కవితను చూసి కేసీఆర్‌ భావోద్వేగం | Kalvakuntla Kavitha Reached Erravalli Farm House, KCR Gets Emotional After Seeing Daughter, Video Goes Viral | Sakshi
Sakshi News home page

కవితను చూసి కేసీఆర్‌ భావోద్వేగం.. పదిరోజులు ఎర్రవెల్లిలోనే విశ్రాంతి

Published Thu, Aug 29 2024 1:33 PM | Last Updated on Thu, Aug 29 2024 3:53 PM

Kalvakuntla Kavitha Reached Erravalli Farm House

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.. తన తండ్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిశారు. పార్టీ శ్రేణులు, అనుచరులతో  కలిసి ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారామె.  కవితను చూడగానే కేసీఆర్‌ ఒక్కసారిగా భాద్వేగానికి గురయ్యారు.

పది రోజుల పాటు ఫాంహౌస్‌లోనే విశ్రాంతి తీసుకుంటానని ఈ సందర్భంగా కవిత వెల్లడించారు. ఈ సమయంలో తనను కలవడానికి ఎవరూ రావొద్దని.. అంతా సహకరించాలని అభిమానులు, కార్యకర్తలకు ఆమె విజ్ఞప్తి చేశారు. పది రోజుల తర్వాత తానే అందరికీ అందుబాటులోకి వస్తానని అన్నారామె. అక్కడే విశ్రాంతి తీసుకుంటూనే ఆమె రాజకీయాలపై కూడా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇక, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో దాదాపు ఐదున్నర నెలల పాటు జైలు జీవితం గడిపిన కవిత మంగళవారం సాయంత్రం బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు కవిత చేరుకున్నారు. ఈ సందర్భంగా కవితకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. 

 

 


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement