన్నవించామన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మేళ్ల చెరువు వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించిన సభలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొండబాల కోటేశ్వరరావు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణారావు, మాజీ అధ్యక్ష, కార్యదర్శులు కొప్పు నరేష్ కుమార్, మెంతుల శ్రీశైలం తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు గుడవర్తి శ్రీనివాస రావు, సహాయ కార్యదర్శి చింతల రామలింగేశ్వరరావు, కోశాధికారులు కురువెల్ల ప్రవీణ్ కుమార్, తూములూరి లక్ష్మీ నర్సింహారావు, రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యులు అశోక్, 19 శాఖల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని వర్తక సంఘం భవన ఆవరణలో మంత్రి ప్రతిష్టించారు. ‘వాణిజ్య వాణి’ సావనీరును ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. -
ప్రపంచ పర్యాటక ప్రదర్శన ప్రారంభం
చెన్నై, సాక్షి ప్రతినిధి : ప్రపంచంలోని పలు పర్యాటక కేంద్రాలను ప్రజలకు పరిచయం చేసేందుకు రూపొందించిన ప్రదర్శన చెన్నైలోని ట్రేడ్ సెంటర్లో శుక్రవారం ప్రారంభమైంది. ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ప్రదర్శనలో తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ తదితర 15 రాష్ట్రాలు, గోవా, పదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల టూరిజం శాఖలతోపాటు థాయ్‌లాండ్, మలేషియా, దుబాయ్, స్విట్జర్ల్యాండ్, మాల్దీవులు, భూటాన్, నేపాల్ దేశాల వారు స్టాళ్లను ఏర్పాటు చేశారు. స్టాళ్ల వద్ద ఆయా దేశాలు, రాష్ట్రాల టూరిజం ప్రతినిధులు తమ ప్రాంతాల్లోని విశేషాలను, ప్రదేశాలను, ఎలా చేరుకోవాలో వివరించారు. మీడియా సమావేశంలో స్పేర్ ట్రావెల్‌మీడియా, ఎగ్జిబిషన్స్ డెరైక్టర్ రోహిత్హంగల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 8 నగరాల్లో నిర్వహించనున్న ఈ ప్రదర్శనలను తొలిసారిగా చెన్నైతోనే ప్రారంభించామన్నారు. ఈనెల 13వ తేదీతో చెన్నైలో ముగించుకుని 18 నుంచి 28వ తేదీ వరకు బెంగళూరులో రెండో ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. ఆ తరువాత వరుసగా ఢిల్లీ, ముంబై, పూనే, హైదరాబాద్, కొచ్చిన్, కోల్‌కతాలో ప్రదర్శన ఉం టుందన్నారు. పర్యాటకంపై ప్రజల్లో ఆశలున్నా ఖరీదైన వ్యవహారమనే భావనతో వెనక్కుతగ్గుతున్నారన్నారు. అవగాహనతో ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా అతి చౌకగానే పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చని చెప్పారు. తమ ప్రదర్శనల ఉద్దేశం ప్రజలకు చేరువయ్యేందుకేనని వివరించారు. ప్రదర్శన ప్రారంభ సూచికగా గుజరాత్ టూరిజం వారు ఏర్పాటుచేసిన జానపద నృత్యాలు ఆహూతులను అలరించాయి.