ప్రగతిపై గొప్ప విజన్‌ ఉన్న నేత కేటీఆర్‌  | Former Karnataka CM HD Kumaraswamy Meet Telangana Minister KTR | Sakshi
Sakshi News home page

ప్రగతిపై గొప్ప విజన్‌ ఉన్న నేత కేటీఆర్‌ 

Sep 12 2022 1:48 AM | Updated on Sep 12 2022 1:48 AM

Former Karnataka CM HD Kumaraswamy Meet Telangana Minister KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అభివృద్ధిపై గొప్ప విజన్‌ ఉన్న నేత అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి అభిప్రాయపడ్డారు. ఆదివారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో జరిగిన సమావేశం అర్థవంతంగా సాగిందని ఆయన ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

ఈ సందర్భంగా కర్ణాటక – తెలంగాణ రాష్ట్రాల సమస్యలు, జాతీయ రాజకీయాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. కేటీఆర్‌ అందించిన ఆతిథ్యం, చూపించిన అభిమానంతో తన హృదయం నిండిపోయిందని కుమారస్వామి పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement