ఫ్లైట్‌లో ఇండియన్‌ చెస్‌ స్టార్‌.. క్యాబిన్‌ క్రూ వినూత్న అభినందనలు! | IndiGo Air Hostess Pens Heartfelt Note For Chess Star Praggnanandhaa | Sakshi
Sakshi News home page

Praggnanandhaa: ఫ్లైట్‌లో ఇండియన్‌ చెస్‌ స్టార్‌.. క్యాబిన్‌ క్రూ వినూత్న అభినందనలు!

Published Sat, Sep 2 2023 4:07 PM | Last Updated on Sat, Sep 2 2023 4:20 PM

IndiGo Air Hostess Pens Heartfelt Note For Chess Star Praggnanandhaa - Sakshi

భారత చెస్‌ యువ సంచలనం, ఇండియన్‌ చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానందకు అంతటా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఇంటర్నేషనల్‌ చెస్‌ ఫెడరేషన్‌ ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఆడి భారత్‌కు పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చిన ప్రజ్ఞానందకు  ఇండిగో ఎయిర్‌లైన్స్‌ క్యాబిన్‌ క్రూ వినూత్నంగా అభినందనలు తెలిపారు.

ఇటీవల ఇండిగో విమానంలో తల్లితో కలిసి ప్రయాణించిన ప్రజ్ఞానందకు విమానంలో ఉన్న క్యాబిన్ సిబ్బంది ఒక నోట్ అందించారు. చెస్ స్టార్ ప్రజ్ఞానంద, అతని తల్లితో కలిసి క్యాబిన్ క్రూ మెంబర్ దిగిన ఫొటోతో పాటు సిబ్బంది స్వయంగా రాసిన అభినందన నోట్ చిత్రాన్ని ఇండిగో సంస్థ ఎక్స్‌(ట్విటర్‌)లో షేర్‌ చేసింది.

భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ మాస్టర్ ప్రజ్ఞానంద తమ ఫ్లైట్‌లో ప్రయాణించడం గౌరవంగా ఉందని, మొట్టమొదటి ప్రపంచ కప్ ఫైనలిస్ట్‌గా నిలిచిన యువ ఛాంపియన్‌కు అభినందనలు అంటూ ప్రశంసించింది.

ప్రజ్ఞానందను విమానంలో ఆన్‌బోర్డ్‌ చేయడం తమకు నిజంగా గౌరవం, సంతోషాన్ని కలిగిస్తోందని, దేశానికి ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన అందరికీ స్ఫూర్తి అంటూ క్యాబిన్‌ క్రూ స్వయంగా రాసి సంతకాలు చేసి ప్రజ్ఞానందకు అందించారు. 

అజర్‌బైజాన్‌లో జరిగిన ఫిడే ప్రపంచ కప్‌ ఫైనల్‌కు చేరి యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించిన ప్రజ్ఞానంద.. ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్‌తో తలపడి రన్నరప్‌గా నిలిచారు. దీంతో ప్రజ్ఞానందకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్వయంగా అభినందించారు. అలాగే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రత్యేకంగా ప్రశంసించి మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని బహుమతిగా అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement