
నర్సాపూర్: నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డికి ప్రగతి భవన్ నుంచి శనివారం రాత్రి పిలుపు వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. నర్సాపూర్ టికెట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నర్సాపూర్ టికెట్ తనకే ఇవ్వాలని మదన్‌రెడ్డి కోరగా.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతారెడ్డికే ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని చెప్పినట్లు తెలిసింది
పార్టీ నిర్ణయించే అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని మంత్రులు ఆయనకు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. మీరు కేసీఆర్ సమకాలికులని, సన్నిహితులని, మీకు సీఎం అన్యాయం చేయరని మద న్‌రెడ్డికి మంత్రులు నచ్చ చెప్పారని అంటున్నారు. పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సునీతారెడ్డికి టికెట్ ఇవ్వనున్నారని, ఆమెను గెలిపించుకు ని రావాల్సి ఉంటుందని సూచించారని తెలిసింది.
మీ స్థాయికి తగిన పదవి వస్తుంది
నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందకుండా, వారికి తప్పుడు సమాచారం వెళ్లకుండా మీరు స్పందించాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం మీకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని, మీ స్థాయికి తగిన పదవి ఇచ్చి పార్టీ గౌరవిస్తుందని హామీనిచి్చనట్టు సమాచారం. ఇదిలాఉండగా రేపో మాపో ఒకే వేదికపై ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, సునీతారెడ్డిను కూర్చోబెట్టి చర్చలు జరిపి నర్సాపూర్ పార్టీ టికెట్‌ను అధికారికంగా బీఆర్‌ఎస్ ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment