హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతున్న సమయంలోనే ప్రగతి భవన్ వద్ద ఆంక్షలను కొత్త ప్రభుత్వం తొలగించినట్లయ్యింది. సుమారు పదేళ్లుగా ఉన్న కంచెలను తొలగించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందడంతో వాటిని యుద్ధ ప్రాతిపదికిన తొలగిస్తున్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రగతి భవన్ వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఆంక్షలను విధించగా.. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వాటిని ముందుగా తొలగించేందుకు పూనుకుంది.
Comments
Please login to add a commentAdd a comment