Narsapur Assembly Constituency
-
పుట్టింటోళ్ళు తరిమేశారు.. కట్టుకున్నోడు వదిలేశాడు!
మూడిళ్ళ చుట్టం మూతి ఎండి చచ్చినట్లు అయిందట. మాఇంటికి రాలేదు కదా... వాళ్ళింటికి కదా వచ్చారు.. అక్కడే తింటారులే అని ఈ ఇంటివాళ్ళు... అదేం లేదులే.. అక్కడికి వెళ్ళాడు కదా... తినేసి వస్తాడేమో అని ఆ ఇంటివాళ్ళు మొత్తానికి ఆ చూట్టానికి చుక్కలు చూపించి చివరకు పస్తులు పెట్టారట.. అలా అయ్యేలా ఉంది రఘురామకృష్ణం రాజు పరిస్థితి. బిజెపి... టిడిపి.. ఇలా అన్ని పార్టీల్లో తిరిగేసి. ఎక్కడ నిలువనీడ లేకుండా ఉండిపోయే పరిస్థితుల్లో అయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచారు. 2019లో వైఎస్సార్సీపీలో చేరి ఎంపీగా గెలిచిన రఘురామ ఆ తర్వాత ముసుగు తీసి చంద్రబాబు ఏజెంట్ గా మారిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో బాటు ప్రభుత్వాన్ని, అధికారులను విమర్శించడం మొదలెట్టారు. ఇదంతా సహజంగా అటు తెలుగుదేశానికి, దాని మద్దతుదారులయిన మీడియా సంస్థలకు అయన ఒక సోర్స్ గా మారిపోయారు. అయన రోజూ జగన్ మోహన్ రెడ్డిని. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ టీవీల్లో మాట్లాడడం.. దాని ఆయా సంస్థలు ఘనంగా ప్రచురించడం జరుగుతూ వస్తోంది. మొదట్లో అయన వ్యాఖ్యలు.. కామెంట్లకు మంచి రేటింగ్స్... వ్యూవర్ షిప్ ఉండేది కానీ నిత్యం జగన్‌ను తిట్టడమేపనిగా పెట్టుకున్న ఆయన్ను ఇక ప్రజలు చూడడం మానేశారు. అయినా సరే ఆయనకు వేరే గత్యంతరం లేక ఆయా మీడియా సంస్థలను అనధికార రెగ్యులర్ యాంకర్ కమ్. మోడరేటర్ కమ్ సలహాదారు... విశ్లేషకుడుగా మారిపోయారు. ఈ ఎపిసోడ్లన్నీ ముగిసి ఇప్పుడు ఆయా పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. జనసేన... తెలుగుదేశం.. వైయస్సార్ కాంగ్రెస్.. ... చివరకు ఒక్కసీటు కూడా గెలవని బిజెపి సైతం తమ అభ్యర్థులను సిద్ధం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ రఘురామకృష్ణం రాజుకు ఎవరు టికెట్ ఇస్తారన్నది అర్థం కావడం లేదు. ఆయన్ను ఎవరూ భరించలేరు.. పైగా ఆయనకు సొంత క్యాడర్ లేదు.. ప్రజల్లోనూ ఆదరణ లేదు.. అలాంటపుడు ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తే అయన దెబ్బకు ఆ ఎంపీ పరిధిలోని ఏడు ఎమ్మెల్యే సీట్లు సైతం ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆయన్ను అందరూ ఒక ఐటం క్యారెక్టర్ మాదిరి వాడుకుని పక్కనపడేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. కుక్కను శత్రువుమీద మొరగడానికి పెంచుకుంటాం... మనమీద మొరుగుతుంది అనుకుంటే చెప్పుతో కొడతాం అనే సినిమా డైలాగ్ మాదిరి... ఆయన్ను టీడీపీ... దాని అనుబంధ మీడియా కేవలం ప్రభుత్వాన్ని విమర్శించినంతవరకే మీడియాలో కవరేజి ఇచ్చి ఊరుకుంటారు తప్ప ఆయనకు ఎక్కడా టిక్కెట్ మాత్రం ఇవ్వరు అంటున్నారు. ఆయనకు నర్సాపురం... లేదా ఇంకోచోట టికెట్ ఇస్తే అయన అసమర్థత.. అహంకారం .. ఇవన్నీ కలగలిసి మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ఓడిపోతారన్న ఆందోళన ఆయనపార్టీల్లో కనిపిస్తోంది. అందుకే కేవలం ఆయన్ను తమ ఛానెళ్లలో చూపడానికి మాత్రమే వాడుకుని ఎన్నికలు.. టిక్కెట్స్ ఇచ్చేవేళ పక్కన పెట్టేస్తారు అని అంటున్నారు. ఆయన్ను ఎంపీ అభ్యర్థిగా టీడీపీ.. జనసేన కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎంపీగా గెలిచిన నాలుగేళ్ళ తరువాత అయన భోగినాడు సొంత నియోజకవర్గం నర్సాపురం వచ్చారు. ఆయనకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో భారీగా భౌన్సర్లను ఆయనే ఏర్పాటు చేసుకుని ఊళ్లోకి వచ్చారు తప్ప ఆయనకోసం ఎక్కడా అభిమానులు. క్యాడర్ ఎదురు చూడలేదు. దీంతో రాజకీయంగా అయన పాత్ర ముగిసినట్లేనని, కేవలం టీడీపీ అనుకూల మీడియాలో వ్యాఖ్యానాలు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తారు తప్ప కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయనకు దక్కదని నరసాపురం ప్రజలు అంటున్నారు. ✍️ సిమ్మాదిరప్పన్న -
సునీతా లక్ష్మారెడ్డికే నర్సాపూర్ టికెట్
సాక్షి, హైదరాబాద్: నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దానిపై సుమారు మూడు నెలలుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించుతూ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేరును పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. ప్రగతిభవన్‌లో నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి చేతుల మీదుగా కేసీఆర్ సమక్షంలోనే బుధవారం సునీతా లక్ష్మారెడ్డికి పార్టీ బీ ఫాం అందజేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దించాలని నిర్ణయించారు. పార్టీ ఎన్నికల కోర్ కమిటీ సభ్యులు, మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావు సమక్షంలో ప్రగతిభవన్‌లో మదన్‌రెడ్డి, సునీత రెడ్డి మధ్య టికెట్ వివాదానికి తెరదించారు. సీఎం సమక్షంలో హామీ ఇవ్వడంతో... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఆగస్టు 21న పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించినా నర్సాపూర్‌ను పెండింగ్ జాబితాలో పెట్టా రు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి సుమారు నెల రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ లభించినా అధికారికంగా ఆమె పేరును ప్రకటించలేదు. మదన్‌రెడ్డికే అవకాశం ఇవ్వాలంటూ ఆయన అనుచరులు మంత్రి హరీశ్‌రావు నివాసం ఎదుట ఆందోళన కూడా చేశారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రగతిభవన్‌కు తరచూ వెళ్తూ తనకు టికెట్ ఇవ్వా లని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పలుమార్లు మదన్‌రెడ్డితో భేటీ అయి ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. తాజాగా సీఎం కేసీఆర్ సమక్షంలో మదన్‌రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు ఆయన సునీతా లక్ష్మారెడ్డికి మద్దతు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మదన్‌రెడ్డి సీనియారిటీని గుర్తిస్తాం: కేసీఆర్ ‘మదన్ రెడ్డి నాతో పారీ్టలో మొదటినుంచీ కొనసాగుతున్న సీనియర్ నాయకుడు. 35 ఏండ్ల నుంచి నాతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా నాకు అత్యంత ఆప్తుడు. నాకు కుడి భుజం లాంటి వాడు. సోదర సమానుడు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజస్కందాలమీద వేసుకుని సునీతా లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా వుంది. ప్రస్తుతం మెదక్ ఎంపీగా కొనసాగుతున్న కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున ఆయన స్థానంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మదన్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మదన్‌రెడ్డికి వివాద రహితుడిగా పేర్కొంది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్‌రెడ్డి పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేసినందుకు ధన్యవాదాలు’ అని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చదవండి: కూన’పై ఎమ్మెల్యే వివేకానంద దాడి -
బీఆర్ఎస్ నర్సాపూర్ అభ్యర్థి ఖరారు
సాక్షి, హైదరాబాద్: నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి పేరును భారత రాష్ట్ర సమితి ఖరారు చేసింది. ఈ మేరకు స్వయంగా పేరు ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. బుధవారం ఆమెకు బీఫామ్ అందజేశారు. ప్రస్తుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డికి.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ, అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కోర్ కమిటీ సభ్యులు భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే నర్సాపూర్ టికెట్‌ను సునీతా లక్ష్మారెడ్డికి ఇవ్వాలని సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ మదన్ రెడ్డి నాతో పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడు. 35 ఏండ్లనుంచి నాతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా నాకు అత్యంత ఆప్తుడు. నాకు కుడి భుజం లాంటి వాడు. సోదర సమానుడు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాలమీద వేసుకుని సునీత లక్ష్మారెడ్డి ని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా వుంది. ప్రస్థుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ గా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుండి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కీలక సభ్యులకు, కార్యవర్గానికి అభినందనలు. వారి సీనియారిటిని పార్టీ గుర్తించి గౌరవించినందుకు పార్టీ మఖ్య కార్యవర్గాన్ని అభినందిస్తున్నా. మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కేవలం నర్సాపూర్ లోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వారు పాపులర్ లీడర్. వివాద రహితుడు సౌమ్యుడు మదన్ రెడ్డి గారి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాల్సివుంది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి గారు పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారు. వారికి నా ధన్యవాదాలు అభినందనలు అని కేసీఆర్ తెలిపారు. వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్‌లో ఉన్నారు. మూడుసార్లు నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్సార్, కొణిజెట్టి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు సీఎంలుగా ఉన్నప్పుడు మంత్రిగా పని చేశారు. 2019లో బీఆర్ఎస్లో చేరారామె. తెలంగాణ ప్రభుత్వంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా, సభ్యురాలిగా ఆమె పని చేశారు. -
సునీతారెడ్డికే టికెట్..
నర్సాపూర్: నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డికి ప్రగతి భవన్ నుంచి శనివారం రాత్రి పిలుపు వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. నర్సాపూర్ టికెట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నర్సాపూర్ టికెట్ తనకే ఇవ్వాలని మదన్‌రెడ్డి కోరగా.. మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డికే ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని చెప్పినట్లు తెలిసింది పార్టీ నిర్ణయించే అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని మంత్రులు ఆయనకు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. మీరు కేసీఆర్ సమకాలికులని, సన్నిహితులని, మీకు సీఎం అన్యాయం చేయరని మద న్‌రెడ్డికి మంత్రులు నచ్చ చెప్పారని అంటున్నారు. పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సునీతారెడ్డికి టికెట్ ఇవ్వనున్నారని, ఆమెను గెలిపించుకు ని రావాల్సి ఉంటుందని సూచించారని తెలిసింది. మీ స్థాయికి తగిన పదవి వస్తుంది నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందకుండా, వారికి తప్పుడు సమాచారం వెళ్లకుండా మీరు స్పందించాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం మీకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని, మీ స్థాయికి తగిన పదవి ఇచ్చి పార్టీ గౌరవిస్తుందని హామీనిచి్చనట్టు సమాచారం. ఇదిలాఉండగా రేపో మాపో ఒకే వేదికపై ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, సునీతారెడ్డిను కూర్చోబెట్టి చర్చలు జరిపి నర్సాపూర్ పార్టీ టికెట్‌ను అధికారికంగా బీఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉంది. -
నర్సాపూర్‌లో నువ్వా నేనా? సిట్టింగ్ మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మధ్య పోటీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ నర్సాపూర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ టికెట్లను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. నర్సాపూర్ టికెట్ ను పెండింగ్‌లో పెట్టడం ఆ నియోజకవర్గంలో ఉ త్కంఠ రేపుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరూ పార్టీ టికెట్ కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. ఇప్పుడీ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టడంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మెదక్ జిల్లా పర్యటన తర్వాత.. నర్సాపూర్ టికెట్ తనకంటే తనకే ఇవ్వాలంటూ మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇప్పటికే పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. మదన్‌రెడ్డి రెండు రోజుల కింద మంత్రి హరీశ్‌రావును కలసి తనకు టికెట్ ఖరారు చేసేలా చూడాలని కోరారు. సునీత కూడా హరీశ్‌రావుతోపాటు, ఎమ్మెల్సీ కవితను కలసి టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. పార్టీలో సీనియర్ నాయకుడైన మదన్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌తో స్నేహ సంబంధాలు ఉన్నాయని, అయితే ఆయన వయోభారం, ఆయన అనుచరులపై అక్రమ దందాల ఆరోపణలు ఇబ్బందికరంగా మారాయని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. సునీతకు టికెట్ ఇస్తే బీఆర్ఎస్ను వీడుతామని మదన్‌రెడ్డి వర్గీయులు అంటున్నారు. మరోవైపు నర్సాపూర్ టికెట్ ఇస్తామనే హామీతోనే సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్లో చేరారని ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. ఈ నెల 23న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించనుండటంతో.. త్వరలోనే నర్సాపూర్ టికెట్ ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇద్దరూ కలిసే టీవీ చూస్తూ.. సోమవారం మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరూ నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూర్చునే.. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనను టీవీలో వీక్షించడం గమనార్హం. వీరితోపాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి మరికొందరు నేతలూ అక్కడ ఉన్నారు. నర్సాపూర్ టికెట్ ఎవరికి ప్రకటిస్తారోనని ఉత్కంఠతో అంతా ఎదురుచూశారు. కానీ పెండింగ్‌లో పెట్టడంతో టెన్షన్లో పడ్డారు. సీఎం కేసీఆర్‌పై నమ్మకం ఉంది ‘‘సీఎం కేసీఆర్ కుటుంబంతో నాకు ఎప్పటినుంచో అనుబంధం ఉంది. ఆయన నర్సాపూర్ టికెట్ నాకే కేటాయిస్తారు. కేసీఆర్‌పై పూర్తి భరోసా ఉంది. ఈ స్థానాన్ని ఎందుకు పెండింగ్‌లో పెట్టారో తెలియదు. దీనిపై నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా..’’ – చిలుముల మదన్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. ‘‘నాకు టికెట్ ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలను కలసి విజ్ఞప్తి చేశాను. నర్సాపూర్ టికెట్ ఎందుకు ప్రకటించలేదో మాకు తెలియదు. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా..’’ – సునీతా లక్ష్మారెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ -
నర్సాపూర్ నియోజకవర్గంలో తదుపరి అభ్యర్థి ఎవరు?
నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిపై 38120 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మదన్ రెడ్డికి 105465 ఓట్లు రాగా,సునీతకు 67345 ఓట్లు వచ్చాయి. రెడ్డి వర్గానికి చెందిన మదన్ రెడ్డి గతంలో ఇక్కడ నుంచి ఐదుసార్లు గెలిచిన సిపిఐ నేత చిలుముల విఠల్ రెడ్డి కుమారుడు. కాగా ఓటమి తర్వాత సునీత లక్ష్మారెడ్డి కూడా టిఆర్ఎస్ లో చేరిపోయారు. ఆమె గతంలో మూడుసార్లు ఇక్కడ గెలిచారు. ఇక్కడ నుంచి బిజెపి పక్షాన పోటీచేసిన ఎస్.గోపికి మూడువేల లోపు ఓట్లు మాత్రమే వచ్చాయి. సునీత మంత్రిగా వై.ఎస్., రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల క్యాబినెట్లలో పనిచేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో పదిసార్లు రెడ్లు, నాలుగుసార్లు బిసి నేతలు ఎన్నికయ్యారు. నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఎనిమిది సార్లు గెలుపొందితే, సిపిఐ ఐదుసార్లు విజయం సాధించింది. ఇక్కడ టిడిపి ఒక్కసారి కూడా గెలవలేక పోయింది. రెండుసార్లు టిఆర్ఎస్ గెలుపొందింది. మాజీ ఉప ముఖ్యమంత్రి సి.జగన్నాధరావు నర్సాపూర్‌లో మూడుసార్లు గెలిచారు. జగన్నాధరావు శాసనమండలికి కూడా ఎన్నికయ్యారు. ఆయన అంజయ్య, భవనం, కోట్ల మంత్రి వర్గాలలోను సభ్యుడిగా ఉన్నారు. కొంతకాలం ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా చేపట్టారు. డిప్యూటీ స్పీకరుగా కూడా కొంత కాలం వ్యవహరించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..