జైలుకొచ్చినా మళ్లీ ఇంటికి సంజయ్! | Sanjay Dutt returns to jail in Pune, but doesn't surrender and comes back to Mumbai | Sakshi
Sakshi News home page

జైలుకొచ్చినా మళ్లీ ఇంటికి సంజయ్!

Published Fri, Jan 9 2015 12:27 PM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

జైలుకొచ్చినా మళ్లీ ఇంటికి సంజయ్!

జైలుకొచ్చినా మళ్లీ ఇంటికి సంజయ్!

ముంబై: రెండు వారాల ఫర్లాగ్(సెలవులాంటిది)పూర్తవడంతో లొంగిపోయేందుకు ఎరవాడ జైలుకు చేరుకున్న  నటుడు సంజయ్‌దత్ చివరి నిమిషంలో జరిగిన పరిణామంతో ఇంటికి కెళ్లారు. ఆరోగ్యం బాలేదంటూ ఫర్లాగ్‌ను పొడిగించాలంటూ డిసెంబర్ 27న పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నందున, లొంగిపోవాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర హోం మంత్రి అనడంతో ఆయన లొంగిపోలేదని సంజయ్ న్యాయవాది  తెలిపారు. నిబంధనల ప్రకారం ఫర్లాగ్ పూర్తవడంతో గురువారం సంజయ్ జైలులో లొంగిపోవాలి. ఆయన అనారోగ్యం  నిజమో కాదో తేల్చాలంటూ ముంబై పోలీసులను కోరామని, దీనిపై వేచి చూస్తున్నామని డీజీపీ (జైళ్లు) తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement