జైలుకెళ్లి.. 8 ప్యాక్ చేశాడు!! | sanjay dutt exhibits his 8 pack after return from errawada jail | Sakshi
Sakshi News home page

జైలుకెళ్లి.. 8 ప్యాక్ చేశాడు!!

Published Wed, Dec 24 2014 7:30 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

జైలుకెళ్లి.. 8 ప్యాక్ చేశాడు!! - Sakshi

జైలుకెళ్లి.. 8 ప్యాక్ చేశాడు!!

బాలీవుడ్ బ్యాడ్బోయ్ సంజయ్ దత్కు జైలు అధికారులు సెలవలు ఇవ్వడంతో బయటకు వచ్చాడు. చాలా రోజుల తర్వాత పుణెలోని ఎర్రవాడ జైలు నుంచి ముంబైలోని తన ఇంటికి వచ్చిన సంజయ్ దత్.. కాస్త గెడ్డం నెరిసి, జుట్టు తెల్లబడినా, ఇంతకుముందు కంటే మంచి ఉత్సాహంగా కనిపించాడు. అంతేకాదు, జైల్లో ఇన్నాళ్ల బట్టి ఏం చేశాడో ఏమో గానీ.. ఏకంగా 8 ప్యాక్ సాధించాడు.

బాలీవుడ్ హీరోలు, విలన్లు ... అందరూ ఇప్పుడు కండలు పెంచడానికి తంటాలు పడుతుంటే, సంజూబాబా మాత్రం ఎర్రవాడ జైల్లో ఉండే 8 ప్యాక్ తెచ్చుకున్నాడు. ఒకప్పటి తన కండలను ప్రదర్శించడానికి షర్టు తీసేసి.. కేవలం బనియన్తోనే ఫొటోలకు పోజులిచ్చాడు. ఇది చూసి అంతా.. ఇంటికంటే గుడి పదిలం అన్నట్లు సంజయ్దత్కు జైలే బాగున్నట్టుందని చెవులు కొరుక్కున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement