breaking news
wing
-
యువ వైద్యులపై కూటమి సర్కార్ అరాచకం
సాక్షి, తాడేపల్లి: విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి, దేశంలో వైద్య వృత్తిని కొనసాగించేందుకు అన్ని అర్హతలను సాధించిన యువ వైద్యుల పట్ల కూటమి సర్కార్ అరాచకంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ విద్యార్ది విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్రలు మండిపడ్డారు.తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఏపీకి చెందిన దాదాపు 1500 మంది యువ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం గత 13 నెలలుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా, వారిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగితే, పోలీసులతో వారిని అరెస్ట్ చేయించి, టెంపో వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించడం ద్వారా ప్రభుత్వం తన కర్కశత్వాన్ని చాటుకుందని ధ్వజమెత్తారు. ఇంకా వారేమన్నారంటే..విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకుని ఎన్ఎంసీ పరీక్ష క్వాలిఫై అయిన వారికి నిబంధనల ప్రకారం ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తారు. అనంతరం వారికి రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 13 నెలల నుంచి విద్యార్ధులు పీఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నా, వారి గోడు వినేవారే లేరు. రాష్ట్ర వైద్యశాఖ మంత్రిని కలిసిన యువ వైద్యులపై ఆయన కనీసం సానుభూతి కూడా చూపకుండా, బెదిరింపు ధోరణితో మాట్లాడారు.ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్‌ను కలిసి మొరపెట్టుకుంటే, వీరికి సంబంధించిన ఫైల్‌పై ఆయన సంతకం పెట్టారు. కానీ విజయవాడ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మాత్రం ఈ ఫైల్‌పై కొర్రీలు వేస్తున్నారు. ఎన్ఎంసీ నుంచి క్లారిటీ ఉంటేనే పీఆర్ ఇస్తానంటూ, రెండేళ్ళ పాటు ఇంటర్న్‌షిప్ చేస్తేనే పీఆర్ ఇస్తామంటూ రకరకాలుగా సాకులు చూపుతూ అభ్యర్ధులను వేధిస్తున్నారు. వీరితో పాటు క్వాలిఫై అయిన వారందరూ వివిధ రాష్ట్రాల ఆయా ప్రభుత్వాల నుంచి పీఆర్ సర్టిఫికేట్లు పొందారు.కానీ ఏపీలో మాత్రమే యువ వైద్యుల పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. దీనిపై హెల్ట్ యూనివర్సిటీ ఎదుట యువ వైద్యులు ఆందోళన చేస్తే, రాత్రి సమయంలో టెంపో వ్యాన్లలో వారిని బలవంతంగా ఎక్కించి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. డాక్టర్స్ డే రోజునే వైద్య విద్యార్ధుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరించింది.రాష్ట్రంలో రూ.8500 కోట్లతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎంగా వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు సీట్లు కేటాయిస్తామని కేంద్రం ముందుకు వస్తే, సీఎం చంద్రబాబు దానికి మోకాలడ్డారు. తమకు సీట్లు అక్కరలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మరో వైపు ఇప్పటికే పూర్తయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది.విదేశాల్లో చదువుకుని, ప్రాక్టీస్‌కు అన్ని అర్హతలు సాధించుకున్న యువ వైద్యుల పట్ల కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఏం అనాలో కూడా అర్థం కావడం లేదు. తక్షణం యువ వైద్యులకు న్యాయం చేయకపోతే వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం తరుఫున ఆందోళనలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. -
రాజకీయంగా ఎన్ని ఇబ్బందులొచ్చినా రాజీ పడలేదు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం అనేది రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని, అందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని యువ విభాగాన్ని ఉద్దేశించి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన యువ విభాగ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘యూత్ వింగ్ అనేది పార్టీలో క్రియాశీలకమైంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర. పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి. లీడర్లుగా ఎదిగేందుకు ఇప్పుడు గొప్ప అవకాశం. పార్టీ ప్రారంభించిన కొత్తలో అందరూ కొత్తవాళ్లే. పార్టీ పెట్టిన కొత్తలో నేను, మా అమ్మ మాత్రమే ఉన్నాం. నామీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్నవాళ్లు నాతో వచ్చారు. నా ప్రస్థానం అక్కడ నుంచి మొదలయ్యింది.. .. ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీ నాకు వచ్చింది. పార్లమెంటులో ప్రతి సభ్యుడూ మనవైపు చూసే పరిస్థితి. దాన్ని జీర్ణించుకోలేక మనమీద పగబట్టారు. 18 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే.. వాళ్లందరిచేతా రాజీనామా చేయించాను. ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. ఆ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ కలిసే పోటీచేశాయి. 2014లో 67 మందితో గెలిచాం. మళ్లీ మన దగ్గర నుంచి 23 మందిని లాక్కున్నారు. .. ఎన్నికష్టాలు వచ్చినా, విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశాం. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా రాజీ పడలేదు. ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది చాలా ముఖ్యం. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ప్రజలకు తోడుగా నిలబడాలి. మంచి పలకరింపు అన్నది కూడా చాలా ముఖ్యం. ఇవి చేయగలిగితే.. లీడర్‌గా ఎదుగుతారు. యూత్ వింగ్‌లో ఉన్న వారు ప్రభావంతంగా పనిచేయాలి. రాజకీయంగా ఎదగడం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని రాజకీయంగా పెంచడం నా చేతుల్లో ఉంది. పెరగాలంటే.. మీరు కష్టపడాలి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయండి. సమర్థత ఉన్నవారిని పార్టీ వ్యవస్థల్లోకి తీసుకురండి. పార్టీని వ్యవస్థీకృతంగా బలోపేతం చేయాలి... మీ పనితీరును మీరు ఎప్పటికప్పుడు మీరే మదింపు చేసుకోండి. జోన్ల వారీగా యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా పెడుతున్నాం. ఎమ్మెల్యేలుగా పోటీచేసిన యువకులు దీనికి ఉంటారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోకి రావాలి. వాస్తవాలను చెప్పడానికి ఇది ఒక ఆయుధం. అన్యాయాలను, అక్రమాలను ఈ మాధ్యమం ద్వారా వెలుగులోకి తీసుకురావాలి. ప్రజలందరి దృష్టికి ఈ సమాచారాన్ని చేరవేయాలి. ఎవరికి, ఏ అన్యాయం జరిగినా సమాజం దృష్టికి తీసుకు రావాలి అని వైఎస్ జగన్ సూచించారు. ఈ భేటీలో యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సహా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు హాజరయ్యారు. -
రేపు వైఎస్సార్సీపీ యువజన విభాగం సభ్యులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ యువజన విభాగం సభ్యులతో రేపు (మంగళవారం) ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. రేపు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ యువజన విభాగం ప్రతినిధులతో సమావేశమవనున్నారు. ఈ భేటీలో యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, యువజన విభాగం జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు పాల్గొంటారు. వీరితో పాటు పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు. -
నిరుద్యోగులకు బాబు వెన్నుపోటు.. ఎల్లుండి వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, తాడేపల్లి: ఎల్లుండి(జూన్ 13) వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలపాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఏడాదిగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేసినందుకు వైఎస్సార్సీపీ నిరసన చేపట్టనుంది. అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాలు నిర్ణయించాయి.ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్.. అంటూ ఊదర గొట్టి తీరా అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు చేతులెత్తేయడంపై నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు కల్పించని పక్షంలో ప్రతినెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీపై పాలకులు మాట్లాడకపోవడంపై నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందంటూ మండిపడుతున్నారు.మరో వైపు, చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. -
విమానం రెక్కలపై సిబ్బంది డ్యాన్సులు..
విమానం రెక్కపై డ్యాన్స్ చేస్తూ స్విస్ ఎయిర్‌పోర్టు లైన్స్ సిబ్బంది బుక్కయ్యారు. బోయింగ్ 777 విమానం రెక్కపై సిబ్బంది డ్యాన్సులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో విమానయాన సంస్థ చర్యలకు సిద్ధపడింది. విమానాల్లో ఇలాంటి ఘటనలు ఎంత మాత్రం సహించరానివని స్పష్టం చేసింది. బోయింగ్ 777 విమానం ఎయిర్‌పోర్టులో ఆగింది. ఈ క్రమంలో ఓ మహిళా సిబ్బంది విమానం రెక్కపై డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత అధికారిగా కనిపించే మరో వ్యక్తి కూడా బాడీ బిల్డింగ్ పోజులు ఇచ్చారు. ఈ దృశ్యాలను విమానం కోసం టెర్మినల్ వద్ద వేచి చూస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారి స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు యాజమాన్యానికి చేరింది. Moment air hostesses for #Swiss International Air Lines are caught on camera posing for selfies as they dance on wing of Boeing 777 in #BuenosAires, #Argentina pic.twitter.com/9lCwCrjVRA — Hans Solo (@thandojo) August 27, 2023 బోయింగ్ విమానం రెక్క ఐదు మీటర్ల వెడల్పు, 16.4 మీటర్ల ఎత్తు ఉంటుంది. అంత ఎత్తు నుంచి కిందపడితే తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుందని ఎయిర్ పోర్టు యాజమాన్యం తెలిపింది. సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడితే క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చూడటానికి సరదాగా అనిపించినా.. ఇలాంటి ఘటనలు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: ప్రభుత్వాఫీస్‌లో అధికారి మద్యం సేవిస్తూ.. వీడియో వైరల్.. -
ఆర్టీసీ బస్సుకు తగిలిన ‘విమానం’ రెక్క.. పలువురికి గాయాలు
తిరువనంతపురం: రోడ్డుపై వెళ్తున్న బస్సుకు విమానం రెక్క తగిలి ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆకాశంలో వెళ్లే విమానం.. రోడ్డుపై వెళ్తున్న బస్సుకు ఎలా తగిలిందని అనుకుంటున్నారా? అయితే, ఇక్కడ విమానం లేదు. ట్రక్కులో తరలిస్తున్న ఓ పాత విమానం రెక్క.. రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సుకు తగిలింది. ఈ సంఘటన కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని బలరామపురంలో బుధవారం రాత్రి జరిగింది. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. విమానం రెక్క తరలిస్తున్న ట్రెయిలర్ ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని రోడ్డుపైనే వదిలేసి పరారయ్యాడు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడంది. దీంతో రహదారిని కొన్ని గంటల పాటు మూసివేశారు అధికారులు. ఇదీ చదవండి: ‘ఈ విచారణలేందుకు.. వీలైతే నేరుగా అరెస్ట్ చేయండి’.. జార్ఖండ్ సీఎం సవాల్ -
విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి.. విమానం రెక్కపై నడిచాడు
పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి.. ఎందుకు ఆ పని చేశాడో తెలియదు. కానీ, ఆ నేరానికి అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. ఏకంగా విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి.. విమానం రెక్కపై నడిచాడు. అమెరికాలోని చికాగో విమానాశ్రయంలోకి ఈ ఘటన జరిగింది. రన్‌వే మీద దిగుతున్న విమానం ఎమర్జెన్సీ ద్వారాన్ని తెరిచి రెక్కమీదకు వెళ్లాడు ఆ వ్యక్తి. అతన్ని శాన్ డియాగోకు చెందిన రాండీ ఫ్రాంక్ (57)గా గుర్తించారు.‘‘విమానం రన్‌వేపై దిగి గేటు వద్దకు వస్తుండగా అతను హఠాత్తుగా ఎమర్జెన్సీ డోర్ తెరిచి రెక్కమీదకు వెళ్లాడు. కిందకు జారి ఎయిర్‌ఫీల్డ్ మీదకు దిగాడు’’ అని చికాగో పోలీసులు తెలిపారు. సర్కస్ ఫీట్‌తో రిస్క్ చేఏసిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారణం ఏంటన్నది మాత్రం చెప్పట్లేదు అతను. ఇదిలా ఉంటే.. 2020లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఓ విమానం ల్యాండ్ అయ్యే టైంలో ఓ మహిళ ప్యాసింజర్.. ఉక్కపోస్తోందంటూ ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచి రెక్కల మీదకు వెళ్లి గాలిని పీల్చుకుంది. అయితే ఆమె మద్యం, డ్రగ్స్ మత్తులో అలా చేసిందనుకున్న పోలీసులు పరీక్షలు నిర్వహించగా.. అలాంటిదేం లేదని తేలింది. @fly2ohare guy jumps out of my plane before we get to the gate. @united UA2478 pic.twitter.com/xgxRszkBfH — MaryEllen Eagelston (@MEEagelston) May 5, 2022 -
Telangana: ఆర్టీసీలో అనాలసిస్ వింగ్
సాక్షి, హైదరాబాద్: ఏకకాలంలో సంస్కరణల వేగానికి, నష్టాల బ్రేక్‌కు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. అసలే నష్టాలు, ఆపై కోవిడ్ దెబ్బ.. ఫలితంగా కుదేలైన ప్రగతిచక్రాన్ని గాడిలో పెట్టేందుకు సంస్థ దిద్దుబాటు మొదలుపెట్టింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ అధికారులతో నిర్వహించిన భేటీలో సంస్థ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంస్థ నష్టాలకు కారణాలు, సంస్కరణల ఆవశ్యకతపై అధ్యయనం చేసేందుకు ఆర్టీసీలో కొత్తగా ట్రాఫిక్ అనాలిసిస్ వింగ్‌ను ఏర్పాటు చేశారు. కొందరు సీనియర్ అధికారుల నేతృత్వంలో ఆ విభాగం పని ప్రారంభించనుంది. రద్దీ ఉన్న వైపే దృష్టి.. ఆర్టీసీకి కొన్నేళ్లుగా రికార్డుస్థాయిలో నష్టాలొస్తుండగా, ప్రైవేటు ట్రావెల్స్ మాత్రం మంచి ఆదాయాన్ని నమోదు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ తరహాలోనే చాలా ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నాయి. మరి ప్రైవేటు ట్రావెల్స్‌కు ఆదాయం వస్తుండగా, ఆర్టీసీ ఎందుకు నష్టాలను మూటగట్టుకుంటోందనే కోణంలో ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ప్రైవేటు ట్రావెల్స్ ఏయే రూట్లలో ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నాయి, ఏయే ప్రాంతాలవైపు వాటికి రద్దీ అధికంగా ఉంటోంది, ఆర్టీసీని కాదని ప్రయాణికులు ఎందుకు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు.. అనే కోణాల్లో ఈ విభాగం వివరాలు సేకరిస్తుంది. వివిధ కేటగిరీ బస్సుల్లో వేటికి ఎక్కువ ఆదాయం వస్తోంది.. వేటివైపు ప్రయాణికులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు, ఏయే మార్గాల్లో ఎక్కువ రద్దీ ఉంటోంది.. ఏయే సమయాల్లో ప్రయాణాలు ఎక్కువగా ఉంటున్నాయి.. తదితర వివరాలను కూడా సేకరించనుంది. తర్వాత ఆర్టీసీకి–ప్రైవేటు ట్రావెల్స్‌కు మధ్య ఉన్న తేడాలను అధికారులు గుర్తించి తదనుగుణంగా చర్యలు చేపట్టనున్నారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తున్న ఆయా రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు, తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న టీఎస్ ఆర్టీసీ బస్సుల ఆదాయాలు, ఆక్యుపెన్సీ రేషియో, బస్సుల నిర్వహణ, రద్దీ ఉన్న రూట్లు.. తదితర వివరాలను రాబట్టి విశ్లేషించనుంది. తెలంగాణ ఆర్టీసీ– వేరే రాష్ట్రాల ఆర్టీసీల మధ్య పోలికలు, వ్యత్యాసాలను కూడా బేరీజు వేయనుంది. వెరసి డిమాండ్ ఉన్న కేటగిరీ బస్సులు, రద్దీ ఉన్న మార్గాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఆర్టీసీ నిర్ణయాలు తీసుకునుంది. విస్తరించటంతో నష్టమా.. ప్రాంతాలు విస్తరించేకొద్దీ, జనాభా పెరిగే కొద్దీ ఆర్టీసీ సేవలను కూడా విస్తరించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రజారవాణా అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ విస్తరణ శాస్త్రీయంగా ఉండాలి. కానీ, ఇప్పటి వరకు ఆర్టీసీ అధికారులు క్షేత్రస్థాయిలో సరైన కసరత్తు చేయకుండా అశాస్త్రీయంగా విస్తరిస్తూ వస్తున్నారు. ఇది ఆర్టీసీకి నష్టాలు తెచ్చిపెడుతోంది. కొందరు డిపో మేనేజర్లు రూట్ స్టడీలు పక్కాగా నిర్వహిస్తుండటంతో ఆయా డిపోల్లో ఆదాయం మెరుగ్గా ఉంటోంది. ఇప్పుడు విస్తరణ కంటే, ఉన్నఫళంగా నష్టాలను తగ్గించేందుకే ఆర్టీసీ ఆసక్తి చూపుతోంది. తాజా కసరత్తు కూడా అందులో భాగంగానే కనిపిస్తోంది. -
ప్రాణభయంతో విమానం రెక్కలోంచి దూకేశారు
డల్లాస్ : ప్రాణ భయంతో విమానం రెక్కలోంచి ప్రయాణికులు దూకేసిన ఘటన అల్బుకర్క్యూ ఇంటర్నేషనల్ సన్‌పోర్ట్(మెక్సికో)లో చోటు చేసుకుంది. పెద్ద శబ్దంతో విమానం ల్యాండ్ కాగా.. పేలిపోతుందన్న భయంతో ప్రయాణికులు ఈ పనికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. సౌత్ వెస్ట్ ఎయిర్వేస్కు చెందిన విమానం ఆదివారం రాత్రి ప్రయాణికులతో ఫోయెనిక్స్(అరిజోనా) నుంచి లవ్ ఫీల్డ్(డల్లాస్)కు బయలుదేరింది. అయితే కాసేపటికే క్యాబిన్లో ఏదో వాసన వస్తున్న విషయాన్ని గమనించిన సిబ్బంది విషయాన్ని పైలెట్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంతలో వేడి ఎక్కువగా ఉందంటూ ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. క్యాబిన్లో పొగలు రావటం ప్రారంభం కాగా.. ప్రమాద సంకేతాలు కనిపించటంతో పైలెట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్‌కు సిద్ధమయ్యాడు. అల్బుకర్క్యూ ఇంటర్నేషనల్ సన్‌పోర్ట్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. విమానం ల్యాండ్ అయ్యాక ప్రయాణికులంతా బయటకు వస్తున్న క్రమంలో.. ఇద్దరు ప్రయాణికులు మాత్రం విమానం రెక్క వద్ద ఉన్న ఎమర్జెన్సీ డోర్ నుంచి రన్‌వే పైకి దూకేశారు. అది గమనించిన ఓ ప్రయాణికుడు వారిద్దరూ అలా దూకటాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సుమారు 8 అడుగుల ఎత్తు నుంచి దూకటంతో వారికి గాయాలైనట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ప్రయాణికులందరినీ వేరే విమానంలో తరలించిన ఎయిర్వేస్.. గాయపడిన వాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. A flight to remember. Something I hope I never experience again. You see these things in movies and never expect it to happen to you! Most importantly everyone is safe but man what a scare! @CNN @NBCDFW @CBS @wfaa @PhilthaThrill pic.twitter.com/BvwAqqIOZC — Brandon Cox (@brandoncox91) 12 March 2018 -
ప్రధాని విమానం రెక్క పలక ఊడిపోయింది
టోక్యో : జపాన్ ప్రధాని షింజో అబే ప్రయాణించే అధికారిక జంబో జెట్ విమానాల్లో ఒక విమానం రెక్కకు ఉండే ఓ పలక(ల్యాప్ టాప్ సైజ్లోది) ఊడిపోయింది. ఈ విషయాన్ని జపాన్ రక్షణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత భయాందోళనలు అలుముకున్నట్లు తెలిపారు. హోక్కాయిడోకు ఉత్తరంగా ఉన్న ద్వీపానికి బోయింగ్ 747 జంబో జెట్ బయలుదేరిన తర్వాత దాని రెక్క పలక ఊడిపోయిందని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. అది కనీసం 15 అంగుళాల వరకు ఉంటుందని, విమానం రైట్ వింగ్‌కు ఉండే ఇంజిన్ పక్కన ఉండే పైలాన్‌కు కనెక్ట్ చేసి ఉంటుందని తెలిపారు. ఆ సమయంలో ప్రధాని అబే విమానంలో లేరని, దాంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయిందని అన్నారు. మరోపక్క, ఆ ప్యానెల్ ఎలా ఊడిపోయిందో తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించినట్లు వివరించారు. కాగా, తూర్పు యూరప్ దేశాలకు అబే నేడు (శుక్రవారం) బయలుదేరుతున్నారు. ఆరు రోజులపాటు జరిగే ఈ పర్యటన ఈ జంబో జెట్ విమానాల ద్వారానే జరగనుంది. -
ఉత్తమ యూనిట్‌గా కాకినాడ ఎన్సీసీ ఆంధ్రా ఎయిర్ వింగ్
బాలాజీచెరువు (కాకినాడ) : రాజస్ధాన్ రాష్ట్రం జోథ్‌పూర్‌లో అక్టోబర్ 15 నుంచి 26వ తేదీ వరకూ జరిగిన ఆల్ఇండియా వాయు సైనిక్ క్యాంపులో కాకినాడ ఆంధ్రా ఎయిర్ వింగ్ టెక్నికల్ ఎన్సీసీ యూనిట్ ఉత్తమ యూనిట్‌గా ఎంపికైంది. ఆ వివరాలను కాకినాడ న్ సీసీ యూనిట్ వింగ్ గ్రూపు కెప్టెన్ ఎల్వీఎస్ సుధాంశ బుధవారం జేఎన్ టీయూకేలో విలేకరుల సమావేశంలో వివరించారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో ద్వితీయస్ధానం సా«ధించి జోథ్‌పూర్‌లో జరిగిన జాతీయ పోటీల్లో ఉత్తమ యూనిట్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీల్లో దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన 17 డైరెక్టరేట్ల నుంచి 600 మంది ఎన్ సీసీ క్యాడెట్లు ప్లైంగ్, ఫైరింగ్, ఎన్ సీసీ సిలబస్ రాత పరీక్ష, టెంట్ వేసే విధానం వంటి పోటీలు నిర్వహించగా కాకినాడ యూనిట్ నుంచి వెళ్లిన పీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పి.ధనుంజయ్, కె.సత్యనారాయణ, తేజస్వినీదేవి, ఆర్.నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉత్తమ యూనిట్‌గా గుర్తింపు పొందేందుకు కృషిచేశారన్నారు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ క్యాంపులలో ప్రతిభ చూపిన విద్యార్థులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ఇస్తారని తెలిపారు. కాకినాడ ఎన్ సీసీ యూనిట్ వింగ్‌కు ప్రత్యేక గుర్తిపు తెచ్చిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులతో పాటు ఎన్ సీసీ సిబ్బంది పాల్గొన్నారు. -
వింగ్‌తో ఉబ్బసానికి చెక్!
వాషింగ్టన్: చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిపై ఉబ్బసం వ్యాధి(ఆస్థమా) ప్రభావాన్ని చూపిస్తుంది. శీతాకాలంలో మరింత ఎక్కువగా ఈ వ్యాధి ప్రభావానికి లోనవడం జరుగుతోంది. ఉబ్బసం వ్యాధి బారిన పడకుండా ముందుగానే వ్యాధి సంకేతాలను గుర్తించి హెచ్చరించడానికి అమెరికా శాస్త్రవేత్తలు 'వింగ్' అనే కొత్త పరికరాన్ని రూపొందించారు. జేబులో ఇమిడేంత చిన్నదిగా ఉండే ఈ పరికరాన్ని స్మార్ట్ ఫోన్‌తో అనుసంధానించి ఉపమోగించవచ్చు. అమెరికాకు చెందిన స్పారో లాబ్స్ దీనిని రూపొందించింది. వాతావరణంలో ఉబ్బసం వ్యాధి కారకాలను ముందుగానే పసిగట్టి ఫోన్‌కు సమాచారాన్ని అందించేలా వింగ్‌ను రూపొందిచారు. హెడ్‌ఫోన్‌ను అనుసంధానించే జాక్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేసేలా దీనిని తయారు చేయడంతో వింగ్‌కు ప్రత్యేకంగా చార్జింగ్, బ్యాటరీల అవసంరం లేదు. వింగ్ ఉబ్బసంతో పాటు శ్వాసవ్యవస్థకు సంబంధించిన అనేక రుగ్మతలను ముందుగానే పసిగడుతుంది. క్రానిక్ పల్మొనరీ డిసీజ్, సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటి ప్రాణాంతక వ్యాధులను సైతం గుర్తించి ఫిజీషియన్కు సమాచారాన్ని చేరవేసేలా దీనిని తయారు చేశారు. ప్రస్తుతం వింగ్ 'అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్' పరిశీలనలో ఉందనీ, త్వరలోనే దీనిని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పారో లాబ్స్ తెలిపింది.