విమానం రెక్కలపై సిబ్బంది డ్యాన్సులు.. | Cabin Crew Dancing And Posing Atop Plane Wing Dangerous Video Goes Viral - Sakshi
Sakshi News home page

Cabin Crew Dance, Posing Plane Wing Video: విమానం రెక్కలపై సిబ్బంది డ్యాన్సులు.. మేనేజ్‌మెంట్ ఫైర్..

Published Wed, Aug 30 2023 6:55 PM | Last Updated on Wed, Aug 30 2023 7:40 PM

Cabin Crew Dance Atop Plane Wing - Sakshi

విమానం రెక్కపై డ్యాన్స్ చేస్తూ స్విస్‌ ఎయిర్‌పోర్టు లైన్స్‌ సిబ్బంది బుక్కయ్యారు. బోయింగ్ 777 విమానం రెక్కపై సిబ్బంది డ్యాన్సులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో విమానయాన సంస్థ చర్యలకు సిద్ధపడింది. విమానాల్లో ఇలాంటి ఘటనలు ఎంత మాత్రం సహించరానివని స్పష్టం చేసింది. 

బోయింగ్ 777 విమానం ఎయిర్‌పోర్టులో ఆగింది. ఈ క్రమంలో ఓ మహిళా సిబ్బంది విమానం రెక్కపై డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత అధికారిగా కనిపించే మరో వ్యక్తి కూడా బాడీ బిల్డింగ్ పోజులు ఇచ్చారు. ఈ దృశ్యాలను విమానం కోసం టెర్మినల్ వద్ద వేచి చూస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారి స్విస్ ఇంటర్నేషనల్‌ ఎయిర్ పోర్టు యాజమాన్యానికి చేరింది.

బోయింగ్ విమానం రెక్క ఐదు మీటర్ల వెడల్పు,  16.4 మీటర్ల ఎత్తు ఉంటుంది. అంత ఎత్తు నుంచి కిందపడితే తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుందని ఎయిర్‌ పోర్టు యాజమాన్యం తెలిపింది. సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడితే క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చూడటానికి సరదాగా అనిపించినా.. ఇలాంటి ఘటనలు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసింది. 

ఇదీ చదవండి: ప్రభుత్వాఫీస్‌లో అధికారి మద్యం సేవిస్తూ.. వీడియో వైరల్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement