
నర్సంపేట పట్టణంలోని సంజీవని ఆశ్రమంలో రక్షాబంధన్ వేడుకలు
వరంగల్ : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా ఆడపడుచులు తమ సోదరులకు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించారు. బైక్‌లు నడిపేటప్పుడు ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవడానికి పలు ప్రాంతాల్లో హెల్మెట్లను బహూకరించారు. సోదరులు తమకు తోచిన కట్నకానుకలను అందించారు. వృద్ధాశ్రమాలు, అనాథ బాలల ఆశ్రమాల్లో కూడా వేడుకలు వైభవంగా జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment