మళ్లీ జైలుకు సంజయ్ దత్ | sanjay dutt goes back to jail | Sakshi
Sakshi News home page

మళ్లీ జైలుకు సంజయ్ దత్

Published Thu, Jan 8 2015 4:42 PM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

మళ్లీ జైలుకు సంజయ్ దత్

మళ్లీ జైలుకు సంజయ్ దత్

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సెలవు ముగిసిపోయింది. ఆయనకు మంజూరుచేసిన 14 రోజుల ఫర్లాఫ్ ముగియడంతో.. ఇంటి నుంచి మళ్లీ బయల్దేరి ఎర్రవాడ జైలుకు వెళ్లారు. తన ఫర్లాఫ్ పొడిగించాలని సంజయ్ దత్ చేసిన విజ్ఞప్తిని జైలు అధికారులు తిరస్కరించారు. పొడిగింపు విషయమై తాము పోలీసు అధికారులను అడిగామని, అయితే.. తమకు వాళ్ల నుంచి ఎలాంటి సమాచారం అందలేదని మహారాష్ట్ర హోంశాఖ తెలిపింది.

1993 నాటి ముంబై వరుస పేలుల్ల అనంతరం ఏకే 56 రైఫిల్ను కలిగి ఉండటం, దాన్ని చట్టవిరుద్ధంగా నాశనం చేయడంతో జైలుశిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్.. ఇటీవలే.. డిసెంబర్ 24వ తేదీన 14 రోజుల ఫర్లాఫ్ సెలవుపై బయటకు వచ్చారు. డిసెంబర్ 27వ తేదీనే ఆయన తన సెలవు పొడిగించాలని దరఖాస్తు చేసుకున్నారు. కానీ అదనపు సెలవు మంజూరు కాకపోవడంతో సంజూబాబా జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement