ప్రగతి భవన్‌లో చేస్తున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే ఘన విజయాలెన్నో కళ్లముందు సాక్షాత్కరిస్తాయని, 75 ఏళ్లలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణ అవతరించే నాటికి, నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం.. రాష్ట్రం సాధించిన అభివృద్ధిపై ప్రసంగించారు. అనేక రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరిందన్నారు.
సత్ఫలితాలిస్తున్న పథకాలు
కరెంటు కష్టాలను అధిగమించి 24 గంటల సరఫరా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, రైతు రుణమాఫీ, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, దళితబంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, చేపపిల్లల పెంపకం, గొర్రెల పంపిణీ, సెలూన్లు.. దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్, గురుకుల విద్యాలయాల ఏర్పాటు వంటి పథకాలు, కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయని కేసీఆర్ చెప్పారు.
కేసీఆర్ కిట్, బస్తీ దవాఖానాలు, పల్లె/పట్టణ ప్రగతి, టీఎస్–ఐపాస్, భూరికార్డుల ప్రక్షాళన, ధరణి వంటివి కూడా మంచి ఫలితాల్నిచ్చా యని అన్నారు. ఎనిమిదేళ్ళలో లక్షా 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం తెలిపారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలుపొందిన తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్‌కు, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా రూ.2 కోట్ల నగదు బహుమతికి సంబంధించిన చెక్కును సీఎం అందజేసి సత్కరిం చారు. జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీల్లో స్వర్ణపతకం సాధించిన ఇషా సింగ్‌కు కూడా రూ.2 కోట్ల చెక్కును, పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న కిన్నెరమెట్ల మొగిలయ్యకు రూ.కోటి చెక్కును అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment