Why It Is Necessary To Switch Your Phone To Airplane Mode During A Flight, Explained In Telugu - Sakshi
Sakshi News home page

విమాన ప్రయాణంలో ఫోన్‌లో ఫ్లైట్‌ మోడ్‌ ఎందుకు ఆన్‌ చేస్తారో తెలుసా?

Published Sun, Jul 24 2022 11:36 AM | Last Updated on Sun, Jul 24 2022 5:17 PM

Why Switch Off Mobile Phone In Airplane Mode During A Flight - Sakshi

తరుచూ మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా? అయితే మీరు ప్లైట్‌ జర్నీ చేసే సమయంలో క్యాబిన్‌ క్రూ సిబ్బంది మీ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయమని లేదంటే ఫోన్‌లో ఉన్న ఫ్లైట్‌ మోడ్‌ ఆన్‌ చేయమని అనౌన్స్‌ చేస్తారు.అసలు ఫ్లైట్‌ జర్నీలో ఫ్లైట్‌ మోడ్‌ ఎందుకు ఆన్‌ చేయమంటారో తెలుసా?    

మనఫోన్‌లో వైర్‌ లెస్‌ కనెక‌్షన్స్‌ అంటే బ్లూటూత్‌, వైఫై, మొబైల్‌ డేటా, నెట్‌ వర్క్‌ కనక్షన్‌ మొత్తం ఆఫ్‌ చేసేస్తుంది. ఎందుకంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థ (ఆర్‌ఎఫ్‌సీ) కేబిన్‌ క్రూ సిబ్బంది మాట్లాడుకునే మాటలు మ్యాచ్‌ అయితే ఫైలెట్స్‌కు చిన్న సౌండ్‌ లాగా వస్తుంది.

వాళ్లలో వాళ్లకే కమ్యూనికేషన్‌లో ఇబ్బందిని కలిగిస్తుంటుంది. అందుకే ప్రతి ఫోన్‌లో ఏరోప్లెయిన్‌ మోడ్‌ ఇస్తారు. అమెరికాలాంటి దేశాల్లో సైతం ఈ ఆప్షన్‌ను తప్పని సరిగా వినియోగించాలి.లేదంటే సదరు విమానయాన సిబ్బంది ఫైన్‌ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement