ఉత్తమ యూనిట్‌గా కాకినాడ ఎన్‌సీసీ ఆంధ్రా ఎయిర్ వింగ్
ఉత్తమ యూనిట్‌గా కాకినాడ ఎన్‌సీసీ ఆంధ్రా ఎయిర్ వింగ్
Published Wed, Nov 9 2016 10:48 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM
బాలాజీచెరువు (కాకినాడ) : రాజస్ధాన్ రాష్ట్రం జోథ్‌పూర్‌లో అక్టోబర్ 15 నుంచి 26వ తేదీ వరకూ జరిగిన ఆల్‌ఇండియా వాయు సైనిక్ క్యాంపులో కాకినాడ ఆంధ్రా ఎయిర్ వింగ్ టెక్నికల్ ఎన్‌సీసీ యూనిట్ ఉత్తమ యూనిట్‌గా ఎంపికైంది. ఆ వివరాలను కాకినాడ న్ సీసీ యూనిట్ వింగ్ గ్రూపు కెప్టెన్ ఎల్‌వీఎస్ సుధాంశ బుధవారం జేఎన్ టీయూకేలో విలేకరుల సమావేశంలో వివరించారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో ద్వితీయస్ధానం సా«ధించి జోథ్‌పూర్‌లో జరిగిన జాతీయ పోటీల్లో ఉత్తమ యూనిట్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీల్లో దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన 17 డైరెక్టరేట్‌ల నుంచి 600 మంది ఎన్ సీసీ క్యాడెట్లు ప్‌లైంగ్, ఫైరింగ్, ఎన్ సీసీ సిలబస్ రాత పరీక్ష, టెంట్ వేసే విధానం వంటి పోటీలు నిర్వహించగా కాకినాడ యూనిట్ నుంచి వెళ్లిన పీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పి.ధనుంజయ్, కె.సత్యనారాయణ, తేజస్వినీదేవి, ఆర్.నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉత్తమ యూనిట్‌గా గుర్తింపు పొందేందుకు కృషిచేశారన్నారు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ క్యాంపులలో ప్రతిభ చూపిన విద్యార్థులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ఇస్తారని తెలిపారు. కాకినాడ ఎన్ సీసీ యూనిట్ వింగ్‌కు ప్రత్యేక గుర్తిపు తెచ్చిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులతో పాటు ఎన్ సీసీ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement