errawada jail
-
జైలుకొచ్చినా మళ్లీ ఇంటికి సంజయ్!
ముంబై: రెండు వారాల ఫర్లాగ్(సెలవులాంటిది)పూర్తవడంతో లొంగిపోయేందుకు ఎరవాడ జైలుకు చేరుకున్న నటుడు సంజయ్‌దత్ చివరి నిమిషంలో జరిగిన పరిణామంతో ఇంటికి కెళ్లారు. ఆరోగ్యం బాలేదంటూ ఫర్లాగ్‌ను పొడిగించాలంటూ డిసెంబర్ 27న పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నందున, లొంగిపోవాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర హోం మంత్రి అనడంతో ఆయన లొంగిపోలేదని సంజయ్ న్యాయవాది తెలిపారు. నిబంధనల ప్రకారం ఫర్లాగ్ పూర్తవడంతో గురువారం సంజయ్ జైలులో లొంగిపోవాలి. ఆయన అనారోగ్యం నిజమో కాదో తేల్చాలంటూ ముంబై పోలీసులను కోరామని, దీనిపై వేచి చూస్తున్నామని డీజీపీ (జైళ్లు) తెలిపారు. -
మళ్లీ జైలుకు సంజయ్ దత్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సెలవు ముగిసిపోయింది. ఆయనకు మంజూరుచేసిన 14 రోజుల ఫర్లాఫ్ ముగియడంతో.. ఇంటి నుంచి మళ్లీ బయల్దేరి ఎర్రవాడ జైలుకు వెళ్లారు. తన ఫర్లాఫ్ పొడిగించాలని సంజయ్ దత్ చేసిన విజ్ఞప్తిని జైలు అధికారులు తిరస్కరించారు. పొడిగింపు విషయమై తాము పోలీసు అధికారులను అడిగామని, అయితే.. తమకు వాళ్ల నుంచి ఎలాంటి సమాచారం అందలేదని మహారాష్ట్ర హోంశాఖ తెలిపింది. 1993 నాటి ముంబై వరుస పేలుల్ల అనంతరం ఏకే 56 రైఫిల్‌ను కలిగి ఉండటం, దాన్ని చట్టవిరుద్ధంగా నాశనం చేయడంతో జైలుశిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్.. ఇటీవలే.. డిసెంబర్ 24వ తేదీన 14 రోజుల ఫర్లాఫ్ సెలవుపై బయటకు వచ్చారు. డిసెంబర్ 27వ తేదీనే ఆయన తన సెలవు పొడిగించాలని దరఖాస్తు చేసుకున్నారు. కానీ అదనపు సెలవు మంజూరు కాకపోవడంతో సంజూబాబా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. -
జైలుకెళ్లి.. 8 ప్యాక్ చేశాడు!!
బాలీవుడ్ బ్యాడ్బోయ్ సంజయ్ దత్‌కు జైలు అధికారులు సెలవలు ఇవ్వడంతో బయటకు వచ్చాడు. చాలా రోజుల తర్వాత పుణెలోని ఎర్రవాడ జైలు నుంచి ముంబైలోని తన ఇంటికి వచ్చిన సంజయ్ దత్.. కాస్త గెడ్డం నెరిసి, జుట్టు తెల్లబడినా, ఇంతకుముందు కంటే మంచి ఉత్సాహంగా కనిపించాడు. అంతేకాదు, జైల్లో ఇన్నాళ్ల బట్టి ఏం చేశాడో ఏమో గానీ.. ఏకంగా 8 ప్యాక్ సాధించాడు. బాలీవుడ్ హీరోలు, విలన్లు ... అందరూ ఇప్పుడు కండలు పెంచడానికి తంటాలు పడుతుంటే, సంజూబాబా మాత్రం ఎర్రవాడ జైల్లో ఉండే 8 ప్యాక్ తెచ్చుకున్నాడు. ఒకప్పటి తన కండలను ప్రదర్శించడానికి షర్టు తీసేసి.. కేవలం బనియన్‌తోనే ఫొటోలకు పోజులిచ్చాడు. ఇది చూసి అంతా.. ఇంటికంటే గుడి పదిలం అన్నట్లు సంజయ్‌దత్‌కు జైలే బాగున్నట్టుందని చెవులు కొరుక్కున్నారట. -
ముగిసిన పెరోల్.. మళ్లీ జైల్లో సంజయ్ దత్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మళ్లీ పుణెలోని ఎర్రవాడ జైలుకు చేరుకున్నారు. గత డిసెంబర్ 21వ తేదీన పెరోల్‌పై విడుదలైన సంజూబాబా.. గతంలో ఎప్పుడూ లేనట్లుగా తన పెరోల్‌ను రెండుసార్లు పొడిగించుకున్నారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. తన భార్య మాన్యతకు ఆరోగ్యం బాగోలేదన్న కారణం చూపించి ఆయన పెరోల్ పొడగించుకున్నారు. ఆ గడువు ఎట్టకేలకు ముగిసింది. 1993 నాటి ముంబై పేలుళ్లకు ముందు ఏకే-56 తుపాకిని అక్రమంగా కలిగి ఉన్న నేరానికి గాను సంజయ్ దత్ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. గత సంవత్సరం మే నెలలో టాడా కోర్టు ఎదుట లొంగిపోయాడు. పెరోల్ మీద విడుదల కావడంపై ఆయన ఇంటి ఎదుట, జైలు బయట కూడా పలువురు సంజయ్ దత్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు.