సాక్షి, హైదరాబాద్: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం మధ్యాహ్నం బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో భేటీ కానున్నారు. కేజ్రీవాల్‌తో పాటు కూడా వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం ఈ భేటీలో పాల్గొంటారు. ప్రగతి భవన్ చేరుకున్న ఈ ఇద్దరికీ కేసీఆర్ ఆత్మీయ స్వాగతం పలికారు. లంచ్ తర్వాత వీళ్ల భేటీ జరగనున్నట్లు సమాచారం.
అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై కేంద్రంతో ఢీ కొట్టడానికి కేజ్రీవాల్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. పలువురు ముఖ్యమంత్రులను కలిశారు కూడా. తాజాగా కేసీఆర్‌తోనూ కేజ్రీవాల్ ఇదే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఓవైపు నీతి ఆయోగ్ సమావేశానికి గైర్హాజరు అయ్యి మరీ ఈ ముగ్గురు సీఎంలు భేటీ అవుతుండడం గమనార్హం. సమావేశం అనంతరం ముగ్గురు సీఎంలు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
చదవండి: త్వరలో సికింద్రాబాద్ – నాగ్‌పూర్ మధ్య.. వందేభారత్
Comments
Please login to add a commentAdd a comment