furlough
-
జీతాల్లేవ్.. మూణ్నెళ్లు ఇంటి దగ్గరే ఉండండి
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తమ 150 మంది క్యాబిన్ సిబ్బందిని మూడు నెలల పాటు ఫర్లాఫ్ చేయాలని నిర్ణయించింది. అంటే మూడు నెలలపాటు పని లేదని, జీతాలు ఇవ్వలేమని, ఉద్యోగులు విధుల్లోకి రావద్దని ప్రకటించింది.ఆర్థిక ఇబ్బందులు, చట్టపరమైన సమస్యలతో సతమతమవుతున్న స్పైస్‌జెట్ తక్కువ సంఖ్యలో విమానాలతో పనిచేస్తోంది. ప్రస్తుతం కేవలం 22 విమానాలను మాత్రమే నడిపిస్తోంది. సంస్థలోని మొత్తం 150 మంది క్యాబిన్ సిబ్బందిని మూడు నెలల పాటు వేతనం లేకుండా సెలవుపై పంపనున్నట్లు ఎయిర్‌లైన్ ప్రతినిధి తాజాగా తెలిపారు. అంతకుముందు రోజు, ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ స్పైస్‌జెట్‌పై నిఘాను మరింత పెంచినట్లు తెలిపింది."స్పైస్‌జెట్ 150 మంది క్యాబిన్ సిబ్బందిని తాత్కాలికంగా మూడు నెలల పాటు ఫర్లాఫ్లో ఉంచడానికి కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత లీన్ ట్రావెల్ సీజన్, తగ్గిన విమానాల పరిమాణానికి ప్రతిస్పందనగా, సంస్థ దీర్ఘకాలిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది" అని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫర్లాఫ్ కాలంలో, క్యాబిన్ క్రూ సభ్యులు స్పైస్‌జెట్ ఉద్యోగులుగానే కొనసాగుతారని, అన్ని ఆరోగ్య ప్రయోజనాలు, ఆర్జిత సెలవులు చెక్కుచెదరకుండా ఉంటాయని చెప్పారు. -
అనూహ్య పరిణామం: ఎన్నికల వేళ డేరా బాబా బయటకు!
హత్య కేసులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు స్వల్ప ఊరట లభించింది. డేరా సచ్ఛ సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఫర్లాగ్(తాత్కాలిక సెలవు) మంజూరు అయ్యింది. అదీ ఎన్నికల వేళ కావడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.. 2017లో అత్యాచార కేసులో ఇరవై ఏళ్ల శిక్ష, మేనేజర్‌తో పాటు ఓ జర్నలిస్ట్ హత్య కేసులో డేరా సచ్ఛ సౌధా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జీవిత ఖైదు విధించింది పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. అప్పటి నుంచి హర్యానాలోని రోహ్తక్ జిల్లా సునారియా జైలులో ప్రస్తుతం డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో జైళ్ల శాఖ అధికారులు 21 రోజుల ఫర్లాగ్ జారీ చేశారు. దీంతో ఈ సాయంత్రం(సోమవారం) గుర్మీత్ సింగ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంతకు ముందు తన మెడికల్ చెకప్‌ల కోసం, ఆరోగ్యం బాగోలేని తల్లిని చూసుకోవడానికి 54 ఏళ్ల డేరా బాబాకు ఎమర్జెన్సీ పెరోల్ (సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం) వరకు మాత్రమే జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు 21 రోజులపాటు ఫర్లాగ్ జారీ కావడం విశేషం. చట్టం ప్రకారం ఫర్లాగ్ ప్రతీ ఖైదీ హక్కు.. అందుకే ఆయనకు జారీ చేశాం అని హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్‌సింగ్ చౌతాలా తెలిపారు. అయితే ప్రత్యేకించి కారణం ఏంటన్నది మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. అయితే పొరుగు రాష్ట్రం పంజాబ్‌లో ఎన్నికలకు రెండు వారాల ముందే రహీమ్‌సింగ్ విడుదలకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. పంజాబ్ మాల్వా రీజియన్‌లో డేరా బాబాకు ఫాలోవర్లు ఎక్కువ. పైగా పంజాబ్ అసెంబ్లీ 117 స్థానాల్లో.. 69 మాల్వా రీజియన్‌లోనే ఉన్నాయి. ఇక హర్యానా బీజేపీ పాలిత రాష్ట్రంకాగా.. డేరా బాబా ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఎలాగైనా పంజాబ్‌లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న వాదన ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఇదిలా ఉంటే డేరా సచ్ఛ సౌధా మద్దతుతోనే 2007లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాన్ని సాధించింది. డేరా బాబా జైల్లో ఉన్నప్పటికీ.. ఆయన అనుచరులు మాత్రం భారీ ఎత్తున్న కార్యక్రమాల్ని నిత్యం నిర్వహిస్తూ.. సోషల్ మీడియాలో డేరాబాబాను, డేరా సచ్ఛ సౌధాను ట్రెండ్ చేస్తూ ఉంటారు. -
రేప్ కేసులో జైలుకు వెళితే ఫర్లాఫ్ ఉండదు
ముంబై: అత్యాచార కేసులో దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేప్ కేసులో జైలుశిక్ష పడ్డ ఖైదీలకు ఇక మీదట ఫర్లాఫ్ (సెలవు లాంటిది) ఇవ్వరు. సవరించిన జైలు మాన్యువల్‌లో ఈ మేరకు నిబంధనలను చేర్చారు. కొత్తగా 30 సవరణలతో కూడిన జైలు మాన్యువల్‌ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు నోటిఫై చేశారు. ఇందులో రేప్ కేసులో శిక్షపడ్డవారిని ఫర్లాగ్కు అనర్హులుగా చేర్చారు. సవరించిన మాన్యువల్‌ను ప్రింటింగ్‌కు పంపారు. దీన్ని త్వరలోనే ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టనున్నారు. ఫర్లాఫ్ కింద ఓ ఖైదీకి ఏడాదికి మొత్తం 28 సెలవులుంటాయి. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఒకేసారి 14 రోజులు సెలవు తీసుకునే వెసులుబాటు ఉంది. అధికారులు అనుమతిస్తే మరో 14 రోజులు సెలవు తీసుకోవచ్చు. ఇక మీదట రేప్ కేసులో ఖైదీలకు ఫర్లాఫ్ తీసుకోవడానికి వీలు ఉండదు. పెరోల్ మంజూరుపైనా కఠిన నిబంధనలు చేర్చారు. -
జైలుకొచ్చినా మళ్లీ ఇంటికి సంజయ్!
ముంబై: రెండు వారాల ఫర్లాగ్(సెలవులాంటిది)పూర్తవడంతో లొంగిపోయేందుకు ఎరవాడ జైలుకు చేరుకున్న నటుడు సంజయ్‌దత్ చివరి నిమిషంలో జరిగిన పరిణామంతో ఇంటికి కెళ్లారు. ఆరోగ్యం బాలేదంటూ ఫర్లాగ్‌ను పొడిగించాలంటూ డిసెంబర్ 27న పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నందున, లొంగిపోవాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర హోం మంత్రి అనడంతో ఆయన లొంగిపోలేదని సంజయ్ న్యాయవాది తెలిపారు. నిబంధనల ప్రకారం ఫర్లాగ్ పూర్తవడంతో గురువారం సంజయ్ జైలులో లొంగిపోవాలి. ఆయన అనారోగ్యం నిజమో కాదో తేల్చాలంటూ ముంబై పోలీసులను కోరామని, దీనిపై వేచి చూస్తున్నామని డీజీపీ (జైళ్లు) తెలిపారు. -
మళ్లీ జైలుకు సంజయ్ దత్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సెలవు ముగిసిపోయింది. ఆయనకు మంజూరుచేసిన 14 రోజుల ఫర్లాఫ్ ముగియడంతో.. ఇంటి నుంచి మళ్లీ బయల్దేరి ఎర్రవాడ జైలుకు వెళ్లారు. తన ఫర్లాఫ్ పొడిగించాలని సంజయ్ దత్ చేసిన విజ్ఞప్తిని జైలు అధికారులు తిరస్కరించారు. పొడిగింపు విషయమై తాము పోలీసు అధికారులను అడిగామని, అయితే.. తమకు వాళ్ల నుంచి ఎలాంటి సమాచారం అందలేదని మహారాష్ట్ర హోంశాఖ తెలిపింది. 1993 నాటి ముంబై వరుస పేలుల్ల అనంతరం ఏకే 56 రైఫిల్‌ను కలిగి ఉండటం, దాన్ని చట్టవిరుద్ధంగా నాశనం చేయడంతో జైలుశిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్.. ఇటీవలే.. డిసెంబర్ 24వ తేదీన 14 రోజుల ఫర్లాఫ్ సెలవుపై బయటకు వచ్చారు. డిసెంబర్ 27వ తేదీనే ఆయన తన సెలవు పొడిగించాలని దరఖాస్తు చేసుకున్నారు. కానీ అదనపు సెలవు మంజూరు కాకపోవడంతో సంజూబాబా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. -
మళ్లీ జైలుకు సంజయ్‌దత్
ముంబై: రెండు వారాల బెయిల్ గడువు ముగియడంతో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ గురువారం తిరిగి జైలుకెళ్లనున్నారు. గడువు పొడిగించాలని దత్ చేసుకున్న అప్పీలు వారం గడిచినా... దీనిపై జైలు అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తరఫు న్యాయవాది హితేష్ జైన్ వెల్లడించారు. పుణే జైలు నుంచి ముంబైకి ఎటువంటి పత్రాలు అందలేదని తెలిపారు. 1993లో ముంబై వరుస బాంబు పేలుళ్లు కేసుకు సంబంధించి... అక్రమ ఆయుధాల కేసులో సంజయ్ దత్ కు సుప్రీంకోర్టు అయిదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. పుణెలోని ఎరవాడ జైలులో సంజయ్ దత్ శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 2013 మే నుంచి 2014 మే మాసం వరకు దాదాపు 100 రోజులు బెయిల్‌పై జైలు నుంచి సంజయ్ బయటకు వచ్చారు. -
సంజయ్ దత్‌కు 14 రోజుల సెలవు
పుణె: పుణె యరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌కు 14 రోజుల తాత్కాలిక సెలవు లభించింది. బుధవారం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. సెలవు కావాలని సంజయ్ విన్నవించగా, మంగళవారం జైలు అధికారులు మంజూరు చేశారు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో గతేడాది సంజయ్ దత్‌కు ఐదేళ్ల శిక్ష పడిన సంగతి తెలిసిందే. సంజయ్ ఇప్పటికి 18 నెలల జైలు శిక్ష పూర్తి చేశారు. -
సంజయ్ దత్ పెరోల్ గడువు పొడగింపు
అక్రమ ఆయుధాల కేసులో ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడి పుణె ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తనకు పెరోల్ గడువును పెంచాల్సిందిగా చేసిన విజ్ఞప్తికి అధికారులు సానుకూలంగా స్పందించారు. సంజయ్ కోరిక మేరకు మరో 14 రోజులు మెడికల్ లీవ్ మంజూరు చేశారు. ఆయన కాలికి చికిత్స చేయించుకునేందుకు కోసం ఈ నెల 1న 14 రోజుల మంజూరు చేశారు. ఈ గడువు నేటితో ముగియడంతో సంజయ్ పెరోల్ పొడగించాలని కోరాడు. కుటుంబంతో గడిపేందుకు, కాలికి చికిత్స చేయించుకోవడానికి మరికొంత సమయం అవసరమని ఆయన విన్నవించాడు. అక్రమ ఆయుధాల కేసులో ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడిన సంజయ్ దత్.. ఈ సంవత్సరం మే 16వ తేదీ నుంచి పుణెలోని ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ముంబై పేలుళ్ల సమయంలో సంజయ్ వద్ద కూడా కొన్ని ఆయుధాలు లభించాయి. వాటిలో ఏకే-57 లాంటి రైఫిళ్లు కూడా ఉన్నాయి. ఆత్మరక్షణ కోసమే వాటిని ఉంచుకున్నట్లు చెప్పినా, వాటికి తగిన లైసెన్సు లేకపోవడంతో సంజూబాబాపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు సుదీర్ఘ కాలం పట్టడంతో ఇటీవలే సంజయ్‌దత్ జైల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే.