
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ తనయు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నగరానికి చేరుకున్నారు. బుధవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారామె. ఇక బేగంపేట విమానాశ్రయం నుంచి సరాసరి ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. అంతకు ముందు ట్విటర్ ద్వారా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారామె.
కవిత వెంట సోదరుడు.. మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రి హరీష్ రావు, మరికొందరు పార్టీ నేతలు ఉన్నారు. ప్రగతి భవన్‌కు వెళ్లిన ఆమె.. పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ విచారణ గురించి ఆమె వివరించొచ్చని సమాచారం.
ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కాంలో ఆమె వరుసగా రెండు రోజులపాటు(సోమ, మంగళవారాల్లో.. ) ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచే ఆమె ఈడీ ఆఫీస్‌కు వెళ్లారు కూడా. ఇక.. ఈడీ తనని విచారించిన తీరును ఆమె కేసీఆర్‌కు వివరించొచ్చని పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు ఉగాది నేపథ్యంలో ఆమె ఇవాళ మొత్తం ప్రగతి భవన్‌లోనే కుటుంబ సభ్యుల మధ్య గడుపుతారని తెలుస్తోంది. ఇక లిక్కర్ స్కాంలో ఈడీ ఆమెను మరోసారి విచారించే అవకాశం లేకపోలేదు.
Wishing you all a happy and prosperous #Ugadi pic.twitter.com/t0EbIyjQgI
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 22, 2023
ఇదీ చదవండి: తప్పుడు ఆరోపణలు చేయడం కాదా?-కవిత
Comments
Please login to add a commentAdd a comment