Airplane Wing Transport On Trailer Truck Hits RTC Bus In Kerala - Sakshi
Sakshi News home page

ఆర్‌టీసీ బస్సును ఢీకొట్టిన ‘విమానం’ రెక్క.. పలువురికి గాయాలు 

Published Thu, Nov 3 2022 4:06 PM | Last Updated on Thu, Nov 3 2022 5:52 PM

Airplane Wing Transported On Trailer Truck Hits RTC Bus In Kerala - Sakshi

తిరువనంతపురం: రోడ్డుపై వెళ్తున్న బస్సుకు విమానం రెక్క తగిలి ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆకాశంలో వెళ్లే విమానం.. రోడ్డుపై వెళ్తున్న బస్సుకు ఎలా తగిలిందని అనుకుంటున్నారా? అయితే, ఇక్కడ విమానం లేదు. ట్రక్కులో తరలిస్తున్న ఓ పాత విమానం రెక్క.. రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సుకు తగిలింది. ఈ సంఘటన కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని బలరామపురంలో బుధవారం రాత్రి జరిగింది. 

గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. విమానం రెక్క తరలిస్తున్న ట్రెయిలర్‌ ట్రక్కు డ్రైవర్‌ వాహనాన్ని రోడ్డుపైనే వదిలేసి పరారయ్యాడు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడంది. దీంతో రహదారిని కొన్ని గంటల పాటు మూసివేశారు అధికారులు.

ఇదీ చదవండి: ‘ఈ విచారణలేందుకు.. వీలైతే నేరుగా అరెస్ట్‌ చేయండి’.. జార్ఖండ్‌ సీఎం సవాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement