సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పాదయాత్ర సందర్భంగా సోమవారం రోజు టీఆర్‌ఎస్ నేతలు చేసిన దాడికి నిరసనగా ప్రగతి భవన్‌కు ముట్టడికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు.
టీఆర్‌ఎస్ నేతల దాడిలో ధ్వంసమైన కారును తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సీఎం క్యాంప్ ఆఫీస్‌కు షర్మిల బయలుదేరారు. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్ రోడ్డులో వైఎస్ షర్మిలను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. కారు అద్దాలు మూసివేసి వైఎస్ షర్మిల లోపలే కూర్చున్నారు. డోర్ లాక్ చేసి కారు దిగేందుకు నిరాకరించారు. దీంతో షర్మిల కారును క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
అనంతరం కారు డోరు తెరిచి బలవంతంగా ఆమెను కిందకు దించారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు ఆమెను తరలించారు. ఈ సందర్బంగా పోలీసుల తీరుపై వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేసిన వాహనాన్ని కేసీఆర్‌కు చూపించడానికి వెళ్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నించకూడదా?. అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: ఫాంహౌజ్ ఎపిసోడ్ ప్రకంపనలు.. కారు పార్టీలో తెర వెనక్కి ఇద్దరు.?
Comments
Please login to add a commentAdd a comment