ముగిసిన పెరోల్.. మళ్లీ జైల్లో సంజయ్ దత్ | Sanjay Dutt back in Jail as parole comes to end | Sakshi
Sakshi News home page

ముగిసిన పెరోల్.. మళ్లీ జైల్లో సంజయ్ దత్

Published Sat, Mar 22 2014 4:39 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ముగిసిన పెరోల్.. మళ్లీ జైల్లో సంజయ్ దత్ - Sakshi

ముగిసిన పెరోల్.. మళ్లీ జైల్లో సంజయ్ దత్

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మళ్లీ పుణెలోని ఎర్రవాడ జైలుకు చేరుకున్నారు. గత డిసెంబర్ 21వ తేదీన పెరోల్పై విడుదలైన సంజూబాబా.. గతంలో ఎప్పుడూ లేనట్లుగా తన పెరోల్ను రెండుసార్లు పొడిగించుకున్నారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. తన భార్య మాన్యతకు ఆరోగ్యం బాగోలేదన్న కారణం చూపించి ఆయన పెరోల్ పొడగించుకున్నారు. ఆ గడువు ఎట్టకేలకు ముగిసింది.

1993 నాటి ముంబై పేలుళ్లకు ముందు ఏకే-56 తుపాకిని అక్రమంగా కలిగి ఉన్న నేరానికి గాను సంజయ్ దత్ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. గత సంవత్సరం మే నెలలో టాడా కోర్టు ఎదుట లొంగిపోయాడు. పెరోల్ మీద విడుదల కావడంపై ఆయన ఇంటి ఎదుట, జైలు బయట కూడా పలువురు సంజయ్ దత్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement